500 కోట్ల Openings.. 10,000 కోట్ల Look…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు రాముడి అవతారం, వచ్చేనెలలో మైండ్ బ్లాంక్ చేయబోతోందా? ఇప్పటి వరకు అన్నీ రూమర్స్ నిజమయ్యాయి.. అవుతున్నాయి. ఇది కూడా అలాంటిదేనా అంటే, కాదు.. ఇక మీదట సీక్రసీకి ఛాన్సే లేదని తెలుస్తోంది. అంతా ఓపెన్... అలాని మొత్తం చెప్పయరు..

Post Published By: dialnews
Updated : 8 April 2026, 5:37 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు రాముడి అవతారం, వచ్చేనెలలో మైండ్ బ్లాంక్ చేయబోతోందా? ఇప్పటి వరకు అన్నీ రూమర్స్ నిజమయ్యాయి.. అవుతున్నాయి. ఇది కూడా అలాంటిదేనా అంటే, కాదు.. ఇక మీదట సీక్రసీకి ఛాన్సే లేదని తెలుస్తోంది. అంతా ఓపెన్... అలాని మొత్తం చెప్పయరు.. సూపర్ స్టార్ కృష్ణ తన జీవితంలో సాధించాలనుకున్న ఒకే ఒక్క లక్ష్యం ఇప్పుడు తన వారసుడు, వారణాసిలో సాధించేలా ఉన్నాడు. ఔను సూపర్ స్టార్ కృష్ణ అంటేనే, అల్లూరి సీతారామరాజు.. ఆ పేరు చెబితే కృష్ణ గుర్తుకురావాల్సిందే.. కౌవ్ బాయ్ అన్నా, జేమ్స్ బాండ్ మాట విన్నా సూపర్ స్టారే గుర్తుకొస్తాడు.. అయినా తనకి ఒక కోరిక మాత్రం అలానే ఉండిపోయింది.. రాముడు, కృష్ణుడు, కర్ణుడు.. ఇలాంటి పాత్రల్లో వెలగాలని.. ఆపేర్లు చెబితే ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్లే గుర్తొస్తారు.. అలాంటి దేవుళ్ల పాత్రలు తన కెరీర్ లో లేవనే తన కోరిక తీరబోతోంది. తనో గ్నాపకంగా మారినా, తండ్రి కలని, సూపర్ స్టార్ మహేశ్ బాబు తీర్చబోతున్నాడు.. రాముడిగా మారి.. అందుకే మే 31న భూమి బద్దలయ్యే తన రామావతారం బయటికి రాబోతోందా? ఘట్టమనేని ఫ్యామిలీలో ఫస్ట్ దేవుడి పాత్ర ఫ్యాన్స్ లో పూనకాలు తీసుకురాబోతోందా?

సూపర్ స్టార్ కృష్ణకి తీరని కోరకంటే రాముడు, కృష్ణుడు, లాంటి దేవుని పాత్రలేనా? ఖచ్చితంగా ఇదే కృష్ణ కలలు కన్న పాత్రల లిస్ట్... ఇప్పుడు తన తండ్రి ఓ గ్నాపకంగా మారినా, తన కలని మహేశ్ బాబు నిజం చేయబోతున్నాడు. సూపర్ రాముడిగా మారుతున్నాడు. ఆ లుక్కే ఇప్పుడు రివీల్ కాబోతోంది. ఘట్టమనేని వంశంలో తొలి రాముడిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కనిపించబోతున్నాడు.మే 31న అంటే, సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా, వారణాసిలో రాముడి పాత్ర లుక్ రాబోతుందని అంటున్నారు. ఇది లీకా, లేదంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని కూల్ చేసేందుకు పరోక్షంగా వదిలిన ఫీలరా అన్నది తేలాలంటే, ఏదైని అఫీషియల్ స్టేట్ మెంట్ రావాలి.. వారణాసిలో రుద్రుడిగా, శివుడిగా కూడా కనిపించబోతున్న మహేశ్ బాబు, నిజంగా ఒకే దెబ్బకు మూడు పాత్రలతో, తన తండ్రి కలని నెరవేర్చబోతున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణేం తక్కువకాదు.. అల్లూరి సీతారామారాజంటే తనే గుర్తొస్తాడు.. ఫస్ట్ ఇండియన్ జేమ్స్ బాండ్ మూవీ తనదే.. ఫస్ట్ కౌబాయ్ సినిమా తనదే.. సో ఎన్టీఆర్ అనగానే రాముడు, కృష్ణుడు, ఇలా దేవుల్ల పాత్రలు, పౌరానిక పాత్రలే గుర్తొస్తాయి.. అలానే సూపర్ స్టార్ కృష్ణ అంటే కూడా మాడ్రన్ ప్రయోగాలు, అల్లూరి సీతారామరాజు లాంటి సాహసాలే గుర్తొస్తాయి.. అక్కడ ఎలాంటి డిబేట్ లేదు. ఐడెంటిటీ క్రైసిసే ఎప్పుడూ లెజెండ్ కృష్ణకు రాలేదు..ఐనా తన కాన్ టెంపరరీస్ తో పోలిస్తే, దేవుడి పాత్రలు వేయలేదే అన్న వెలితి మాత్రం తనకుండేది.. కాని తను మాడ్రన్ హీరో గా ఎంట్రీ ఇవ్వటం.

తన ఎంట్రీ టైంలో పౌరాణిక పాత్రలు, ఆ జోనర్ల ట్రైండ్ అయిపోవటంతో, తనదైన రూట్లోనే వెళ్లాడు.. అందుకే తను వేయలేకపోయిన పాత్రలు ఇంతకాలానికి మహేశ్ బాబు వేస్తుండటం, అది పాన్ వరల్డ్ స్టాయిలో అంటే ఫ్యాన్స్ లో పూనకాలు రావటం కామన్.అదే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా, వారణాసి టీం రాముడిగా మహేశ్ బాబు లుక్ ని రివీల్ చేయబోతోందంటున్నారు. ఆల్రెడీ శివుడి పాత్ర కూడా తనే వేస్తున్నాడు కాబట్టి, ఘట్టమనేని ఫ్యామిలీలో పౌరాణికాల వెలితి తీరినట్టే.. సూపర్ రాముడిగా మహేశ్ కనిపిస్తే, బాక్సాఫీస్ దద్దరిల్లినట్టే.. 25 నిమిసాల రామాయనం అంటేనే వారణాసి వార్తలు వైరలౌతున్నాయి.. ఇక రాముడు, శివుడు ఇలా ఇన్ని పాత్రల్లో మహేశ్ బాబు కనిపిస్తే పాన్ ఇండియా షేక్ అవుతుంది. వరల్డ్ మార్కెట్ లో ఇండియన్ సినిమా రీసౌండ్ పెరిగిపోతుంది.

Published : 
  • 8 April 2026, 5:37 PM IST