IMAX..7 వండర్స్… డైనోసార్స్ తో.. సినీ సునామీ…!

వారణాసి మూవీ పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్... విదేశాల్లో సెటిలైన ఇండియన్స్ మాత్రమే కాదు, తెల్లోల్లు, చైనీసు,యూరోపియన్స్ ఇలా మిగతా దేశస్తులు మన సినిమాను చూడాలా...

Post Published By: dialnews
Updated : 18 March 2026, 8:30 PM IST

వారణాసి మూవీ పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్... విదేశాల్లో సెటిలైన ఇండియన్స్ మాత్రమే కాదు, తెల్లోల్లు, చైనీసు,యూరోపియన్స్ ఇలా మిగతా దేశస్తులు మన సినిమాను చూడాలా... అందుకే వారణాసిని వరల్డ్ మూవీగా మార్చేందుకు ఐమ్యాక్స్ కెమెరాతో సినిమా అంతా షూట్ చేస్తున్నారు. సెవెన్ వండర్స్ ని చూపించబోతున్నారు. డైనోసార్ సీన్లు, కాలంలో ప్రయాణించే హీరో సాహసాలు.. ఇలా అన్నీ లార్జర్ దేన్ లైఫ్ అనిపించే సీన్లు, పాత్రలు, మేకింగ్ స్టాండర్డ్స్ ని మేయింటేన్ చేస్తున్నారు. సో వీటితోనే వారణాసి నిజంగా వరల్డ్ సినిమాగా మారుతుందా? వరల్డ్ ఆడియన్స్ ని రీచ్ అవుతుందా? చైనీస్, కొరియన్స్ కి సాధ్యం అయినా వరల్డ్ మార్కెట్... మనకి సాధ్యం అవ్వాలంటే ఇదే మార్గమా? మరో దారి లేదా?

వారణాసి వరల్డ్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఐమ్యాక్స్ కెమెరా సరిపోతుందా? ఎందుకంటే రీసెంట్ గా అమెరికన్ టీవీ షో లో యాంకర్ తో ప్రియాంక చోప్రా చెప్పిన మాటలు అక్కడ వైరలయ్యాయి. వారణాసి వరల్డ్ ఆడియన్స్ ని కొత్త లోకంలోకి తీసుకెళుతుందని తను అనటమే కాదు. ఇది ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ సినిమా అంది.దీనికి అమెరికన్స్ అంత ఎగ్జైట్ అవుతారా? అంటే అవ్వాల్సిందే. ఎందుకంటే హాలీవుడ్ లో కూడా ఇప్పటి వరకు ఏ మూవీ వందకు వందశాతం ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కలేదు. అవేంజర్స్ ఇన్ ఫినీటీ వార్ ని పూర్తిగా ఐమ్యాక్స్ లో తీశామన్నారు కాని. 90శాతం మాత్రమే ఐమ్యాక్స్ లో తీశారు. మిగతా 10 శాతం సీజీ ఎఫెక్టులే అవటంతో దాన్ని వందశాతం ఐమ్యాక్స్ కెమెరాతో తీసిన మూవీ అనలేం..

అవెంజర్స్ ఎండ్ గేమ్, ది డార్క్ నైట్ 80 శాతం ఐమ్యాక్స్ తో తీశారు. కాని ఇంతవరకు మొత్తం సినిమాను ఐమ్యాక్స్ తో తీయలేదు. కాబట్టి అవేంజర్స్ ఇన్ ఫినిటీ రికార్డుని కూడా వారణాసి బ్రేక్ చేసేలా ఉంది. ప్రపంచంలో ఓపెనింగ్ సీన్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు ఐమ్యాక్స్ కెమెరాతో షూట్ చేసిన మొదటి ఇండియన్ మూవీనే కాదు, మొదటి వరల్డ్ మూవీగా కూడా వారనాసికి రికార్డు దక్కేలా ఉంది.ఇలాంటివేదైనా చేస్తేనే వరల్డ్ ఆడియన్స్ షాకై, ఇటువైపు ఆసక్తిగా చూస్తారు. అంతేకాదు, ఇందులో ఏడు అద్భుతాలను చూపించబోతున్నారు. వాటి చుట్టూ హీరో సాహసాల యాత్ర ఉండబోతోంది.

దీనికి తోడు ఇండియన్ మిథాలజీతో ఉన్న కనెక్షన్ వరల్డ్ ఆడియన్స్ కి కొత్త అనుభవాన్ని ఇవ్వొచ్చు. ఇది కాకుండా డైనోసార్లు సీన్లు కూడా ఈ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీ ఆగిపోవటంతో, హాలీవుడ్ లో ఆ జోనర్ మూవీస్ కి వారణాసి ఆల్టర్ నేటివ్ అని కూడా ప్రచారం చేయటం కూడా కలిసొస్తోంది. మొత్తంగా 1400 కోట్ల బడ్జెట్, ఐమ్యాక్స్ కెమెరాతో షూటింగ్, డైనోసార్లు, ఏడు వింతలు, టైం ట్రావెల్ ఇలా ఇన్ని విశేషాలతో వస్తోంది కాబట్టే, వారణాసి వరల్డ్ ఆడియన్స్ ని రీచ్ అవ్వటమే కాదు, పాన్ వరల్డ్ మార్కెట్ లో సినీ సునామీ క్రియేట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రియాంక ప్రమోషన్ కూడా వారణాసి రేంజ్ యూఎస్ లో పెరిగిపోయేలా ఉంది.

 

Published : 
  • 18 March 2026, 8:30 PM IST