పాన్ వరల్డ్ మూవీగా వస్తోంది వారణాసి.. అంటే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యాక, కథ నచ్చి అమెరికన్లు, యూరోపియన్లు కూడా ఈ సినిమా చూడ్డం రాజమౌళి టార్గెట్ కానే కాదు.. రిలీజ్ రోజే తెల్లోల్లు మన సినమా కోసం థియేటర్స్ ముందు క్యూ కట్టాలి.. అందుకే హాలీవుడ్ మీడియాను హైద్రబాద్ రప్పించాడు. పనికట్టుకుని అమెరికన్ రిపోర్టర్లకు వారణాసి టీం ఇంటర్వూ ఇచ్చింది. విచిత్రం ఏంటంటే, సినిమా లాంచ్ ని సీక్రెట్ గా చేసిన రాజమౌళి, ఇప్పుడు ఈ ఇంటర్వూలో మాత్రం అంతా ఓపెన్ చేసేశాడు. వారణాసి డ్యూరేషన్ 3 గంటల 20 నిమిషాలన్నాడు.. రెండు భాగాలుగా సినిమా తీయాలనుకున్నా, ఆ ఆలోచన పక్కనపెట్టినట్టు తేల్చాడు.. గ్లింప్స్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ వాడలేదన్నాడు.. 25 నిమిషాల మైథలాజికల్ సీన్స్ మీద చాలా పెద్ద సీక్రెట్ రివీల్ చేశాడు. రుద్రుడిగా, రాముడు, శివుడిగా మహేశ్ పాత్రలేంటో అఫీషియల్ గా చెప్పేశాడు. అవతార్ తో ఈ మూవీని పోల్చారంటూ విచిత్రమైన స్టేట్ మెంట్ ఇచ్చాడు. అంటతేకాదు, ఈ సినిమా స్టోరీ లైన్ కూడా హాలీవుడ్ మీడియా పుణ్యామాని బయటికొచ్చింది.. అదేంటో, రాజమౌళి, మహేశ్ బాబు ఇంకేం రివీల్ చేశారో చూసేయండి.
వారణాసి మూవీ లాంచ్ అయిన వీడియో ఇంత వరకు రాలేదు. కాని సడన్ గా గ్లింప్స్ వదిలారు. రెండు పాటలు రివీల్ చేశారు. పెద్ద ఈవెంట్ జరిగింది. కట్ చేస్తే ఎలాంటి సందర్భంలేకుండా, ఇద్దరు అమెరికన్ రిపోర్టర్లకు మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, ఫృద్వీరాజ్, రాజమౌలి నలుగురు ఇంటర్వూలు ఇచ్చేశారు. మొత్తం వారణాసి సంగీతేంటో, పూసగుచ్చినట్టు వివరించారు.. ఇది ఓరకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కి షాక్ లాంటి కిక్ ఇచ్చే అంశం..ఇక రాజమౌలి చెప్పిన అంశాలను చూస్తే... హీరో పాత్ర రుద్రుడు మహా శివభక్తుడు..అంతేకాదు రాముడిగా, శివుడిగా తను కనిపించబోతున్నాడని రాజమౌలి రాజముద్ర వేసి తేలిస్తే, మహేశ్ తన పాత్రలవిషయంలో ఎంత ఎగ్జైట్ అయ్యాడో చెప్పాడు. ఇక వారణాసి రెండు భాగాలు కాదు, ఒకే భాగంగా అది మూడు గంటల 20నిమిషాల నిడివితో వస్తుందన్నాడు జక్కన్నా. అంతేకాదు బోర్ కొట్టే సీన్లు లేకుండా, ల్యాగ్ ఉండకుండా, ప్రతీ సీన్ ని క్లైమాక్స్ లా తీస్తున్నట్టు, కాస్త ఎలివేట్ చేస్తూనే తేల్చాడు.
కొల్లాయిడ్ ఇంటర్వూ, స్క్రీన్ రాంట్ ప్లస్ అనే అమెరికన్ రిపోర్టర్లను హైద్రబాద్ లో దింపిన రాజమౌళి, వాళ్లతో వారనాసి విషేషాలు తేల్చాడు. 15 ఏళ్ల క్రితం సెట్ అవ్వాల్సిన కాంబినేసన్ ఇప్పుడు సెట్ అవటమే కాదు, ఈ సారి మేకింగ్ లో డీలే కాని, వాయిదాలు కాని ఉండవన్నాడు. ఇక అవతార్ మూవీతో ఈ సినిమాను పోల్చటం గౌరవంగా ఉన్నా, జేమ్స్ కామెరున్ ఒక శిఖరమని, తనతో పోల్చకండంటూ తానింకా విద్యార్ధినే అన్నాడు.ఇక ఇందులో పాటలుండాలని, తాను డాన్స్ చేయాలని, ఇండియన్ సినిమాచేసి 6 ఏల్లైనట్టు, అందుకే పాటల రిక్వెస్ట్ ని రాజమౌళికి చేసినట్టు ప్రియాంక చెప్పింది ఇదేం అంత ఎగ్జౌటింగ్ విషయం కాకున్నా, ఇందులో డాన్స్ నెంబర్స్ చాలా ఉన్నాయన్న తన మాట మాత్రం తూటాలా పేలుతోంది. నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడు భయపడ్డానని, ఆ కథ రాజమౌళి నెరేట్ చేసిన విదానం వల్లే, కాన్పిడెన్స్ వచ్చిందని సూపర్ స్టార్ అన్న మాటలు కూడా వైరలౌతున్నాయి.
ఇక థి థింగ్, ఎయిట్ బిలో, ఎన్ కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ లాంటి హాలీవుడ్ మూవీల తర్వాత అంటార్కిటికా మంచు ఖండంలో తెరకెక్కుతున్న ఐదో సినిమానే కాదు, మొదటి ఇండియన్ సినిమా కూడా ఇదే... అలాంటి విజువల్స్ ఉన్నప్పుడు ఐమ్యాక్స్ కెమెరాతోనే గ్రాండియర్ విజువల్స్ సాధ్యమన్న రాజమౌళి, మహేశ్ బాబు పరుగెత్తే విధానాన్ని కూడా మార్చాడట. కేవలం సినిమాలో హీరో పరుగెత్తే షాట్స్ రెండే ఉంటాయని, వాటికోసం 6 నెలలు కష్టపడి, తన రన్నింగ్ స్టైల్ మార్చాల్సి రావటానికి కారనం, లార్డ్ రామా కి ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉండటమే అన్నాడు.ఇలా 1500 కోట్ల నుంచి 2 వేల కోట్ల వరకు బడ్జెట్ తో తెరకెక్కే తొలి ఇండియా హై బడ్జెట్ మూవీకి హాలీవుడ్ సినిమా అయిన ఇండియానా జోన్స్ తో పోలిక పెట్టడం కలిసొచ్చే అంశమే. కాని అమెరికన్ రిపోర్టర్లతో రాజమౌలి ఏంచెప్పాడో కాని, కొల్లాయిడ్ యూ ట్యూబ్ చానల్ లో మాత్రం వారణాసి బేసిక్ స్టోరీలైన్ లీకైందని తెలుస్తోంది. దాని ప్రకారం, మహా శివ భక్తుడైన రుద్రుడు, అంటే హీరో విశ్వానికి సంబంధించి అతీంద్రియ శక్తి గల పురాతన వస్తువు కోసంహీరో టైం ట్రావెల్ చేస్తాడట. కాని విలన్ కుంభా వల్ల ఈ టైం ట్రావెల్ లో పెద్ద అలజడి మొదలౌతుంది... టామ్ అండ్ జెర్రీలా ఈ ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్, టైం ట్రావెల్ గేమే వారణాసి అని తెలుస్తోంది. ఇది హాలీవుడ్ రిపోర్టర్ల పుణ్యమాని బయటికొచ్చినా బేసిక్ స్టోరీ లైన్.