IMAXలో టీజర్.. సూపర్ గూస్ బంప్స్…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి సినిమా పూర్తిగా ఐమ్యాక్స్ లో తెరకెక్కుతుందని మాత్రమే తెలుసు.. కాని ఇది నిజంగా ఐమ్యాక్స్ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో, రిలీజ్ అయ్యే వరకు ఎవరి ఊహికి అందదు .

Post Published By: dialnews
Updated : 30 May 2026, 6:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి సినిమా పూర్తిగా ఐమ్యాక్స్ లో తెరకెక్కుతుందని మాత్రమే తెలుసు.. కాని ఇది నిజంగా ఐమ్యాక్స్ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో, రిలీజ్ అయ్యే వరకు ఎవరి ఊహికి అందదు. కాని, అంత కష్టం అవసరంలేదంటున్నాడు రాజమౌళి. వారణాసి రిలీజ్ వరకు అంతా వేయిట్ చేయాల్సిన పనిలేదంటున్నాడు. కారణం వారణాసి టీజర్ ఇప్పుడు ఐమ్యాక్స్ స్క్రీన్ మీద కనిపించబోతోంది. ఐమ్యాక్స్ కెమెరాతో పూర్తిగా తెరకెక్కిన మొట్ట మొదటి ఇండియన్ మూవీగా, వారణాసి చరిత్ర స్రుష్టించబోతోంది. ఆల్రెడీ వారణాసి కాన్సెప్ట్ గ్లింప్స్ ని భారీ ఈవెంట్ తో మనందరికి ఐమ్యాక్స్ బొమ్మని చూపించాడు రాజమౌళి. అలాంటిది ఈ సారి వారణాసి ఒరిజినల్ ఫుటేజ్ తో, టీజర్ ని అది కూడా ఐమ్యాక్స్ వర్షన్ లో, ఐమ్యాక్స్ స్క్రీన్ మీద చూపిస్తే... మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఇంతకి ఎప్పుడు? ఎక్కడ వారణాసి టీజర్ ఐమ్యాక్స్ లెవల్లో పేలబోతోంది?

ఐమ్యాక్స్ లో సినిమా అంటే, హాలీవుడ్ సినిమాలే తప్ప... మన ఇండియన్ మూవీస్ కి అంత సీన్ లేదు. ఎంత సేపు ఐమ్యాక్స్ బిగ్ స్క్రీన్ లో మన సినిమాలను, వేసి చూసుకోవటం తప్ప,కనీసం ఐమ్యాక్స్ వర్షన్ లోకి మన మూవీలను కన్వర్ట్ చేసినా, ప్రింట్ కి కనీసం కోటి నుంచి పదికోట్ల వరకు ఖర్చు రావొచ్చు... అది సినిమాలో కంటెంట్, దానికి చేసే కలర్ గ్రేడింగ్ ఇలా చాలా అంశాలను బట్టి రేటు ఉంటుంది..అయినా కూడా ఇంతవరకు ఎవరూ ఇండియన్ సినిమాను, ఐమ్యాక్స్ వర్షన్ లోకే కన్వర్ట్ చేయలేదు. ఉన్న తక్కువ స్క్రీన్స్ లో పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందన్న గ్యారెంటీ లేకే ఈ సాహసం చేయలేదు. అలాంటిది ఏకంగా ఐమ్యాక్స్ కెమెరాతో పూర్తిగా వారణాసి మూవీ తీస్తున్నాడు రాజమౌలి. అసలు ఐమ్యాక్స్ కెమెరా అన్నది, ఒక చిన్న లారి సైడు ఎక్విప్ మెంటుతో సమానం. కాబట్టే దాంతో సినిమాతీయటం హాలీవుడ్ కి కూడా చాలా కష్టం.

అందుకే భారీ ఫైట్లు, ఇంపార్టెంట్ సీన్లు మాత్రమే ఐమ్యాక్స్ కెమెరాతో తీసి, మిగతా భాగాన్ని ఐమ్యాక్స్ వర్షన్ లోకి కన్వర్ట్ చేయిస్తారు. కాని వారణాసి విషయంలో పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాతోనే తీస్తున్నారు. కాబట్టి ఇది అలా తెరకెక్కిన ఫస్ట్ ఇండియన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. అలానే అంటార్కిటికి మంచు ఖండంలో తెరకెకకిన ప్రపంచ ఐదో సినిమాగా, మొదటి ఇండియన్ మూవీగా కూడా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది.ఏడు వింతలున్న ప్రాంతాలు, అక్కడ హీరో చేసే సాహసాలు, వారనాసి లొకేషన్లు, మంచు ఖండాలు.. రాముడు, శివుడి కోణంలో భారీ ఫైట్ సీన్లు.. ఇలా ఇన్ని వింతలున్న మూవీ టీజర్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే, గూస్ బంప్స్ వస్తాయి.. అలాంటి కంటెంట్ ని పూర్తిగా ఐమ్యాక్స్ స్క్రీన్ మీద చూస్తే ఇంకెలా ఉంటుంది. అదే ఆగస్ట్ లో జరగబోతోంది.

అవతార్ 4 షూటిగ్ ఆగస్ట్ లో మొదలు కాబోతోంది. ఆ సెట్లో రాజమౌలి, మహేవ్ బాబు, ప్రియాంక చోప్రా అవతార్ 4 టీం తో కలిసి వారణాసి వీడియోని లాంచ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఆగస్ట్ 15న యూఎస్ లోని ఐమ్యాక్స్ థియేటర్స్ లోనే వారణాసి టీజర్ ని బిగ్ స్క్రీన్ మీద లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఇలా లాంచ్ అయిన తర్వాత, ప్రతీ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్స్ లో ఈ టీజర్ ని టెలికాస్ట్ చేసేలా ఐమ్యాక్స్ తో ఒప్పద్దం కుదిరిందని తెలుస్తోంది. అదే నిజమైతే, వారణాసి ఐమ్యాక్స్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో, చూసేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వేయిట్ చేయాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఆగస్ట్ 15 తర్వాత ప్రతీ ఒక్కరికీ ఈ అవకాశం దొరుకుతుంది.

Published : 
  • 30 May 2026, 6:50 PM IST