సౌత్ ఇండియన్ లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి నుంచి వస్తున్న నెక్స్ట్ సెన్సేషన్స్ 2026లో బాక్సాఫీస్ వద్ద ఆమె మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేసేలా ఉన్నాయి. రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'తండేల్' సక్సెస్ తర్వాత, సాయి పల్లవి ఇప్పుడు పాన్-ఇండియా లెవల్‌లో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రన్ బీర్ పౌర హీరోగా నటిస్తున్న రామాయణం - ది బిగ్గెస్ట్ ఎపిక్ సినిమాలో సాయి పల్లవి సీతగా మెప్పించనుంది. ఇది సాయి పల్లవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.
2026 దీపావళికి మొదటి భాగం విడుదల కానుంది. దీనికి ఏ.ఆర్. రెహమాన్ మరియు హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. ఇక 'ఏక్ దిన్' అంటూ- ఒక మనసును తాకే ప్రేమకథలో మెరవనుంది ఈ మలయాళీ కుట్టీ.
ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇది థాయ్ సినిమా 'వన్ డే'కి రీమేక్. ఒక అందమైన రొమాంటిక్ డ్రామాగా దీనిని సునీల్ పాండే తెరకెక్కించారు. లెజెండరీ కర్ణాటక గాయని, భారతరత్న MS సుబ్బలక్ష్మి బయోపిక్ లో కూడా పల్లవి పదనిసలు పాడబోతోంది అంటూ ఒక క్రేజీ రూమర్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయబోతున్నారని వినికిడి. ఈ పాత్ర కోసం సాయి పల్లవి ప్రత్యేకంగా కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది.
'అమరన్' దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. వీరిద్దరూ 'మారి 2' తర్వాత మళ్ళీ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం సాయి పల్లవి దాదాపు 12 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. రామాయణంలో సీతమ్మగా, సుబ్బలక్ష్మి గారి బయోపిక్‌లో గాయనిగా సాయి పల్లవి 2026లో విశ్వరూపం చూపించబోతోంది. లేడి సూపర్ స్టార్ సాయి పల్లవి నటించనున్న ఇన్నేసి సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.