రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా గురించి మరో భారీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషల్లో విడుదల కానుందో తెలుసుకుంటే నిజంగానే షాక్ అవుతారు.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, 'వారణాసి' చిత్రాన్ని తెలుగు ఒరిజినల్ వెర్షన్‌తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్‌తో పాటు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, అరబిక్, కొరియన్, జపనీస్, చైనీస్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మొత్తం 25కి పైగా భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్లు పలు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది నిజమైతే, భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక భాషల్లో విడుదలైన సినిమాల్లో 'వారణాసి' ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. రాజమౌళి గత చిత్రాలు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందడంతో, ఈసారి మరింత పెద్ద స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు... ఈ చిత్రాన్ని IMAX ఫార్మాట్లో కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. భారీ విజువల్స్, టైమ్ ట్రావెల్ అంశాలు, భారతీయ పురాణాల నేపథ్యం ఈ సినిమాను గ్లోబల్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసేలా ఉండబోతున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.