నాన్-స్టాప్ నాటు కొట్టుడు…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోంది అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Post Published By: dialnews
Updated : 29 May 2026, 5:16 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోంది అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. వారణాసిగా అలరించే బోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.‌ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా, శరవేగంగా దూసుకుపోతోంది. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి ఒక అదిరిపోయే లేటెస్ట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. మేకర్స్ ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా ఈ లాంగ్ యాక్షన్ షెడ్యూల్‌లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు ఒక నెల రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా, నాన్-స్టాప్ గా ఈ యాక్షన్ షూట్ జరగబోతోందని సమాచారం.

దీనిబట్టి చూస్తే, ఈ ఒక నెల మొత్తం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉండబోతున్నారని స్పష్టమవుతోంది. రాజమౌళి మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో మనకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ సినిమాలో మహేష్ బాబును మునుపెన్నడూ చూడని రేంజ్‌లో, ఒక సరికొత్త యాక్షన్ అవతారంలో చూపించడానికి జక్కన్న సర్వం సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటేనే విజువల్స్ పరంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. 'వారణాసి' సినిమా కోసం కేవలం భారీ సెట్టింగ్స్ మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ స్టూడియోలను కూడా రంగంలోకి దించారు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు, రియల్ లొకేషన్స్‌లో కూడా ఈ చిత్ర షూటింగ్‌ను సమాంతరంగా జరుపుకుంటున్నారు.

సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తూనే, ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. కేఎల్ నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్-వరల్డ్ లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు డేట్ కూడా లాక్ అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ సమ్మర్ కానుకగా రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Published : 
  • 29 May 2026, 5:16 PM IST