సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లోతెరకెక్కుతున్న మూవీ వారణాసి. వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తో ఒక్కసారిగా మహేశ్ బాబు మార్కెట్ 20రెట్లు పెరగబోతోంది. ఐను ఇప్పటి వరకు తన సినిమాల హయ్యెస్ట్ బిజినెస్ 300 కోట్లు... దీనికి ఇరవై రెట్లు అంటే, 5 నుంచి 6 వేల కోట్ల వరకు తన మార్కెట్ పెరగబోతోంది. పాన్ వరల్డ్ మూవీ వారణాసితో తను ఊహించని స్థాయిలో ఫేట్ మారబోతోంది. ఇందులో ఎలాంటి డౌటక్కర్లేదు... రాజమౌలి వదిలిన బాణం వెనక్కి రావటం, విరగటం జరిగినట్టు చరిత్రలో వినిపించలేదు. సో 300 కోట్ల నుంచి 6 వేల కోట్ల వరకు సూపర్ స్టార్ మార్కెట్, ఇమేజ్ పెరుగుతుందని తెలుస్తోంది. కాని ఇక్కడ సమస్య రాబోయే బ్లాక్ బస్టర్ కాదు.. అమాంతం పెరిగిపోయే తన 6 వేల కోట్ల ఇమేజ్ ని, అంత పెద్ద మార్కెట్ ని కూల్ చేసే సీన్ ఎవరికి ఉంది....? సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ నిజంగా వారణాసి వరంతో పెరిగే మహేశ్ ఇమేజ్ ని వాళ్లు మోయగలరా? పాన్ వరల్డ్ మార్కెట్ లో సూపర్ స్టార్ ఒంటిరి కాబోతున్నాడా?
వారాణాసి 1359 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంతవరకు పాన్ ఇండియా సినిమానే చేయలేదు. అలాంటిది ఇప్పుడై పాన్ వరల్డ్ మార్కెట్ లోకి వెళుతున్నాడు. అంతా రాజమౌళి విజన్ మీద నమ్మకంతోనే.. అందుకే ఒకేసినిమాకు 3 ఏళ్లు సమర్పించుకుంటున్నాడు. కాన్సెప్ట్ గ్లింప్స్ చూసినప్పుడే, ఇదేదో పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసే సినిమా అనే ఫీల్ ని క్రియేట్ చేసింది.జేమ్స్ కామెరున్ టీం, అలానే నెట్ ఫ్లిక్స్ లాంటి నెంబర్ వన్ ఓటీటీ సంస్థతో పాటు, హాలీవుడ్ టాప్ బ్యానర్ డ్రీమ్ వర్క్స్ కూడా రంగంలోకి దిగింది కాబట్టి, వారణాసి సినిమా వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవటం, ప్రమోషన్ పీక్స్ వెళ్లటం కన్ఫామ్. ఇక ఇండియన్ మిథాలజీకి, ఏడు వింతలు, డైనోసార్ల పోరాటాలు, టైం మిషిన్ లో ప్రయాణం, ఇండియానా జోన్స్ లా సాహసాలు ఇవన్నీ వారణాసి ని 6 వేల కోట్ల సినిమాగా మార్చే ఛాన్స్ ఉంది
ఇక్కడ సమస్య 1359 కోట్ల పెట్టుబడి 6 వేల కోట్ల వసూల్లు గా మారటం కాదు.. ఆతర్వాత ఏంటనే ప్రశ్న.. అది కూడా రాజమౌళికి కాదు, సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ఎదురౌతోంది. అసలు రాజమౌళి డైరెక్షన్ లోపాన్ ఇండియా లెవల్లో హిట్ పడ్డాక, ప్రభాస్, రామ్ చరణ్ తేరుకోలేదు. బాహుబలి రెండు భాగాల తర్వాత కనీసం పావుడజన్ పంచ్ ల తర్వాతే కల్కీ, సలార్ తో ప్రభాస్ కోలుకున్నాడు.రామ్ చరణ్ మాత్రం త్రిబుల్ ఆర్ తర్వాత అడ్రస్ లేకుండాపోయాడు. సో పాన్ ఇండియా లెవల్లోనే రాజమౌళి రేంజ్ సినిమా తో హిట్ పడ్డాక, ఆ రేంజ్ మార్కెట్, క్రేజ్ ని అందుకునే సినిమాలు చేయటం హీరోలకు కష్టం అవుతోంది.. అలాంటిది వారణాసితో పాన్ వరల్డ్ లెవల్లో మహేశ్ బాబుకి ఇమేజ్, మార్కెట్ పెరిగితే, దాని భారం మోసే సత్తా ఉన్న దర్శకులెవరనే ప్రశ్నకి సమాధానం లేదు.
సుకుమార్ సీన్ లో ఉన్నాడు. మహేశ్ బాబుతో జేమ్స్ బాండ్ జోనర్ లో తను సినిమా ప్లాన్ చేస్తున్నాడు. చరణ్ మూవీ తర్వాత మహేశ్ తోనే సినిమా అంటున్నారు. ఇక స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ కాకుండా మహేశ్ బాబుతో సినిమా తీయాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సుకుమార్, సందీప్ ఇద్దరూ టాలెంటెడ్ డైరెక్టర్లే.. కాని రాజమౌలి రేంజ్ ని అందుకుంటారా? పాన్ ఇండియా లెవల్లో జక్కన్న స్థాయిని వీల్లు కూడా అందుకున్నా, పాన్ వరల్డ్ లెవల్ లెక్కలు వీళ్లకి సాధ్యమా? వారణాసి డెఫినెట్ గా వరల్డ్ ప్లాట్ ఫాంలో 6 వేల కోట్ల వరకు వసూళ్లు రాబట్టే బ్లాక్ బస్టర్ అవుతుందనే అంచనాలున్నాయి. మరి ఆతర్వాత మహేశ్ ఇమేజ్ భారాన్ని మోసేదెవరు? 6 వేల కోట్లు కాకపోయినా కనీసం 3 వేల కోట్లైనా సుకుమార్, సందీప్ రెడ్డి వంగ రాబట్టే సినిమా తీస్తారా? డెఫినెట్ గా ఈ ప్రశ్న సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్ లోకూడా ఉండే ఉంటుంది.. కాని సమాధానం వేచి చూడటమే తప్ప, ఎవరికీ ఇప్పుడే సమాధానం దొరికే ప్రశ్నకాదది.