సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు చెబితేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల గలగల వినిపిస్తుంది. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా, సినిమా సినిమాకు అది రెట్టింపు అవుతోంది. 'జైలర్' సినిమాతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తలైవా, ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'జైలర్ 2' తో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు రిలీజ్ ముందే భారీ బిజినెస్ జరుగుతుంది. కానీ 'జైలర్ 2' విషయంలో అది నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర ఓటీటీ హక్కులు దాదాపు 160 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. చెన్నై సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ భారీ మొత్తానికి స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుందట.
మొదటి భాగం భారీ విజయం సాధించడం, నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, మరియు రజినీకాంత్ స్వాగ్ కలగలిపి ఈ రేంజ్ బిజినెస్‌కు కారణమయ్యాయి. గత కొన్ని వారాల క్రితమే ఈ డీల్ కుదిరినట్లు, మేకర్స్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 'జైలర్ 2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు నెల్సన్ ఈసారి కథను మరింత పక్కాగా, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఎమోషనల్ డ్రామా కూడా గట్టిగానే ఉంటుందట.
మొదటి భాగంలో లాగే ఇందులో కూడా వివిధ భాషలకు చెందిన స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. మల్టీ స్టారర్ హంగులతో ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో సందడి చేయనుంది. రజినీకాంత్ సినిమాలు అంటేనే ఒక బ్రాండ్. 'జైలర్' ద్వారా ఆయన కోల్పోయిన ఫామ్ తిరిగి తెచ్చుకోవడమే కాకుండా, సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలబెట్టారు. ఇప్పుడు సీక్వెల్ మీద ఉన్న క్రేజ్ చూస్తుంటే, కేవలం థియేట్రికల్ రన్ మాత్రమే కాకుండా, నాన్-థియేట్రికల్ రైట్స్ అంటే, శాటిలైట్, ఓటీటీ ద్వారానే సగం బడ్జెట్ రికవరీ అయినట్లు కనిపిస్తోంది.160 కోట్ల ఓటీటీ డీల్ అంటే అది సాధారణ విషయం కాదు. మరి నెల్సన్ దిలీప్ కుమార్ ఈసారి తలైవాను ఏ రేంజ్ లో చూపిస్తారో, బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయో చూడాలి.