2 వేల కోట్లే ఇప్పటి వరకు ఇండియాన్ సినిమాల్లోనెంబర్ వన్ అనిపించుకున్న దంగల్ మూవీ రికార్డు... దానికి ఐదు రెట్లు, అంటే పదివేల కోట్ల వసూళ్లే టార్గెట్ గా తెరకెక్కుతోంది వారణాసి మూవీ. పాన్ వరల్డ్ మార్కెట్ కోసం వెయ్యికాదు, 1500 కోట్లు కాదు, 2 వేల కోట్లలు లేదంటే అంతకుమించి బడ్జెట్ తో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ కూడా వారణాసినే... అలాంటి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు 100 కోట్లు కేటాయించిందట ఫిల్మ్ టీం. ఇదే నిజంగా షాకింగ్ న్యూస్ అంటున్నారు. ఎందుకంటే, కేజీయఫ్ లాంటి సినిమాను ప్రమోట్ చేసేందుకు కనీసం 50 కోట్లు ఖర్చు పెట్టమని సలహా ఇచ్చిన రాజమౌళి, తన ఓన్ మూవీ అది కూడా పాన్ వరల్డ్ సినిమా కోసం ఖర్చు చేసేది వందకోట్లేనా? సరిపోతాయా? బాహుబలి 2, త్రిబుల్ ఆర్ ప్రమోషన్ కి పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఇదే మూలకు... ? అదికూడా అవొచ్చి ఏళ్లుగడుస్తున్నా, పాన్ వరల్డ్ మూవీకి కేవలం 100 కోట్ల ప్రమోషనే విచిత్రంగా ఉంది.. ఇంతకి ఈ వందకోట్లెలా పదివేల కోట్లకు గేలం వేస్తాయి? రాజమౌలి వరల్డ్ సినిమాను ఈ మాత్రం 100 కోట్ల ఖర్చుతో మన వైపు చూసేలా చేయగలడా?
పిండి కొద్ది రొట్టే అలానే, పాల కొద్ది దాన.. ఈ మాటలు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వారణాసికి కూడా అప్లై అవుతాయి. ఎందుకంటే 10 వేల కోట్లు రాబట్టే సత్తా ఉన్న మూవీకి, 2 వేలకోట్ల వరకు బడ్జెట్ పెట్టడం గొప్ప విషయమే.. కాని వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు 100 కోట్లు ఖర్చు చేయటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఎందుకంటే త్రిబుల్ ఆర్ మూవీ ఆస్కార్ క్యాంపేయిన్ కే 85 కోట్ల వరకు ఖర్చుచేసినట్టు ప్రచారం జరిగింది.
ఇక పదేళ్ల క్రితం బాహుబలి ది బిగినింగ్ ని ప్రమోట్ చేసేందుకు 55 కోట్లు ఖర్చుచేయించాడు రాజమౌళి. ఇదే కాదు ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన బాహుబలి 2 ని ప్రమోషన్ కోసం 70 కోట్ల వరకు ఖర్చయ్యింది. త్రిబుల్ ఆర్ ని ప్రమోట్ చేయటానికి కూడా 60 నుంచి 75 కోట్ల వరకు రాజమౌళి టీం ఖర్చు చేసింది. అది కూడా ఆస్కార్ క్యాంపేయిన్ కోసం పెట్టిన ఖర్చు కాకుండా..ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు.. వీటిని దేశ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకే 60 కోట్ల నుంచి 85 కోట్ల వరకు ఖర్చు చేస్తే, వారణాసి మూవీని వరల్డ్ వైడ్ గా ప్రచారం చేసేందుకు పెట్టేది వందకోట్లేనా..? సరిపోతాయా? వందకోట్లంటే చిన్న మొత్తం కాదు.. పదేళ్ల క్రితం హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లో అడుగుపెడితే అదో అద్భుతం.. అలా ఉండేది తెలుగుసినిమా పరిస్థితి..
కాబట్టి 100 కోట్లతో పెద్ద సినిమానే తీసే ఛాన్స్ ఉన్నప్పుడు, అంత మొత్తం ఒక సినిమా ను ప్రమోట్ చేసేందుకు ఖర్చు చేయటం చిన్న విషయం కాదు. కాని పాన్ వరల్డ్ మార్కెట్ లోకి వారణాసిని తీసుకెళ్లాలంటే, 10 వేల కోట్ల వసూళ్లు రాబట్టే అంచనాలున్న మూవీని, ఆ స్థాయిలో వరల్డ్ ప్లాట్ ఫాంలో ప్రమోట్ చేయాలంటే, వందకోట్లు సరిపోవనే అభిప్రాయం వినిపిస్తోంది..ఎక్కడా రాజమౌళి టీం, ఇంత ఖర్చు చేస్తున్నామని ఎనౌన్స్ చేయలేదు. కాని రాజమౌళి టీం లీకులు, లేదంటే ఫీలర్స్ తోనే ఇలాంటివి బయటికొస్తున్నాయనంటున్నారు.. ఏదేమైనా 2 వేల కోట్ల సినిమా బడ్జెట్ లో ప్రమోషన్ కి మాత్రం 100 కోట్లే ఖర్చు చేస్తున్నారట. ఇక షూటింగ్ విషయానికొస్తే, హైద్రబాద్ ఔట్ స్కట్స్ లో ఒక సీన్, రామోజీ ఫిల్మ్ సిటీలో వందఎకరాల అడవి సెట్ లో 15 రోజులు, జార్జియాలో 22 రోజుల షెడ్యూల్, తర్వాత ఆఫ్రికా షెడ్యూల్..
ఇలా ఇంతవరకు ఎవరూ చూడని ప్రదేశాల్లో, సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఆల్రెడీ విజయవాడ డిస్ట్రిబ్యూసన్ రైట్స్ 18 కోట్లంటున్నారు... వైజాగ్ 22 కోట్లన్న మాట వినిపిస్తోంది. నైజాం 150 కోట్లకు సేల్ చేస్తున్నారట. ఇలా ఇప్పుడే ఏరియా రైట్స్ కూడా రీసౌండ్ చేస్తున్నాయి..మొత్తంగా ఏడాదికి ముందు నుంచే ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్, సెట్లు వాటికోసం ఫిల్మ్ టీం మారే లొకేషన్లు, ఇలా ప్రతీదీ వార్తగా మారుతున్నటైంలో, వందకోట్ల ప్రమోషన్ బాంబ్ పేలింది.