సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్ వరకు అంతా, ఇప్పడు వింటున్న పేరు మెక్సికో..అక్కడే వారణాసి మూవీ ప్రమోషణ్ సెన్సేషన్ అయ్యేలా ఉంది. రాజమౌళి ఇచ్చిన ఒక్క లీకుతో పాన్ ఇండియా మార్కెట్ లో ఒక షాక్ వేవ్ వచ్చినట్టౌతోంది. ఇంతకాలం వారణాసి కథ ఇది, లేదంటే పాత్ర అలా ఉంటుంది.. టీజర్ పలానా టైంలో రాబోతోందని, రూమర్లు, గుసగుసలొచ్చాయి. ఎవరెవరో లీకులిచ్చిన సందర్భాలున్నాయి. కాని వారణాసి డైరెక్టర్ రాజమౌళినే ఇప్పడు షాకింగ్ లీకిచ్చేశాడు. మెక్సికో మాయలో తను పడిపోయినట్టు చెప్పాడు.. వారణాసిలో రామయణం ఎపిసోడ్ వెనకున్న మెక్సికో లింక్ ఇప్పుడు బయట పడింది. పాతాళం నుంచి కథని తీసుకొచ్చి వారణాసిలో వాడినట్టు తెలుస్తోంది. ఇంతకి ఈ మెక్సికన్ మాయేంటి? పాతాలం నుంచి రాజమౌళి తెచ్చిన కథేంటి?
వారణాసి మూవీకి మెక్సికన్ నాగరికతైన మాయన్లకున్న కనెక్షన్ సెన్సేషన్ అయ్యేలేఉంది. నిజానికి మెక్సికో దేశంలోని పురాతన నాగరికతైన మాయన్లకు మన రామాయణానికి ఎప్పటినుంచో లింకుంది. సీతను రావణుడు ఎత్తుకెళ్లినప్పుడు, సుగ్రీవుడే ప్రపంచ నలుమూలల వేతికాడు. అంతేకాదు పాతా లోకంలో కూడా వెతికినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. అదే ఇప్పుడు వారణాసిని మెక్సికోలో వైరల్ అయ్యేలా చేస్తోంది.ఇక 1400 కోట్ల బడ్జెట్ తోతెరకెక్కతున్న వారణాసి మీద రాజమౌళి ఇచ్చిన లీకు, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేస్తోంది. అదే వారణాసి టీజర్. వచ్చేసింది.. వాయించేస్తోంది.. అది కూడా యూట్యూబ్ లో కాదు... ఎక్కడా ఈవెంట్ పెట్టి ఫ్యాన్స్ కి టీజర్ ని చూపించిందిలేదు. అంతా మెక్సికో మాయ. అంతేకాదు మెక్సికన్ మాయా లోకం మీద కూడా రాజమౌలి లీకిచ్చి అందరికి షాక్ ఇస్తున్నాడు.
మెక్సికోలో జరిగే కామిక్ కాన్ ఫెస్టివల్ లో వారణాసిని ప్రమోట్ చేసేందుకు వెళ్లిన రాజమౌళి, ఇక అక్కడ ఈ సినమా తాలూకు ఎక్స్ క్లూజివ్ విజువల్స్ ని స్కీన్ చేస్తారనే ప్రచారం రెండు రోజులుగా జరిగింది. తీరి చూస్తే మెక్సికోలో టీజర్ పేలింది. ఒక్కటంటే ఒక్క క్లిప్ కాని, కనీసం ఆ టీజర్ లో ఏదైనా ఫ్రేమ్ కాని బయటికి పొక్కలేదు. ఇదే నిజంగా షాకింగ్.అసలు మెక్సికోలో అక్కడి జనాలకు ఎందుకు వారణాసి టీజర్ ని రివీల్ చేసినట్టు.. అంతా ప్రమోషన్ కోసమేనా? డెఫినెట్ గా అందుకు కాకపోతే ఎందుకు రాజమౌలి, తన డ్రీమ్ ప్రాజెక్టుని ఇలా రివీల్ చేస్తాడు.. మెక్సికో కామిక్ కాన్ ఫెస్టివల్ వల్ల, వారనాసికి, మెక్సికో, బ్రేజిల్,ఇలా లాటిన్ అమెరికా దేశాల్లో కొంత గుర్తింపు రావొచ్చు.. అందుకే తన ఈగనుంచి బాహుబలి వరకు ప్రతీ మూవీ లో కీ సీన్స్ ని అక్కడ టెలికాస్ట్ చేశారట. అలానే వారణాసి టీజర్ అక్కడే రివీల్ చేశారు.. ఐతే వారనాసిలోని రామాయణం ఎపిసోడ్ లో మెక్సికన్ మాయా నాగరికత కనిపించబోతోందని తెలుస్తోంది. అది కూడా మెక్సికో కామిక్ కాన్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రచారం చేయటం వెనక ఉన్న మరో కారణం.
నిజానిక భారత దేశం నుంచి తవ్వుకుంటూ వెలితే, అవతలవైపు మెక్సికో దేశమే వస్తుంది. అంటే అప్పట్లో పాతాల లోకం అంటే మెక్సికో అని అర్ధం వచ్చేదనే థియరీ ఉంది. అక్కడ చాలా పేర్లు మన సంస్క్రుతంలో ఉండటం, రామాయణం కనెక్షన్ కనిపించటం కూడా థ్రిల్ కి గురిచేస్తుంది. అందుకే మెక్సికన్ మాయన్ నాగరికతని, వారణాసిలోకూడా వాడేశాడట రాజమౌళి. బాహుబలిలో కూడా రాజు సింహసనం కూడా మాయన్ పిరమిడ్ మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. సో దానిక ప్రేరణ కూడా మాయన్ కల్చరే అన్నాడు జక్కన్న.. అంతే ఆ మాటతో, వారణాసి కనెక్షన్స్ మీద కూపీ లాగటం మొదలైంది. వారణాసిలో రామయణం ఎపిసోడ్ లో మాయన్లు కనిపిస్తే, ఈ సినిమా లాటిన్ అమెరికా దేశాల్లో ఈజీగా ప్రమోట్ అవుతుందనే ఆశ మహేశ్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.