స్పిరిట్ కంటే ముందే కల్కీ2…? అదే జరిగితే…!

రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి తన ఫ్యాన్స్ కి దక్కబోతున్న నెక్ట్స్ ట్రీట్ ఏంటి? ఫౌజీ ముందొస్తుందా? 2027 సమ్మర్ లో స్పిరిట్ షాక్ ఇస్తుందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఔట్ ఆఫ్ సెలబస్ నుంచే వచ్చేలా ఉంది.

Post Published By: dialnews
Updated : 18 March 2026, 10:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి తన ఫ్యాన్స్ కి దక్కబోతున్న నెక్ట్స్ ట్రీట్ ఏంటి? ఫౌజీ ముందొస్తుందా? 2027 సమ్మర్ లో స్పిరిట్ షాక్ ఇస్తుందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఔట్ ఆఫ్ సెలబస్ నుంచే వచ్చేలా ఉంది. అదే హిట్ మూవీ కల్కీ సీక్వెల్ కల్కీ 2. ఔను ఈ సినిమానే ఏదో మిరాకిల్ చేసేలా ఉంది. స్పిరిట్ అనుకున్న టైం కి రిలీజ్ అవటం కష్టంగానే కనిపిస్తోంది. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. 70 పర్సెంట్ పూర్తైన ఫౌజీ కూడా ఎందుకు రిలీజ్ విషయంలో వెనకబడేలా ఉంది. ఎందుకో కాని ఆల్ ఆఫ్ సడన్ గా కల్కీ సీక్వెల్ ని ముందు రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అంటే వేగంగా కల్కీ2 ని తీసీ రిలీజ్ చేస్తారనుకుందామంటే, ప్రాక్టికల్ గా అది సాధ్యంకాదు.. కాని ఇదే ముందు రిలీజ్ చేసే ప్రయత్నాలు మాత్రం బలంగా జరుగుతున్నాయి... సో ఇదెలా సాధ్యం?ఎందుకు దీన్నే ముందుగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు?

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీస్తున్న స్పిరిట్ 2027 సమ్మర్ లో వచ్చి తీరుతుంన్నారు. కాకపోతే, సీన్ మారేలా ఉంది. సడన్ గా సీన్ లోకి కల్కీ 2 వచ్చి చేరింది. ఉన్న ఫళంగా కల్కీ సీక్వెల్ ని మొదలు పెట్టినంత మాత్రానా, ఇదే ముందు రిలీజ్ అవుతుందనుకోలేం. కాకపోతే పరిస్థితి చూస్తుంటే ఏదో మిరాకిల్ జరిగేలా ఉంది. కల్కీ సీక్వెలే రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు బలంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.ఫౌజీ మూవీ ఆల్రెడీ 70శాతం పైనే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీన్ని దసరాకు రిలీజ్ అయ్యేలా ప్లాన్ కూడా చేశారు. ఇక స్పిరిట్ ఈపాటికే 15 శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. నెక్ట్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారు. దాని ప్రకారం చూస్తే జూన్ లోగా 60శాతం షూటింగ్ పూర్తవ్వొచ్చు.. సెప్టెంబర్ ఎండ్ కల్ల షూటింగ్ మొత్తం పూర్తయ్యే ఛాన్స్ఉంది.

ఎలా చూసినా ఐతే ఫౌజీ, లేదంటే స్పిరిటే 2027 లో రావాలి. కాని కల్కీసీక్వెలే వచ్చే లా ఉంది. ప్రభాస్ కూడా ఆ సినిమాను ముందు రిలీజ్ చేయించేందుకే ప్రిఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కల్కీ తీస్తున్నప్పుడే దాని సీక్వెల్ కల్కీ 2 షూటింగ్ ని 30శాతం పూర్తి చేశారు. ఇక జూన్ లోగా మూడు షెడ్యూల్స్ గ్యాప్ ఇస్తూ కల్కీ సీక్వెల్ ని 50శాతం పూర్తి చేయబోతోంది.సో స్పిరిట్, ఫౌజీ తో పోలిస్తే, వేగంగా కల్కీ 2నే పూర్తి చేయొచ్చు కాబట్టే, ఇలా పెండింగ్ 70 శాతాన్ని పూర్తి చేయబోతున్నారట. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, గతంలోనే తీసిన కల్కీ 2 తాలూకు 30శాతం షూటింగ్ మొత్తం గ్రాఫిక్స్ అవసరం ఉన్నయాక్షన్ పార్ట్.

దీంతో పోలిస్తే పది శాతం కమల్, అమితాబ్ ల సీన్స్ మాత్రమే పెండింగ్.. మిగతాదంతా టాకీ పార్ట్ మాత్రమే.అది కేవలం అంటే కేవలం 4 నెలల షూటింగ్ తో పూర్తి చేయొచ్చనేది నాగ్ అశ్విన్ కాన్ఫిడెన్స్... ఇంతకాలం కల్కీ 2 తాలూకు షూట్ చేసిన 30శాతం సీన్ల గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ అయ్యాడు నాగ్ అశ్విన్. అందుకే ఇప్పుడు తను సీన్లోకొచ్చాడు. కల్కీ 2 షూటింగ్ మొదలపెట్టాడు. ప్రభాస్ కూడా కలిసొచ్చిన మూవీ కాబట్టి, కల్కీ 2ని ముందు రిలీజ్ చేసి, తర్వాత స్పిరిట్ ని వదిలితే రెస్పాన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది కాబట్టే, కల్కీ 2 కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడట. మరి ఈ లిస్ట్ లో ఫౌజీ నెంబర్ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు.

 

Published : 
  • 18 March 2026, 10:00 PM IST