5000 కోట్లా..? HOLLYWOOని భయపెట్టేదెవరు.?

ఒక్క సినిమా కొడితే, దిమ్మ తిరిగి హాలీవుడ్ మైండ్ బ్లాంక్ అవ్వాలి.. అంత సీన్ ఎవరికి ఉంది... సూపర్ స్టార్ వారణాసి 5 వేలకోట్లు కొల్లగొట్టే సినిమా అన్న అంచనాలున్నాయి.. 4 వేల కోట్ల బడ్జెట్ తో రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.

Post Published By: dialnews
Updated : 30 April 2026, 6:15 PM IST

ఒక్క సినిమా కొడితే, దిమ్మ తిరిగి హాలీవుడ్ మైండ్ బ్లాంక్ అవ్వాలి.. అంత సీన్ ఎవరికి ఉంది... సూపర్ స్టార్ వారణాసి 5 వేలకోట్లు కొల్లగొట్టే సినిమా అన్న అంచనాలున్నాయి.. 4 వేల కోట్ల బడ్జెట్ తో రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అంటే ఒక్కో భాగం 2 వేల కోట్లనుకున్నా, కనీసం అది 4 వేలకోట్లైనా రాబడితే తప్ప లాభం లేదు. అలా చూసినా అది హిట్టైనా 4 నుంచి 5 వేలకోట్లు పెద్ద విషయం కాదు. వచ్చే ఏడాది ధురందర్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. 2 వేల కోట్లని ధురందర్ 2 రీచ్ అవుతోందంటే, ఇదే కాంబినేషన్ రిపీట్ అయితే, 5 వేల కోట్లు ఈజీ టార్గెట్టే.. కాని ఇక్కడ సమస్య ఈ నెంబర్ ని ఎవరు ముందు రీచ్ అవుతారు? ఏదో హిట్ అవటం, 5 వేలకోట్లు రాబట్టడం కాదు... బాహుబలి రాగానే, బాలీవుడ్ బయపడినట్టే... మన సినిమా వస్తే హాలీవుడ్ వణకాలి.. ఆ సత్తా ఎవరికి ఉంది? వారనాసికే అంత సీన్ ఉందా; ఇంకెవరికైనా, అంత సీన్ ఉందనిపిస్తోందా?

వరల్డ్ సినిమా అంటే హాలీవుడ్డే.. ఏదో కొన్నేళ్లుగా కొరియన్ డ్రామా కొంతవరకు వరల్డ్ వైడ్ గా పాపులర్ అవుతోంది. కాని మరీ హాలీవుడ్ సినిమాలకు బ్రేక్ వేసే రేంజ్ కి మాత్రం కొరియన్ డ్రామాలు ఎదగలేదు.. చైనీస్ మార్షియల్ ఆర్ట్స్ కూడా బ్రూస్లీ, జాకీచైన్ జమానాలో వరల్డ్ మార్కెట్ ని కొంతవరకు షేక్ చేశాయి..అయినా హాలీవు్డ షేక్ కాలేదు... ఇక యూరోపియన్ మూవీస్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ యావరేజ్ పొజీషనే..సో ఎన్ని దశాబ్ధాలు మారినా వరల్డ్ సినిమా అంటే హాలీవుడ్డే.. అలాంటి హాలీవుడ్ ని మన సినిమా షేక్ చేస్తుందా? వారనాసి మూవీ 5 వేల కోట్లు రాబడితే, నిజంగా హాలీవుడ్ షేక్ అవుతుందా? అసలు పాన్ ఇండియా లెవల్లో బాహుబలి వస్తే, బాలీవుడ్ షేక్ అయ్యింది. బాలీవుడ్ పెత్తనం అంతా ఇప్పుడు ఆవిరైపోయింది. హిందీ హీరోలు ఆటలో అరటి పండులైపోతారని ఎప్పడైనా ఊహించామా?తెలుగు,కన్నడ సినిమా కలెక్షన్స్ ని దాటిన ధురందర్ లాంటి వార్త ఎప్పుడైనా ఊహించామా? అసలు సౌత్ హీరోల పేర్లు బాలీవుడ్ వాళ్లకి ఒకప్పడు తెలిసేది కాదు.. సౌత్ అంటే ఎన్నడూ లెక్కేలేదు. కాని బాహుబలి నుంచి మొన్నటి పుష్ప, కాంతారా 2 వరకు సౌత్ సినిమా ముందు బాలీవుడ్ బెండ్ అయ్యింది. సరే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటింగ్ డిపార్ట్ మెంట్ ని, డైరెక్టర్స్ లో క్వాలిటీని బాలీవుడ్ మిస్ చేసుకుందనుకుందాం..

కాని హాలీవుడ్ ఇప్పటికీ ఒకప్పటి రేంజ్ లో క్వాలిటీ సినిమాలే తీస్తోంది.. సో బాలీవుడ్ ని తెలుగు సినిమాలు బయపెట్టినట్టు, కన్నడ, మలయాల మూవీలు ఓటీటీని డామినేట్ చేసినట్టు, హాలీవుడ్ ని సౌత్ సినిమాలు షేక్ చేస్తాయా? ఈ ప్రశ్నకు మూడు సమాధానాలున్నాయి.. ఇది చాలా ఇంట్రస్టింగ్ జర్నీ... ఎందుకంటే వారణాసి వరల్డ్ సినిమా అన్నాడు రాజమౌళి.ఏకంగా 1400 కోట్ల బడ్జెట్ తో ఇండియన్ సినిమా అంటేనే అంతా షాక్ అయ్యారు. సో ఇదొచ్చి 5 వేల కోట్లు కొల్లగొడుతుందా? పది వేలకోట్ల రేంజ్ కి ఎదుగుతుందా చూడాలి.. ఇక 4 వేల కోట్లతో హిందీ రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అంటే ఒక్కో బాగం 2 వేల కోట్లంటే అందుకు డబుల్ కి మించి 5 వేలకోట్లు రాబడితే మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ సినిమా దూసుకెళ్లినట్టే..

ఇక ధురందర్ 2 భాగాలతో 2 వేల కోట్లపైనే రాబట్టిన ఆదిత్య ధర్, రణ్ వీర్ సింగ్, మళ్లీ కలిసి వచ్చే ఏడాది ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు. అంటే ఇది కూడా 5 వేల కోట్ల కలెక్షన్స్ రాబడుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తోంది. సో ఈమూడింట్లో రామాయణమే ముందొస్తోంది. ఈఏడాదే వస్తోంది.. సో ఇది హాలీవుడ్ ని షేక్ చేస్తుందా. వచ్చే ఏడాది ఏప్రిల్ లో వచ్చే వారణాసి వసూళ్లతో వాయిస్తుందా? లేదంటే ధురందర్ కాంబినేషనే ఆ బాధ్యత తీసుకుంటుందా? అన్నీది రెండే ళ్లలో తేలబోతోంది. డెఫినెట్ గా ఈ ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఇండియన్ సినిమా హాలీవుడ్ ని షేక్ చేస్తుందా లేదా అన్నది, ఈ మూడు సినిమాలతో తేలే ఛాన్స్ఉంది. సరే హాలీవుడ్ నిజంగా షేక్ కాలదంటే అదేం పెద్ద మ్యాటర్ కాదు.. కాని హాలీవుడ్డే భయపడే రేంజ్ లో ఒక్క టంటే ఒక్క ఇండియన్ సినిమా వసూల్ల వరద తెచ్చినా... అదో హిస్టారికల్ మూవ్ మెంట్... దాన్నే మనం విట్నెస్ చేయబోతున్నామా? వన్ ఆర్ టూ ఇయర్స్ లో తేలబోతోంది.

Published : 
  • 30 April 2026, 6:15 PM IST