బాబులకే బాబు… గ్లోబల్ సునామీ Loading…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కి సునామీటైం దగ్గరపడినట్టుంది. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డ్రాగన్ మాసీవ్ సర్ ప్రైజ్ కిక్ ఇచ్చింది. ఇప్పుడు గ్లోబల్ సూపర్ స్టార్ వంతొచ్చినట్టుంది.

Post Published By: dialnews
Updated : 25 May 2026, 7:15 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కి సునామీటైం దగ్గరపడినట్టుంది. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డ్రాగన్ మాసీవ్ సర్ ప్రైజ్ కిక్ ఇచ్చింది. ఇప్పుడు గ్లోబల్ సూపర్ స్టార్ వంతొచ్చినట్టుంది. వారణాసి టీం 5 నిమిషాల టీజర్ తో బాంబు పేల్చబోతోంది. అలాని యాజ్ ఇట్ ఈజ్ డ్రాగన్ రూట్లోనే వారణాసి టీజర్ ని ప్లాన్ చేస్తున్నట్టు లేరు.. ఇందులో కూడా రాజమౌళి ప్రత్యేకత కనిపించబోతోంది. ఇది టీజర్ గా వస్తుందా? ఒరిజినల్ గ్లింప్స్ పేరుతో వస్తోందా అన్నది ఇంకా తేలలేదు. కాని తెరవెనక పెద్ద వంటకమే రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సగం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, సగం మరో వీడియో తో కలిపి వారణాసి ప్రోమో రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకి ఆగస్ట్ లో టీజర్, దసరాకు ట్రైలర్ అనుకున్నాక, ఎందుకు రాజమౌళి జూన్ లో ఏదో అప్ డేట్ ఇవ్వాలనకుంటన్నాడు? మూవీ కంటెంట్ ఇప్పుడే రివీల్ చేయాలనుకోని తను, 5 నిమిషాల ప్రోమోతో కంటెంట్ రివీల్ కాకుండా ఎలా కంట్రోల్ చేస్తాడు?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాతో రాజమౌళి తీస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. కాని ఆతర్వాత 3 నెలలకు వచ్చే డ్రాగన్ గ్లింప్స్ ముందే రిలీజ్ చేశారు... విచిత్రం ఏంటంటే,వారణాసి తర్వాత రిలీజ్ అయ్యే మూవీ గ్లింప్సే ఇంత పెద్ద స్థాయిలో, ప్రశాంత్ నీల్ రిలీజ్ చేస్తే... వచ్చేఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే వారణాసి గ్లింప్స్ ఇంకెంత ముందు రిలీజ్ అవ్వాలి...ఇది కామన్ గా వస్తున్న డౌట్... కాని నిజానికి వారణాసి గ్లింప్స్ ఎప్పుడో పేలింది... అలాంటప్పుడు ఈప్రశ్నకి అర్ధం లేదు..ఐతే ఆ గ్లింప్స్ ని పూర్తి స్థాయి గ్లింప్స్ గా ఎవరూ కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఇమేజెస్ తో చేసిన వీడియో అది ఉండటమే... సినిమాలోని అసలు విజువల్స్ తో ఎలాంటి ప్రోమోని వారణాసి టీం వదల్లేదు. కాబట్టే అసలు సిసలు గ్లింప్స్ లేదంటే, టీజర్ ని ఎప్పుడు రివీల్ చేస్తారా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు.

అందుకే వారణాసి టీం డ్రాగన్ ని మించేలా నాలుగున్నర కాదు, ఐదు నిమిషాల టీజర్ నే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో అవతార్ 4 మూవీ మొదలవుతుండటంటో, ఆ సెట్లో వారణాసి టీం సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో డ్రాగన్ గ్లింప్స్ పాన్ ఇండియానే ఊగిపోయేలా చేసింది. కాబట్టి కౌంటర్ గా వారణాసి టీం ఏదోచేయాలని కాదు.. కాని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా వారణాసి టీం కూడా ఏదో ఒక భారీ విజువల్ వండర్ వదిలితే తప్ప, ఫ్యాన్స్ ఆకలి తీరదు.మార్కెట్ లో బజ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లదు. అందుకే వారణాసి టీం ఆగస్ట్ లో ఏం చేయాలి, అప్పుడేం రిలీజ్ చేస్తుంది.. లాంటి అంశాలు పక్కన పెడితే, జూన్ లోనే 5 నిమిషాల లెంథీ డ్యూరేషన్ లో సాలిడ్ టీజర్ లాంచ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడింది వారణాసి టీం. ఇందులో సీక్రసీ ఏం లేదు... ఇది కూడా ఫిల్మ్ టీమే మీడియాకు, ఫీలర్స్ రూపంలో ఉప్పందిస్తోందని తెలుస్తోంది.

ఐతే ఈవిషయంలో కొంత డ్రాగన్ స్ట్రాటజీ, మరికొంత రాజమౌళి తన సొంత స్ట్రాటజీని వాడబోతున్నాడు. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్.. ఈసినిమాను ఆల్రెడీ రాజమౌళి టీం ఏఐలో పూర్తిగా తీసేసింది... అంటే ఆర్టిషీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో, వారణాసి మూవీ షూటింగ్ ఎప్పుడో అయిపోయినట్టు లెక్క.. ఆ పైనల్ ఔట్ పుట్ ఆధారంగానే, రియల్ సెట్లో వారణాసిని మరింత బెటర్ వేలో తీసేందుకు ఆ ఏఐ ఉపయోగ పడుతోందట.కాబట్టి ఆ ఏఐ వీడియోనే కొంత టీజర్ రూపంలో వదిలితే ఎలా ఉంటుంది? ఆ ఏఐ వీడియో ఆధారంగా ఎలా రియల్ మూవీ తెరకెక్కోతందన్న మేకింగ్ వీడియో ని కూడా టీజర్ లోచూపిస్తే ఇంకెలా ఉంటుంది.. ఇది వారణాసి టీం 5 నిమిషాల టీజర్ వీడయో ప్లాన్... రెండు నిమిషల ఏఐ ఫుటేజ్, 3 నిమిషాల వారణాసి మేకింగ్ కలిపి 5 నిమిషాల టీజర్ వదిలతే, ఆ ఇంపాక్ట్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. అలానే వారనాణిసలో ఏకంగా 3 యుగాలు, అందులో పాత్రలు ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేయకుండా, డ్రాగన్ స్టైలల్లో ముందే ఆ పాత్రలని పరిచయం చేయొచ్చనే ఆలోచన కూడా రాజమౌళి పరిశీలిస్తున్నాడట. ఏదున్నా జూన్ 1 కి స్పెషల్ ఎనౌన్స్ మెంట్ వస్తే, పక్కగా 5 నిమిషాల టీజర్ ని వచ్చేనెల్లో ఊహించొచ్చు.. ఐతే ఇలా ఈ టీజర్ వదిలారని, ఆగస్ట్ లో రిలీజ్ చేసే ఒరిజినల్ టీజర్ ని లైట్ తీసుకుంటానుకోలేం. అది వేరు, ఇది వేరని తెలుస్తోంది. అలానే ప్రచారం జరుగుతోంది.

Published : 
  • 25 May 2026, 7:15 PM IST