సూపర్ స్టార్ మహేశ్ బాబు వెకేషన్ కి ఫారెన్ వెల్లాడు. అది కూడా సోలోగానే వెళ్లాడు. ఎప్పుడు వెకేషన్ ప్లాన్ చేసినా ఫ్యామిలీతో వెళ్లే మహేశ్ బాబు ఇప్పుడు సోలోగా ఎందుకు ఫారిన్ వెళ్లాడు.. గతంలో కూడా ఒకసారి ఇలానే సోలోగా వెళ్లాడు.. తిరిగొచ్చాక మాత్రం తన లుక్ మారిపోయింది. వారణాసి కోసం జర్మనీలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న సూపర్ స్టార్, అటు రెండు నెల్ల ట్రైనింగ్ లో చాలా నేర్చుకున్నాడు.. పనిలో పనిగా చాలా జుట్టుపెంచాడు.. కట్ చేస్తే ఇంతకాలానికి మళ్లీ తను సోలోగా ఫారెన్ వెళ్లాడు.. అంటే సమ్ థింగ్ ఫిజీ అన్న ప్రచారం నిజమేనా? బేసిగ్గా ఇది సమ్మర్.. డెఫినెట్ గా తన పిల్లలకు కూడా హాలీడేస్ టైం.. అయినా ఫ్యామిలీని కాదని తను మాత్రమే వెకేషన్ కి వెళ్లాడంటే, ఇదసలు వెకేషన్ బ్రేకేనా? వారణాసికోసం మరో లుక్ ట్రై చేస్తున్నాడా? అంటే ఇప్పుడున్న లుక్ తో అవసరం తీరిందా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసికోసం గెడ్డం, జుట్టు పెంచి క్రేజీగా కనిపించటం ఫ్యాన్స్ కే కాదు, కామన్ ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. వారణాసి లో తన లుక్ ఆల్ మోస్ట్ అందరికి కిక్ ఇస్తోంది. ఆల్రెడీ 80శాతం షూటింగ్ అయిపోయింది.. మొదట్నుంచి తన లుక్ ని సీక్రెట్ గా ఉంచే ప్రయత్నమే చేయలేదు మహేశ్. ఏదో షూటింగ్ కి కాస్త ముందువరకు లుక్ రివీల్ కాకుండా చూశారు. కాని యాడ్స్, వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లటం, ఇలా చాలా సార్లు తన లుక్ రివీల్ అయ్యింది.ఇదంతా గతం.. ఇప్పుడు మాత్రం మహేశ్ బాబు కొంతకాలం ఎవరికీ కనిపించడు.. ఎందుకంటే వారణాసి టీం సమ్మర్ బ్రేక్ తీసుకుంది.. వెకేషన్ కి అంతా ఫ్యామిలీస్ తో ఫారిన్ ట్రిప్ కి వెళితే.. మహేశ్ బాబు మాత్రం ఒక్కడే సోలోగా వెకేషన్ కి విదేశాలకెళ్లాడు.. ఇక్కడే చాలా డౌట్లు వస్తున్నాయి. చిన్న గ్యాప్ దొరికితే, భార్యా పిల్లలతో ఫారిన్ ట్రిప్ వేసే మహేశ్, ఇప్పుడు సోలోగా ఎందుకు వెళుతున్నాడనేదే ప్రశ్న.
ఇది సమ్మర్ అంటే, తన పిల్లలకి కూడా స్కూల్, కాలేజ్ హాలీడేస్ టైం.. కాబట్టి వాళ్లని వెకేషన్ కి ఫారిన్ తీసుకెళ్లటం అంతా ఎక్స్ పెక్ట్ చేసేదే.. కాని మహేశ్ బాబు మాత్రం ఒక్కడే విదేశాలకు వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడే చాలా డౌట్లు వస్తున్నాయి. గతంలో కూడా ఇలానే ఒక సారి జర్మనీకి సోలోగా వెళ్లాడు మహేశ్ బాబు. అంతా వారణాసి కోసం అడవుల్లో ట్రెక్కింగ్ తోపాటు ఫిజికల్ లుక్ మార్పుకోసం అక్కడ వర్కవుట్లు చేశాడన్నారు.నిజంగానే జర్మనీనుంచి మహేశ్ బాబు ఇండియా రాగానే, తన లుక్ మారిపోయింది. లాంగ్ హేయిర్, గెడ్డం, ఇలా తనలో చాలా మార్పులు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు ఇలానే సోలోగా వెకేషన్ కి విదేశాలెల్లాడు మహేశ్. అంటే తన మళ్లీ లుక్ మార్పుకోసమే ఇలా వెల్లాడా? అంటే ఇప్పటి వరకు ఉన్న తన లుక్ ఇకమీద పనికి రాదా? సినిమాలు మరో గెటప్ లో మహేశ్ కనిపించే సీన్లు వచ్చినట్టున్నాయి.. అందుకే తన లుక్ మారే టైం వచ్చిందనంటున్నారు.ఇలాంటి అనుమానాలు పెరుగుతున్నాయి. డైనోసార్ల సీన్లు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్ల షూటింగ్ లో మాత్ర కొత్త మహేశ్ బాబుని రాజమౌళి చూపిస్తాడేమో అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. కొంతవరకు లీకులు కూడా ఈ ప్రచారానికి కారనం. ఇంతకి లాస్ ఏంజిల్స్ లో ఒంటరిగా మహేశ్ ఏం చేయబోతున్నాడు? కేవలం లుక్ మాత్రమేమార్పా? తను 35 రోజుల తర్వాత ఇండియాకి తిరిగొస్తేనే తేలుతుంది.