టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ "విరోష్" ఎట్టకేలకు ఒకటవుతున్నారు. గత 8 ఏళ్లుగా వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు.ఫిబ్రవరి 22న సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లిని "The Wedding of VIROSH" అని నామకరణం చేస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 26, 2026న వివాహం మరియు మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ లో సినీ జనాలకు రిసెప్షన్ ఉండబోతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందానల పెళ్ళి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో జరగనుంది. సెలబ్రిటీల ఫేవరెట్ డెస్టినేషన్ అయిన ఈ రాజ ప్రాసాదాల నగరంలో వీరి వివాహం జరుగుతోంది.
ఉదయ్‌పూర్ శివార్లలోని అత్యంత విలాసవంతమైన "Mementos by ITC Hotels, Ekaaya" ఈ వేడుకకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది ఆరావళి పర్వత శ్రేణుల మధ్య అద్భుతమైన వ్యూతో ఉంటుంది. ఇక్కడ ఒక్కో విల్లా ధర ఒక రాత్రికి సుమారు 35,500 నుండి ప్రారంభమవుతుంది. అత్యంత ఖరీదైన లగ్జరీ సూట్స్ ధర రాత్రికి 71,500 నుండి 1,00,000 వరకు ఉంటుంది. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఏరియా మరియు పర్వతాల వ్యూ ఈ రూమ్స్ సొంతం. పెళ్లి కోసం ఈ రిసార్ట్ మొత్తాన్ని విజయ్, రష్మికలు బుక్ చేసినట్లు సమాచారం, దీని ఖర్చు కోట్లలో ఉంటుందని అంచనా.
పెళ్లి వేడుకలో ప్రైవసీ కోసం 3-టైర్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అతిథుల ఫోన్లకు కూడా అనుమతి లేదని టాక్. సౌత్ ఇండియన్ మరియు రాజస్థానీ పద్ధతుల్లో ఈ వివాహం జరగనుంది. ఒక ప్రముఖ ఓటిటి సంస్థ వీరి పెళ్లి స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి, కానీ విజయ్ దానిని సున్నితంగా తిరస్కరించారట. వీరిద్దరి ఉమ్మడి ఆస్తి విలువ దాదాపు 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.. కావున పెళ్ళికి సంబంధించిన ఖర్చులో తగ్గేదేలే అంటున్నారు ఈ యువజంట. గీత గోవిందం నుండి మొదలైన వీరి ప్రయాణం నిజ జీవితంలో ఒక్కటి కావాలని సినీ అభిమానులందరూ "విరోష్" కి విష్ చేస్తున్నారు.