ఇంత DARK..? అపరిచితుడి BLOOD BATH..?

రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ మీద బాలీవుడ్ లో మళ్లీ బురద చల్లే గొడవ షురూ అయ్యింది. కాకపోతే ఈ ప్రాసెస్ లో స్పిరిట్ కథని, హీరో పాత్రని లీకులు చేస్తూ, వంకర ప్రచారాలు మొదలు పెట్టారు. అయితే గతంతో పోలిస్తే, ఇప్పుడు ఈ రూమర్లే సినిమా స్థాయిని పెంచుతున్నాయి..

Post Published By: dialnews
Updated : 13 April 2026, 7:21 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ మీద బాలీవుడ్ లో మళ్లీ బురద చల్లే గొడవ షురూ అయ్యింది. కాకపోతే ఈ ప్రాసెస్ లో స్పిరిట్ కథని, హీరో పాత్రని లీకులు చేస్తూ, వంకర ప్రచారాలు మొదలు పెట్టారు. అయితే గతంతో పోలిస్తే, ఇప్పుడు ఈ రూమర్లే సినిమా స్థాయిని పెంచుతున్నాయి..కారనం ఇంతవరకు స్పిరిట్ లో హీరో పాత్ర ఎలా ఉంటుందో అంతా ఒకరకంగా ఊహించుకున్నారు. వాటికి భిన్నంగా దిమ్మతిరిగే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో రెబల్ స్టార్ కనిపించబోతున్నాడన్న లీకులు హిందీ బ్యాచే ఇస్తోంది.. గతంలో దీపికా పీఆర్ టీం ఇలానే డ్యామేజ్ ,చేస్తే, వాళ్లకే మైలేజ్ పడిపోయింది. ఇప్పుడు సేమ్ అదే ప్రయత్నం... కాని హీరో పాత్ర వరస్ట్ హీరోయిజంతో రాబోతోందనంటున్నారు. బ్లడ్ బాత్ తప్ప కథలో ఏముండదనంటున్నారు.. సీరియల్ కల్లర్స్ ని చంపుకుంటూ పోయే సీరియల్ కిల్లింగ్ రౌడీ పోలీసే ప్రభాస్ అంటున్నారు.. ఇలా కథ లీక్ చేస్తోనో, పాత్రకి పంచర్ చేస్తోనో స్పిరిట్ కి డ్యామేజ్ అవుతుందనుకుంటున్నారు. కాని ఈ నెగెటివ్ ప్రచారాలతో, ఇప్పడు స్పీరిట్ మీద గూగుల్ సెర్చులు, ఛాట్ జీపీటీ ఎంక్వైరీలు పెరిగిపోయాయి... అంటే బాలీవుడ్ నెగెటీవ్ పీఆర్ బ్యాచ్ తూటాలు మిస్ ఫైర్ అయ్యాయా? రెబల్ పండగని ముందే తీసుకొస్తున్నాయా?

సందీప్ రెడ్డి సినిమాలంటేనే హీరో డార్క్ షేడ్స్ లో కనిపిస్తాడు..మంచి తనం ఎంతుంటుందో, మెంటల్ కూడా అదే స్థాయిలో హీరో ప్రవర్తనలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే సందీప్ హీరోయిజం అంటే, కిరాక్ గానే ఉంటుందనే అభిప్రాయం ఉంది. అది ఆడియన్స్ కి నచ్చింది. కాని బాలీవుడ్ లో కొందరు పెద్దలు, సందీప్ తీసిన కబీర్ సింగ్, యానిమల్ దిక్కుమాలిన మూవీలన్నట్టు ప్రశ్నించారు.ఇక దీపికా పదుకొనేని తీసుకుందామంటే, తన గొంతమ్మెకోర్కెలు నచ్చక పంపిచేశారు. తన ప్లేస్ లో త్రిప్తిని తీసుకోవటంతో, అది నచ్చక దీపికా పీఆర్ టీం, కావాలని స్పిరిట్ కథని లీక్ చేసిందంటారు. అయినా పర్లేదని అప్పట్లో సందీప్ గట్టిగానే ట్వీట్ తో ఇచ్చిపడేశాడు. కట్ చేస్తే స్పిరిట్ ఒక దిక్కుమాలిన సినిమా అన్న నెగెటీవ్ ప్రచారం మొదలైంది.

స్పిరిట్ లో డార్క్ హీరో, డార్క్ హీరోయిజం చూడబోతున్నారన్న ప్రచారం పెరిగింది. సినిమా అంత బ్లడ్ బాతే అని, అదేదో గొప్ప క్రియేటివిటీ అయినట్టు, వయోలెన్స్ తప్ప వ్యవహరం లేదు ఆ దర్శకుడి దగ్గరన్నట్టు, నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, ఇలాంటి యాంటీ ప్రమోషన్ తో డ్యామేజ్ జరుగుతుందనుకుంటే, అది కూడా స్పిరిట్ కి ప్లస్ అవుతోంది.ఎలా అంటే, పలానా సినిమాలో ఘోరమైన రొమాన్స్ ఉందని అప్పట్లో షకీల సినిమాల మీద విషప్రచారం చేశారు.. విచిత్రం ఏంటంటే, ఆ ఘోరమైన రొమాన్స్ ఏంటో తెలుసుకునేందుకు ఊహించిన దానికంటే జనం ఎక్కువే థియేటర్స్ కి క్యూ కట్టారు. కట్ చేస్తే, ఇప్పుడు స్పిరిట్ లో సీరియల్ కిల్లర్స్ ని చంపే రౌడీ పోలీస్ అన్న నెగెటీవ్ ప్రచారం కాస్త స్పిరిట్ కి ప్లస్ అవుతోంది.

అదేంటో తెలసుకునేందుకు గూగుల్ సెర్చులు, ఛాట్ జీపీటీలో ఎంక్వైరీలు పెరిగాయి... ఇది చాలు బాలీవుడ్ నెగెటీవ ప్రచారాలు సందీప్, ప్రభాస్ ల దగ్గర పనిచేయవని చెప్పటానికి. ఇప్పటి వరకు స్పిరిట్ అంటే కోపంతో దారి తప్పిన పోలీస్ కథే అనుకున్నారు. కాని గ్రే షేడ్స్ ఉన్న ఒక డార్క్ పోలీస్ ఎలా సీరియల్ కిల్లర్స్ మీద రివేంజ్ తీసుకున్నాడో అన్న పాయింట్ తో ఈ సినిమా రాబోతోందని తేలింది.లీకులతో డ్యామేజ్ చేద్దామనుకున్న బ్యాచ్, ఈ సినిమా మీద అంచనాలు పెంచేందుకు పరోక్షంగా కారకులవ్వటంతో సీన్ రివర్స్ అవుతున్నట్టే కనిపిస్తోంది.

Published : 
  • 13 April 2026, 7:21 PM IST