సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి కాన్సెప్ట్ గ్లింప్స్ లో దుమ్ముుదులిపారు. ఆ కాన్సెప్ట్ గ్లింప్స్ కూడా పాతబడిపోయింది. రిలీజ్ చేసిన రెండు పాటలు పేలాయి.. అవెంత బాగున్నా, వింటూ వింటూంటే, అవి కూడా పాతబడిపోతున్నాయి... త్వరలో మూడో పాట రాబోతోందన్నారు. కాని అది కేవలం గాసిప్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు టీజర్ వంతొచ్చింది. 2027 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ పెట్టుకుని, ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. కాని వారణాసి పాన్ ఇండియా మూవీ కాదు.. హాలీవుడ్ లెవల్లో సినిమా రిలీజ్ చేయాలంటే కనీసం ఏడాది ముందు ట్రైలర్ వదలాలి. లేదా కనీసం రిలీజ్ కి 6 నెల్ల ముందు ట్రైలర్ రావాలి... అలా చూస్తే మే ఎండ్ కల్లా, గ్లింప్స్, ఆగస్ట్ లో టీజర్ దసరాకు ట్రైలర్ వచ్చి తీరాలి.. ఇంతకి ఇందులో ఏ ముహుర్థానికి ఏది కన్ఫామ్ కాబోతోంది. గ్లింప్స్ ని కూడా కాన్సెప్ట్ గ్లింప్స్ ఈవెంట్ లానే ప్లాన్ చేస్తాడా? వారణాసి టీం సైలెంట్ గా ఏదైనా బాంబు పేల్చబోతోందా?
వారనాసి మూవీ ప్రమోషన్ ఏంటో ఎవరికీ అర్దం కాని ఎమోషన్... గుట్టు చప్పుడుకాకుండా సినిమాను మొదలుపెట్టి, ఎవరూ ఊహించని టైంలో, గ్లింప్స్ రిలీజ్ చేశాడు రాజమౌళి. రిలీజ్ కి ఏడాది ముందే రెండు పాటలు వచ్చేశాయి... ఇంటర్వూలు ఇచ్చేశాడు.. కట్ చేస్తే మళ్లీ సైలెన్స్.. అసలు వారణాసి టీం హౌజ్ అరెస్ట్ అయ్యిందా అన్నట్టు, అంతా సెట్ కి పరిమితం అయ్యారు.ఇప్పుడు మేనెలాఖర్లో ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే సర్ ప్రైజ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమా? లేదంటే నిజంగానే రాజమౌలి టీం ప్రమోషన్ లోభాగమా అన్నది తేలాలి...ఐతే రాజమౌలి ప్రజెంట్ మూడో పాటని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.. కాని మూడో పాటని వారణాసి టీం రిలీజ్ చేయబోతోందన్నట్టు మాత్రం వార్తలొస్తున్నాయి.
రియాలిటి చూస్తే మాత్రం వారణాసి అసలు సిసలు ప్రమోషన్ కి టైం అయినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో వరల్డ్ ఆడియన్స్ అటన్షన్ లాక్కోవాలంటే, రిలీజ్ కి ఏడాది ముందు నుంచే ప్రమోషన్ లో ఎమోషన్ పెంచాలి. ముందు గ్లింప్స్, తర్వాత టీజర్, ఆవెంటనేట్రైలర్.. ఇలా అన్నీ ఒక లెక్క ప్రకారం జరగలి. అందుకే మే నెలాఖర్లో డైలాగ్స్ తో కూడిన గ్లింప్స్ ని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఆగస్ట్ 15 కి వారనాసి టీజర్ రిలీజ్ చేసేందుకు కూడా రాజమౌళి టీం ప్లాన్ చేస్తోంది. ఆతర్వాత దసరాకు వారణాసి ట్రైలర్ రావటం లాంచనమే. ఎందుకంటే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ మూడు నెల్లకో సాలిడ్ అప్ డేట్ తో ప్రమోషన్ చేయాల్సి వస్తోంది. ఇండియాలో, అలానే వరల్డ్ ప్లాట్ ఫాం మీద వారణాసిని హాలీవుడ్ సినిమాల స్థాయిలో ప్రచారం చేయాలంటే ఈ నియమం తప్పని సరి.
హాలీవుడ్ సినిమాలేవైనా రిలీజ్ కి కనీసం 6 నెల్ల ముందు, లేదంటే ఏడాది ముందే టీజరో , ట్రైలరో రిలీజ్ చేయటం కామన్. తర్వాత సినిమా రిలీజ్ కి 2 నెల్ల ముందు మరో కొత్త ట్రైలర్ రివీల్ చేస్తారు.. అలానే వారణాసిని ప్రమోట్ చేసేందుకు, మే నెలాఖర్లో గ్లింప్స్, ఆగస్ట్ లో టీజర్, దసరాకు ట్రైలర్ ఇవే పర్ఫెక్ట్ ముహుర్తాలు.. అందుకే ఆ ఏర్పాట్లు ఒకవైపు, షూటింగ్ మరో వైపు.. అందుకే వచ్చేనెలాఖర్లో వారణాసి టీం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాంక్ అయ్యే సర్ ప్రైజ్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.