రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ కల్కీ 2 కొత్త షెడ్యూల్ తో ఫుల్ బిజీ అయ్యాడు. తర్వాత స్పిరిట్ షెడ్యూల్ మొదలు కాబోతోంది. విచిత్రం ఏంటంటే, స్పిరిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ లో ఎదురు చూపులు పెరిగాయి. కల్కీ 2 లో కొత్త గెటప్ ఎలా ఉంటుందా అన్న డిస్కర్షన్ మొదలైంది. ఆఖరికి డ్రాగన్ రెండు భాగాలతో ప్రశాంత్ నీల్ బిజీ అయినా, తన మేకింగ్ లో ప్రభాస్ మూవీ ఇప్పుడప్పుడే మొదలవ్వదని తెలిసినా, సలార్ సీక్వెల్ మీద కూడా ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. ఎటూ కాకుండా మిగిలిపోతోంది మాత్రం ఫౌసి సినిమానే.. ఏదో ఈ మూవీ లాంచ్ అయినప్పుడొకసారి, తర్వాత పోస్టర్ లో ప్రభాస్ లుక్ రివీల్ చేసినప్పుడు ఒకసారి ఫౌజీ మీద బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ మ్యాటరే సైలెంట్ అయిపోయింది.. ఎందుకు? కావాలని హను రాఘవ పూడీ టీం లో ప్రొఫైల్ మేయింటేన్ చేస్తున్నారా? దీన్ని మరో రాజా సాబ్ లా సైడ్ చేస్తున్నారా? అసలేం జరుగుతోంది? హైప్ ఎక్కడ మిస్ అవుతోంది?
రెబల్ స్టార్ ప్రభాస్ కి ఫ్యాన్స్ కంటే డై హార్డ్ ఫ్యాన్సే ఎక్కువ. బేసిగ్గా తను అందరి డార్లింగ్.. కాబట్టే, మిగతా హీరోల ఫ్యాన్స్ కి కూడా ప్రభాస్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వివాదాల జోలికి కూడా పోయే రకం కాదు కాబట్టే, తన మీద ఫ్యాన్స్ తో పాటు మిగతా మిగతా సినీ జనాలకు కన్సర్న్ ఉండటం కామన్. అందుకే ఫౌజీ పరిస్థితీ మీద చాలా మందిలో కంగారు కనిపిస్తోందిఎందుకు ఫౌజీ మూవీ మీద ఏమాత్రం బజ్ క్రియేట్ కావాట్లేదు.. ఇది చాలా మందిలో కామన్ గా వినిపిస్తున్న ప్రశ్న.. అంటే ఇంతవరకు ఫౌజీ తాలూకు మోషన్ పోస్టర్ కాని, టీజర్ కాని, సాంగ్ కాని ఇలా ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. కాబట్టి మామూలుగానే ఫౌజీ మీద డిస్కర్షన్ జరగక్కపోయే అవకాశం ఉందనుకోవచ్చు.. కాని హీరోలుక్ ని
పోస్టర్ లో పెట్టి రిలీజ్ చేశారు.
65 శాతం షూటింగ్ పూర్తి చేశారు. అయినా ఈ మూవీ మీద బజ్ క్రియేట్ కావట్లేదంటే కొద్దవరకు ఆలోచించాల్సిన విషయమే... ప్రస్థుతం ప్రభాస్ స్పిరిట్ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చి, మధ్యలో కల్కీ సీక్వెల్ కల్కీ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు. తర్వాత మళ్లీ స్పిరిట్ షూటింగ్ మొదలౌతుంది. కాబట్టే ఈ రెండు సినిమాల మీదేమార్కెట్ లోఅలానే జనాల్లో హైప్ క్రియేట్ అవుతోంది.అదే నిజమైతే, సలార్ సీక్వెల్ మీదెందుకు అంతగా చర్చ జరుగుతోంది. అసలీ సీక్వెల్ సీన్ లోనే లేదు. ప్రజెంట్ ప్రషాంత్ నీల్, ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ తీస్తున్నాడు. ఇంకా దాని సీక్వెల్ కూడా ఒకేసారి పూర్తి చేయాలనకుంటున్నాడు. అంటే ఈ ఏడాది ఎండ్ వరకు తను ఫ్రీ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ సలార్ సీక్వెల్ మొదలవ్వాలంటే, 2027 సమ్మర్ లోనే ఛాన్స్ అంటే ఏడాది వరకు సలార్ 2 సెట్స్ పైకెళ్లే అవకాశం లేదు.
అయినా సలార్ 2 మీద బజ్ కాని, హైప్ కాని క్రియేట్ అవుతోంది. ఎటొచ్చి 65 శాతం షూటింగ్ పూర్తైన ఫౌజీ మీద మాత్రం ఎలాంటి బజ్ క్రియేట్ కావట్లేదు. అంతటికీ కారనం దాని అప్ డేట్స్ ఏది ఇవ్వకపోవటం, డైరెక్టర్ హను రాఘవ పూడీకి, సీతారామం లాంటి క్లాస్ హిట్లు తప్ప మాస్ బ్లాక్ బస్టర్లు లేకపోవటం. ఇక హీరోయిన్ కూడా కొత్తదే అవటంలాంటి కారణాలతో ఫౌజీకి హైప్ క్రియేట్ కావాట్లేదా..?కాని ఇది రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా, కాబట్టి ఆటోమేటిగ్గా హైప్ పెరగాలి.. కాని పెరగట్లేదు. ఎందుకంటే ఇదికూడా పీరియాడికల్ డ్రామాగా వస్తున్న క్లీన్ క్లాసిక్కే అనంటున్నారు. కాబట్టే పెద్దగా హైప్ రావట్లేదనేస్తున్నారు. ఒక్కసారి గ్లింప్స్ లేదంటే, టీజరో వస్తే, ఈ సినిమామీద అంచనాలు మారొచ్చు.. కాని రాజాసాబ్ లానే ఇది కూడా లో ప్రొఫైల్ ని మేయింటేన్ చేస్తోంది.. అలా చేసి, చేసే, చివరాఖర్లో ట్రైలర్ వదిలి, డిసప్పాయింట్ చేశారు.. అది రిపీట్ అయితే ఎలా ఉంటుందనే టెన్షన్ సినీ జనాల్లో పెరిగింది. అలా జరక్కుండా ఉండాలంటే, కనీసం మోషన్ పోస్టరైనా రిలీజ్ చేస్తే, బెటర్ బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ఉంది.