బడ్జెట్ 1000కోట్లు మరి వసూళ్లు…?

భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అదే దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్

Post Published By: dialnews
Updated : 12 March 2026, 7:20 PM IST

భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అదే దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న 'వారణాసి'. 'RRR'తో ఆస్కార్ స్థాయికి వెళ్లిన రాజమౌళి, ఇప్పుడు అంతకు మించిన భారీ సాహసగాథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, 'వారణాసి' సినిమాను సుమారు 1,000 కోట్ల నుండి 1,200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా రికార్డు సృష్టించింది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అంటార్కిటికా, కెన్యా వంటి అంతర్జాతీయ లొకేషన్లలో షూటింగ్, మరియు అత్యాధునిక IMAX టెక్నాలజీని వాడుతుండటంతో బడ్జెట్ ఈ స్థాయికి చేరింది. ముఖ్యంగా ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండటం సినిమాకు అంతర్జాతీయ క్రేజ్‌ను తీసుకొచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 2,000 కోట్ల మార్కును అందుకుంటుందా? అన్న చర్చ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బాహుబలి 2 మరియు RRR సినిమాలతో రాజమౌళి మార్కెట్ స్థాయి కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఆయన సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉంది. వారణాసి' ఒక అడ్వెంచర్ థ్రిల్లర్. ఇండియానా జోన్స్ తరహాలో సాగే ఈ కథకు భాషా భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక భారతీయ సినిమాకు అత్యున్నత రికార్డ్.మహేష్ బాబు తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా, ప్రాజెక్ట్ భారీ తనాన్ని దృష్టిలో ఉంచుకుని లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు సమాచారం.

కేవలం సినిమా టికెట్ల వసూళ్లే కాకుండా, నాన్-థియేట్రికల్ హక్కులు ద్వారానే ఈ సినిమా సగం బడ్జెట్‌ను రికవరీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, 2,000 కోట్లు అనేది చిన్న అంకె మాత్రమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన అసలైన ప్రతాపాన్ని చూపనుంది.

Published : 
  • 12 March 2026, 7:20 PM IST