కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఏకచ్ఛాత్రాధిపత్యం చెలాయిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె లండన్ నగరంలో ఒక సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా షూటింగ్లో ఎంతో బిజీగా పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచే కోలీవుడ్ వర్గాలలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. త్రిష నటిస్తున్న చివరి సినిమా ఇదే కానుందా అనే అనుమానాలు అభిమానులలో మొదలయ్యాయి.
ఆమె త్వరలోనే సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ హారర్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఆమె తన పొలిటికల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.బాలీవుడ్లో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు రాజా కృష్ణా మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ మరియు నేషనల్ అవార్డ్ విన్నర్ అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ముగ్గురు పవర్ ఫుల్ నటీమణులు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. విజయ్ రాజకీయాల్లో బిజీగా మారడం, త్రిష లండన్‌లో సినిమాలు చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ త్రిష నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వస్తే అది అభిమానులకు షాకింగ్ న్యూస్ అవుతుంది. అయినప్పటికీ పొలిటికల్ రంగంలో ఆమె ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలని తమిళ తంబీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.