బాహుబలి తో పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేశాడని, రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేస్తాడనంటున్నారు. వారణాసితో వరల్డ్ ఆడియన్స్ పిచ్చెక్కినట్టు మన మూవీ కోసం క్యూ కడతారని కలలు కంటున్నారు. ఇది రాజమౌలి మేకింగ్ మీదున్న కాన్ఫిడెన్స్ తో తెలుగు జనాల పెంచుకుంటున్న ఊహలు.. కాని రియాలిటీ చెక్ చేస్తే, అమెరికన్లు, యూరోపియన్లు మన మూవీలను చూస్తారా? ఏదో బాహుబలి 2 బాగుందన్నారు..త్రిబుల్ ఆర్ నాటు పాటకి స్టెప్పేశారు.. అంతమాత్రానికే వారణాసి వస్తోందని, పనికట్టుకుని టిక్కెట్లు కొంటారా? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది...? ఈ ప్రశ్నలు చేదు నిజాలనే గుర్తు చేస్తాయి... అలాని వారనాసికి సీన్ లేదనుకోవాల్సిన పనిలేదు.. కాని 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేసినా కూడా, ఇండియన్ సినిమాను చూసేందుకు వాళ్లంతా క్యూ కడతారని అనుకోలేం.. ఏదో మిరాకిల్ జరగాలి.. ఆమాత్రం విషయం అర్ధం చేసుకోలేని ఇమ్మెచ్చూర్ కాదు రాజమౌళి.. మరి వరల్డ్ ఆడియన్స్ ని నిజంగా థియేటర్స్ రప్పించేందుకు రాజమౌళి ఏం చేస్తున్నాడు..ప్రమోషన్ పక్కన పెడితే, ఏం పేలిస్తే, అక్కడ వారణాసి సౌండ్ కి ఒక్కొక్కరికి దిమ్మతిరిగిపోతుందనంటున్నాడు?
బాహుబలి తీస్తున్నప్పుడు 250 కోట్లు పెట్టి రెండు భాగాలతో తెలుగు సినిమానా? మన మార్కెట్టే 100 నుంచి 200 కోట్లైతే, అంతకుమించిన బడ్జెట్ తో సినిమా తీసి ఏం లాభమన్నారు. హిట్టైనా, 200 కోట్ల్ లోపు ఉన్న మార్కెట్ లో 250 కోట్లు పెట్టుబడి పెడితే హిట్టైనా నష్టమే అన్నారు. కట్ చేస్తే, బాహుబలి 1 కి 580 కోట్లు, పార్ట్ 2 కి 1850 కోట్లు మొత్తంగా, 24 వేల కోట్లు వచ్చాయి..అంటే మన మార్కెట్ చిన్నదైనంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. కొత్త మార్కెట్ ని వెతుక్కోవాలి... అలా పాన్ ఇండియా ట్రెండ్ ని సెట్ చేసిన రాజమౌలి, ఇలానే వారనాసితో పాన్ వరల్డ్ మార్కెట్ ని క్యాప్చర్ చేస్తాడా? అంతా ఈజీ అయితే కాదు. మనదేశంలో బాహుబలి లాంటి మూవీ తీసి, ఇంప్రెస్ చేయటం వేరు. ఎంత నార్త్ ఇండియన్స్ అయినా, భాష వేరు, కల్చర్ కొంత వేరు కావొచ్చు.
కాని అందరూఇండియన్సే.. అవే ఎమోషన్స్ కాబట్టి బాలీవుడ్ ఇవ్వని క్వాలిటీ టాలీవుడ్ చూపించే సరికి, ఫిదా అయ్యారు. బాహుబలికోసం బారుతీరారు.. కాని ఇదే రిజల్ట్ వారణాసితో వరల్డ్ మార్కెట్ లో వస్తుందనుకోలేం. ఎందుకంటే, అక్కడ పోటీ ఇచ్చేది బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీ కాదు.. వరల్డ్ నెంబర్ వన్ అనిపించుకున్న హాలీవుడ్..రైటింగ్, మేకింగ్, గ్రాఫిక్స్, బడ్జెట్ అన్నీంట్లో వాళ్లని కొట్టేవాల్లు లేరు.. కాబట్టి అంతకుమించేలా వారణాసి తీస్తే తప్ప, తెల్లోల్లు మన మూవీ కోసం క్యూలు కట్టే ఛాన్సే ఉండదు..ఏదో మన ఇండియన్ మూవీలను ఫర్ ఏ ఛేంజ్ అని చూడటమో, లేదంటే, త్రిబుల్ ఆర్ నాటు నాటు పాటలాగా ఏదైనా స్పెషల్ అనిపించే అలాచూడటమో కామన్. కాని డెడికేటెడ్ గా ఒక అవెంజర్స్, ఒక అవతార్, ఒక స్టార్ వార్స్ అంతెందుకు డ్యూన్ లాంటి మూవీలను చూసినట్టు వారణాసిని చూస్తారా.?? అయ్యేపని కాదు.
అలా అవ్వాలంటే, 55 వేల థియటేర్స్ లో సినిమాను రిలీజ్ చేయటం కాదు, వాళ్ల ఊహలకు అందరినిదేదో వారణాసిలో ఉండాలి.. కంప్లీట్ ఒక కొత్త ప్రపంచంలోకి వాల్లని తీసుకెళ్లాలి... అందుకే వారణాసి కోసం ఐమ్యాక్స్ కెమెరాని వాడి, మొత్తం మూవీని అందులోనే షూట్ చేశఆడు. అలా మేకింగ్ లో హాలీవుడ్ స్టాండర్ట్స్ ఫాలో అవుతున్నాడు రాజమౌలి.ఇక డైనోసార్లు, టైం ట్రావెల్ లాంటి హాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు పెట్టి, వాళ్లదారిలోనే వెలతూ, మన మిథాలజీతో స్పెషల్ టచ్ ఇస్తున్నాడు. ఏడు వింతలు కూడా ఈ సినిమాలో మతిపోగొట్టే అంశాలే.. ఒకే టైం లైన్ లో చక్కర్లు కొట్టే హీరో, మళ్లీ మళ్లీ జన్మించేలా పునర్జన్మ కాన్సెప్ట్, కూడా ఉంది.. హాలీవుడ్ హిట్మూవీ ఇండియానాజోన్స్ స్టైల్లో హీరో పాత్ర యూరోపియన్స్ రిలేట్ చేసుకునే లా ఉంటుంది. కాబట్టి రీచ్ పెరుగుతుంది. ఇలా పాన్ వరల్డ్ మార్కెట్ కోసం ఎంత చేయాలో అంతా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌలి. సో ఇవన్నీ వర్కవుట్ అయ్యి హాలీవుడ్ నే ఛాలెంజ్ చేసేంత హిట్ కాదు కాని, 5 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల వరకు వసూళ్లు రాబడితే మాత్రం , పాన్ వరల్డ్ మార్కెట్ షేక్ అయినట్టే... అందుకే ఎమోషనల్ గా కాకుండా, ప్రాక్టికల్ గా ఒక్కో మెట్టు వారణాసిని పైకెక్కిస్తున్నాడు రాజమౌలి.