హలో HOLLYWOOD.. నక్కి నక్కీకాదు తొక్కుకుంటా…!

హాలీవుడ్ నుంచి రిపోర్టర్లు వచ్చి వారణాసి టీం ని ఇంటర్వూచేయటం, పెద్దగా పేలట్లేదు.. అడిగినా అప్ డేట్స్ ఇవ్వని రాజమౌళి, అడక్కుండానే అప్ డేట్లు కాదు, అన్నీ తేల్చేస్తున్నాడు..

Post Published By: dialnews
Updated : 16 February 2026, 2:33 PM IST

హాలీవుడ్ నుంచి రిపోర్టర్లు వచ్చి వారణాసి టీం ని ఇంటర్వూచేయటం, పెద్దగా పేలట్లేదు.. అడిగినా అప్ డేట్స్ ఇవ్వని రాజమౌళి, అడక్కుండానే అప్ డేట్లు కాదు, అన్నీ తేల్చేస్తున్నాడు.. ఈ సినిమా చూడ్డానికి సైంటిఫిక్ ఫిక్షన్ లా కనిపించినా, సైఫై కానే కాదు.. ఇదో ఫాంటసీ మైథలాజికల్ డ్రామా అని తేల్చాడు.. వారణాసి జోనర్ విషయంలో బాంబ్ పేల్చాడు.. ఇంతకంటే షాకింగ్ న్యూస్, హాలీవుడ్ కొలాబరేషన్.. కేవలం ఒక ఏజెన్సీని నమ్ముకుంటే కాని పని అనుకున్నాడేమో కాని, హాలీవుడ్ లో చాలా పెద్ద సంస్థలతో కొలాబరేట్ అవుతున్నాడు. వారణాసిని హాలీవుడ్ లోనే కాదు, వరల్డ్ వైడ్ గా ఓరేంజ్ లోరిలీజ్ చేయాలంటే, కేవలం మీడియా మీట్లు కాదు... హాలీవుడ్ తో జట్లు కట్టడమే సరైన నిర్ణయం అని తెలుసుకున్నట్టున్నాడు.. మహేశ్ బాబు ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చే నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకి ఏంటా నిర్ణయం? హాలీవుడ్ కొలాబరేషన్ అంటే ఏంటి? దీంతో వారణాసికి ఎంతగా కలిసొస్తుంది?

హాలీవుడ్ రేంజ్ లో మన సినిమా వారణాసిని రిలీజ్ చేయటం గొప్పకాదు.. హాలీవుడ్ మార్కెట్ ని కుమ్మేయటమే ఇక్కడ హిస్టరీ.. అదే జరుగుతుందా? 120 దేశాల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా 55 వేల థియేటర్స్ లో వారణాసి రావటం ఫిక్స్ అయ్యింది. 30భాషల్లో 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేస్తే దేశ విదేశాల్లోని జనం మన సినిమాఎందుకుచూడాలి...వాళ్లెందుకు థియేటర్స్ ముందు మన మూవీ కోసం క్యూ కడతారు...? ఇది సరైన ప్రశ్నే.. బాహుబలి మొదటి భాగం వచ్చినప్పుడు కూడా నార్త్ ఇండియన్స్ ఆ సినిమా కోసం థియేటర్స్ ముందు క్యూ కట్టలేదు.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అలా జరిగింది. కాని బాహుబలి 2 వచ్చినప్పుడు మాత్రం, తెలుగు రాష్ట్రాలే కాదు, హిందీ, తమిల్, కన్నడ ఇలా అన్ని భాషల్లో ఈ సినిమా కోసం జనాలు థియేటర్స్ ముందు క్యూ కట్టారు

ఎందుకంటే, బాహుబలి మొదటి భాగం జనాల్లోకి అంతగా చొచ్చుకెళ్లింది. కాబట్టే బాహుబలి 2 అనగానే, రాజమౌళి సినిమా కోసం అంతా ఎదురు చూశారు.. అలాంటి క్యూరియాసిటీ, వరల్డ్ ఆడియన్స్ లో కనిపించాలంటే, వారనాసి రిలీజై, భారీ హిట్ టాక్ వస్తే, అప్పుడు అమెరికన్లు, ఆఫ్రికన్లు, యూరోపియన్లు ఇలా అంతా మన సినిమాకోసం థియేటర్స్ వైపు క్యూ కడతారు.అలా జరగాలన్నా వారణాసి బాగుంటే మాత్రమే సరిపోదు.. బాహుబలిని నార్త్ లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తూనే ప్రమోట్ చేసినట్టు, హాలీవుడ్ లో కూడా అలాంటి సపోర్ట్ దొరకాలి... అందుకోసమే హాలీవుడ్ బ్యానర్లతో వారణాసి టీం కొలాబరేట్ అవుతోంది. డ్రీమ్ వర్క్స్, సోనీ, కొలంబియా పిక్ఛర్స్ తో కలిసి ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు రాజమౌళి.

మొన్నటి వరకు హాలీవుడ్ లో ఫేమస్ ఏజెన్సీలు, పీఆర్ టీం సపోర్ట్ చాలనుకున్నాడు. కాని వరుసగా అమెరికన్ రిపోర్టర్లకు వారణాసి టీం ఇస్తున్న ఇంటర్వూలు పేలట్లేదు. వాటిని ఇండియాలోని ఇండియన్స్ లేదంటే, ఫారెన్ లోని ఇండియన్సే చూస్తున్నారు.. కామెంట్లు పెడుతున్నారు. అంటే వరల్డ్ ఆడియన్స్ కి ఈ ఇంటర్వూలు చేరట్లేదు. అందుకే ఇలా ప్రమోషన్ ని మాత్రమే నమ్ముకుంటే కష్టమని, హాలీవుడ్ సంస్తలతో కొలాబరేట్ అయ్యి, డిస్ట్రిబ్యూషన్ ని కూడా పంచుకుంటేనే ఫేట్ మారుతుందని ఫిక్స్ అయ్యాడు రాజమౌలి. ఇది నిజంగా సాలిడ్ డిసీజన్.. అందుకే వారణాసి వరల్డ్ సినిమాగా మారటం కేవలం లాంచనమే.. అందులోనూ ఇది సైఫై మూవీ కాదు.. ఫాంటజీ ఫ్లేవర్ లో వస్తున్న ఇండియన్ మైథాలజీ... సో వరల్డ్ సినిమా లవర్స్ ఎన్నడూ చూడని ఇండియన్ కంటెంట్ ని, హాలీవుడ్ స్కేల్లో తీయటమే కాదు, హాలీవుడ్ సంస్థల కొలాబరేషన్ తో రిలీజ్ చేయటం అంటే, రీచ్ పెరుగుతుంది. రికార్డు బద్దలయ్యే టైం వస్తున్నట్టుంది.

Published : 
  • 16 February 2026, 2:33 PM IST