25 నిమిషాలు.. 4000 కోట్లు..గూస్ బంప్స్…!

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారనాసి కథ ఇదంటూ, గ్రాఫిక్స్ టీం రివీల్ చేసిన స్టోరీ ఇప్పుడు వైరలైంది. మరీ కథంతా వాళ్ల వెబ్ సైట్లో పెట్టలేదు కాని, బేసిక్ ప్లాట్ మాత్రం గ్రాఫిక్స్ టీం రివీల్ చేసింది. అలాని ఈ లీకేజితో వారణాసికి వచ్చే డ్యామేజి ఏమి లేదు.

Post Published By: dialnews
Updated : 10 April 2026, 7:10 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారనాసి కథ ఇదంటూ, గ్రాఫిక్స్ టీం రివీల్ చేసిన స్టోరీ ఇప్పుడు వైరలైంది. మరీ కథంతా వాళ్ల వెబ్ సైట్లో పెట్టలేదు కాని, బేసిక్ ప్లాట్ మాత్రం గ్రాఫిక్స్ టీం రివీల్ చేసింది. అలాని ఈ లీకేజితో వారణాసికి వచ్చే డ్యామేజి ఏమి లేదు. ఉండదు.. కారణం ఇది ఎవరైనా ఊహించగలిగేదే.. ఎప్పటి నుంచో రూమర్స్ రూపంలో వినిపిస్తున్న స్టోరీ లైనే.. కాకపోతే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న షాకిచ్చే టాక్ ఏంటంటే, హాలీవుడ్ కథల ప్రేరణ.. ఔను హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ తీసిన ఒక సినిమాను, జురాసిక్ పార్క్ డైరెక్టర్ తీసిన మూవీతో మిక్స్ చేస్తే అదే వారణాసి అంటున్నారు.దానికి మన ఇండియన్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ ని యాడ్ చేసి ఇండియనైజ్ చేస్తున్నారనంటున్నారు.. అంటే 2 హాలీవుడ్ మూవీలను కాపీ కొడుతున్నాడా? కానే కాదు.. ఇదే రాజమౌళి చేస్తున్నమ్యాజిక్.. అదేంటో చూసేండి...

బాలీవుడ్ లో రామాయణం తీస్తున్నారు.. అది కూడా 4 వేల కోట్లు పెట్టి.. అదే రామాయనాన్ని, 25 నిమిషాల్లో 250 కోట్లతో మనముందుకు తీసుకొస్తున్నాడు రాజమౌళి. నిజంగా హిందీ రామాయణం రిలీజై, ఆతర్వాత వారణాసి వస్తే, దేశం మొత్తం షాక్ అవుతుంది... 4 వేల కోట్లు పెట్టి అంత పెద్ద రామాయణం తీస్తే, 250 కోట్లతో అదే రామాయణాన్ని అంతకుమించేలా వారణాసిలోఒక భాగంగా చూపించటం అంటే, సినిమా ఎలా తీయాలో ఎగ్జాంపుల్ సెట్ చేయటమే..అంటే రామాయణం గొప్పతనం తగ్గించటం కాదు.. 4 వేల కోట్ల బాలీవుడ్ మేకింగ్ స్టాండర్ట్స్ ఏపాటిదో సింగిల్ ఎపిసోడ్ లో చూపించటం.. అదే వారణాసిలో పాతిక నిమిషాల ఎపిసోడ్ తో రుచి చూపించబోతున్నాడు రాజమౌలి. అంతవరకు బానే ఉంది కాని, వారాణాసి అంటే హాలీవుడ్ హిట్ మూవీలైనా ఇన్సెప్షన్, ఇండియానా జోన్స్ కథలని కలిపితే అదే ఈ సినిమా అంటున్నారు. అంటే ఇది రెండు హాలీవుడ్ మూవీల కాపీ అనుకోవాల? కానే కాదు.. అక్కడే రాజమౌళి మ్యాజిక్ చేస్తున్నాడు.. అదేంటో అర్ధమవ్వాలంటే, వారనాసి బేసిక్ స్టోరీలైన్ తెలియాలి..

అసలు కాన్సెప్ట్ గ్లింప్స్ లో హింట్లు తప్ప, కథేంటో తేల్చలేదు.. కాబట్టి టీజర్ వచ్చే వరకు ఈ మూవీ కథేంటో ఎవరూ గెస్ చేయలేరు.. అలాంటప్పుడు, ఇది పలానా మూవీల కాపీ అని అప్పడే ఒకొలిక్కి ఎలా రాగలం.. అక్కడే ఈ సినిమాకోసం గ్రాఫిక్స్ డిజైన్ చేసే వీఎఫ్ ఎక్స్ కంపెని టంగ్ స్లిప్పైంది. వాళ్లవెబ్ సైట్లో వారణాసి సినాప్సిస్ అంటే, క్లుప్తంగా స్టోరీ లైన్ ని పెట్టింది.. అది చదివాకే,అంతా ఇది కార్తికేయ 2 కి మరో వర్షన్ అని, ఇన్సెప్షన్, ఇండియానా జోన్స్ కాపీ అని అంటున్నారు..ఐతే వారాణాసి గురించి వెబ్ సైట్లో ఉన్న సినాప్సిస్ చూస్తే... శివ భక్తుడైన హీరో కాలంలోవెనక్కి ప్రయాణించి, విశ్వం తలరాత మార్చే ఒక పురాతన వస్తువు కోసం వేటకు బయలు దేరతాడు.. ఆ జర్నీలో తన మిషన్ వెనుకున్న కుట్రలు అర్ధం చేసుకుంటాడు.

ఇది విది లోభాగంగా, కొన్ని శక్తులు తనని ఇందులో భాగంగా మార్చాయని తెలుసుకుని, ఈ విశ్వాన్ని కాపాడేందుకు,వారణాసికి జరిగే ద్రోహాన్ని ఆపేందుకు ఎలాంటి సాహసాలు చేస్తాడు అనే పాయింట్ తో ఈమూవీ వస్తోందట.అయితే దీనికి హాలీవుడ్ మూవీలైన, ఇన్సెప్షన్, ఇండియానా జోన్స్ కి ఉన్న లింకేంటంటే.. ఇన్ సెప్షన్ లో హీరో తన టార్గెట్ అయిన వ్యక్తుల కలలోకి వెళ్లి, రహాస్యాలు చేధిస్తాడు... అలానే వారణాసిలో హీరో కాలంలో ప్రయాణించి, మనుషుల మనసుల లోతుల్లో క్లూస్ వెతుకుతాడు..ఆ క్లూస్ ని బేస్ చేసుకుని, అనుకున్న పురాతాన వస్తువుని దక్కించుకుంటాడు.. ఇదంతా ఇండియానా జోన్స్ లో ప్రొఫేసన్ ఇండియానా లానే ఉంటుందట.. ఐతే ఈ రెండు సినిమాల నుంచి కాపీరైట్స్ తీసుకున్నాకే, ఈ మూవీకి రామాయన, శివపురాణాలను యాడ్ చేసి, మైథాలజీ టచ్ ఇచ్చాడట రాజమౌలి.. అందుకే ఈ సారి హాలీవుడ్ సినిమాల ప్రేరణతో, ఏకంగా హాలీవుడ్ మీదే ఎటాక్ చేయబోతున్నాడు జక్కన్నా.

Published : 
  • 10 April 2026, 7:10 PM IST