సూపర్ స్టార్ శాసించాడు.. రాజమౌళి పాటించాడు…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు శాసించాడు.. దర్శక ధీరుడు రాజమౌళి పాటించాడు.. 25 ఏళ్ల తన కెరీర్ లో ఎన్నడూ ఇది జరగలేదు. మహేశ్ బాబుతో వారణాసి మూవీ తీస్తున్న రాజమౌళి, ఫస్ట్ టైం తన స్టైల్ కి భిన్నంగా మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు.

Post Published By: dialnews
Updated : 6 April 2026, 6:40 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు శాసించాడు.. దర్శక ధీరుడు రాజమౌళి పాటించాడు.. 25 ఏళ్ల తన కెరీర్ లో ఎన్నడూ ఇది జరగలేదు. మహేశ్ బాబుతో వారణాసి మూవీ తీస్తున్న రాజమౌళి, ఫస్ట్ టైం తన స్టైల్ కి భిన్నంగా మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు. అసలే 55 వేల థియేటర్స్ నుంచి 70 వేల థియేటర్స్ కి వారణాసి విడుదల లెక్కలు మారిపోతున్నాయి. ఇలాంటి టైంలో 80 శాతం వండర్ మాత్రం అందరికి షాక్ ఇస్తోంది.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం కిక్ ఇస్తోంది... మొన్నటికి మొన్నే ఈ మూవీ షూటింగ్ 50శాతం పూర్తైందని తేల్చాడు రాజమౌళి. కట్ చేస్తే ఈ వార్త వచ్చి వారాలే గడుస్తోంది. ఈలోపే మరో 30శాతం షూటింగ్ పూర్తైపోయింది.. అంటే వారణాసి 80శాతం షూటింగ్ పూర్తైనట్టేనా? 2027 ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన వారణాసి, సమ్మర్ లోగా షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేస్తారా? మరి జూన్ నుంచి ఏప్రిల్ వరకు వన్ ఇయర్ ఈ ఫిల్మ్ టీం ఏం చేస్తుంది..? ఈ గ్యాప్ ని ఎలా వాడుకోబోతోంది?

వారనాసి మూవీ నిజంగా వండర్ చేసేలా ఉంది. సైలెంట్ గా బాంబ్ పేల్చినట్టు ఈ సినిమా ఆల్ ఆఫ్ సడన్ గా 80శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ నుంచి మొదలు పెడితే, జూన్ ఎండ్ లోగా వారణాసి షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టి ప్యాకప్ చెప్పేలా ఉన్నాడు రాజమౌలి. ఇది నిజంగా షాకింగ్..బాహుబలి రెండేళ్లనుకుంటే, రెండు భాగాలను నాలుగేల్లు తీశాడు. త్రిబుల్ ఆర్ కేవలం ఏడాదిలో పూర్తి చేస్తానని చెప్పి, 3 ఏళ్లు టైం తీసుకున్నాడు. కట్ చేస్తే మహేశ్ ఫ్యాన్స్ అయితే, రాజమౌళితో సినిమా అనగానే రెండు మూడేళ్లు సెట్స్ కే తమ హీరో పరిమితమౌతాడని మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. 2027 ఏప్రిల లో రిలీజ్ అన్నా నమ్మలేదు.. నమ్మట్లేదు.

ఎందుకంటే రాజమౌలి రిలీజ్ డేట్లు ఎప్పుడు వాయిదా పడటం కామన్ కాబట్టి. అంతటికి పర్ఫెక్షన్ కారనంతో మేకింగ్ డిలే అవటం. అలాంటిది చెప్పింది చెప్పినట్టు వారణాసిని ఈ ఏడాది సమ్మర్ లోగా షూటింగ్ పూర్తిచేస్తున్నాడు రాజమౌళి. జూన్ లోగా షూటింగ్ పూర్తయ్యేలా ఉంది. పక్కగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే పరిస్తతి కనిపిస్తోంది. జూన్ ఎండ్ లోగా షూటింగ్ అయిపోతే, రిలీజ్ డేట్ వరకు టైం చూస్తే ఏకంగా ఏడాది టైం ఉంది..ఇది పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా ఎక్కువ.. ఇంకా వరల్డ్ వైడ్ గా టూర్లేసి వారణాసిని ప్రమోట్ చేయటానికి కూడా చాలా టైం ఉన్నట్టే... అందుకే అంతా షాక్ అవుతున్నారు. ప్రబాస్, నాని, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా ఎవరితో సినిమా తీసినా అనుకున్నటైం కి షూటింగ్ పూర్తి చేయని రాజమౌళి, మహేశ్ ని మాత్రం కరుణించాడు. అంతా అనుకున్న టైంలోగానే పూర్తి చేస్తున్నాడు

అయితే ఇప్పుడు పూర్తయ్యేది వారణాసి మొత్తం సినిమానా? లేదంటే రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ని విడకొడుతున్నారు కాబట్టి, మొదటి భాగం షూటింగ్ పూర్తి కావొస్తోంది అనుకోవాలా? అంటే ఇంకా రెండో భాగం షూటింగ్ పెండింగ్ ఉంటుందనే డౌట్లు కూడా ఉన్నాయి.కాని ఏది తేలలేదు. ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం కనిపించట్లేదు. కాని ప్రియాంక చోప్రామాత్రం వారణాసి షూటింగ్ కోసం రెడీ అవుతున్న వీడియోలతో అప్ డేట్లు ఇచ్చి ఫ్యాన్స్ ని కొంత వరకు కూల్ చేస్తోంది.. వారణాసి టీం సర్ ప్రైజులతో నిండిపోతోంది.

Published : 
  • 6 April 2026, 6:40 PM IST