UNDER”COVER యోగి… ఫస్ట్ టైం కిరాక్…!

సూపర్ స్టార్ మహేశ్ బాబుని అండర్ కవర్ పోలీస్ గా చూశాం.. ఒక్కసారి తను అండర్ కవర్ పోలీస్ పాత్ర వేస్తే, పాన్ ఇండియానే షేక్ చేసింది పోకిరి.. అంటే అన్ని భాషల్లో ఇది రిలీజ్ కాలేదు. కాని అన్ని భాషల్లో రీమేక్ అయ్యింది.

Post Published By: dialnews
Updated : 13 April 2026, 8:00 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుని అండర్ కవర్ పోలీస్ గా చూశాం.. ఒక్కసారి తను అండర్ కవర్ పోలీస్ పాత్ర వేస్తే, పాన్ ఇండియానే షేక్ చేసింది పోకిరి.. అంటే అన్ని భాషల్లో ఇది రిలీజ్ కాలేదు. కాని అన్ని భాషల్లో రీమేక్ అయ్యింది. తమిళ్ లో పొక్కిరిగా, హిందీలో వాంటెడ్ గా ఇలా చాలా భాషల్లో పోకిరి మైండ్ బ్లాంక్ చేసింది. కట్ చేస్తే చాలా కాలం తర్వాత మళ్లీ సూపర్ స్టార్ మహేశ్ బాబు అండర్ కవర్ లో కనిపించబోతున్నాడు. అంటే పోకిరీ సీక్వెలా? లేదంటే వారణాసి తర్వాత చేయబోయే మూవీ అండర్ కవర్ కాప్ గా రాబోతోందా? లాంటి డౌట్లే అక్కర్లేదు.. వారనాసిలోనే పోకిరి ఫార్ములా వాడుతున్నారు. ఇంతవరకు మనం అండర్ కవర్ పోలీసులని చూశాం, అండర్ కవర్ డాన్లను చూశాం.. కాని ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అండర్ కవర్ యోగీని చూడబోతున్నాం... అంటే యోగి వేషంలో పోలీసులు అండర్ కవర్ లో ఉంటాడా? అక్కడే ట్విస్ట్ ఉంది... యోగి వేషంలో పోలీసే అండర్ కవర్ లో ఉండటం కాదు, అంతకుమించే ట్విస్ట్ తో రాజమౌళి పెద్దగానే ఏదో ప్లాన్ చేశాడు.. ఇంతకి ఈ అండర్ కవర్ యోగీ ఫార్ములా ఏంటి?

పోకిరిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు అండర్ కవర్ పోలీస్... ఆవిషయం తన ఫాదర్ నాజర్ చనిపోయిన సీన్ లో రివీల్ అవుతుంది. అప్పుడు థియేటర్స్ లో రోమాలు నిక్కబొడుచుకుంటే, బాక్సాఫీస్ లో వసూళ్ల వరదలొచ్చాయి. కట్ చేస్తే ఇదే మూవీ తమిల్ లో హిందీలో ఇలా చాలా భాషల్లో రీమేకైంది. అంతటా బ్లాక్ బస్టర్ గా మారింది.కట్ చేస్తే ఇప్పుడు అదే అండర్ కవర్ ఫార్ములాని వారణాసిలో వెరైటీగా వాడుతున్నాడట రాజమౌళి. వారణాసిలో యోగి వేషంలో అండర్ కవర్ లో ఉండే రా ఏజెంట్ గా మహేశ్ బాబు పాత్ర ఉంటుందని, కొత్త లీకు కిక్ ఇస్తోంది. అలాని పూర్తిగా పోకిరి ఫార్ములానా అంటే కానే కాదు.. ఎందుకంటే, ఇందులో పునర్జన్మల కాన్సెప్ట్ వాడుతున్నారు.

అంటే హీరో ఇందులో చాలా సార్లు పుట్టి, చనిపోతూ, మళ్లీ జన్మిస్తాడు.. అది ఎన్ని సార్లనేది తెలియదు. కాబట్టే, ఇందులో తనకి మూడు పాత్రలు, మూడు ముఖాలు, 11 అవతారాలు అనంటున్నారు. అంటే, రుద్రుడు, శివుడు, రాముడిగా కనిపించే మహేశ్ బాబు, మూడు పాత్రలతో పాటు 11 గెటప్స్ లో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు కూడాదేవుడుచేత ఎంచుకోబడిన వ్యక్తులంటారు కదా, అంచ్చంగా అలా కాశీ నగరపు నాగ శక్తి ఎంచుకున్న యుగ పురుషుడిగా మహేశ్ బాబు కనిపిస్తాడట. కొంతవరకు ఖలేజా లో దేవుడి పాత్ర ఇన్ ఫ్లూయెన్స్, పోకిరిలో అండర్ కవర్ పోలీస్ లా, అండర్ కవర్ యోగీ కాన్సెప్ట్ ఇందులో ఉండేలా ఉంది. సినిమా రిలీజ్ అయితే తప్ప, ఈ పాయింట్స్ ని రాజమౌళి ఎలా వాడాడో తేల్చుకోలేం.

కాని డెఫినెట్ గా ఈ పాయింట్స్ తోనే హీరోయిజం ని డిజైన్ చేసినట్టు ప్రచారం పెరిగింది. వారనాసి మీద ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ పుకారు నిజమే అయ్యింది. కాబట్టే అండర్ కవర్ యోగి కాన్సెప్ట్ గూస్ బంప్స్ తెప్పించేంత నిజమౌతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే, కమల్ హాసన్ కూడా తన కెరీర్ లో పది అవతారాలతో దశావతారమే చూపించాడు. అంటే పది గెటప్స్ లో కనిపించాడు. సూపర్ స్టార్ మహేశ్ మాత్రం పదకొండో గెటప్ తో లెక్కే మార్చేలా ఉన్నాడు. వారనాసిలో ఇలా కంటెంట్ అంటే సర్ ప్రైజులతో, నిండిపోయేలా ఉంది. మెల్లి మెల్లిగా ఫిల్మ్ టీమే ఇలా ఫీలర్స్ రూపంలో లీకులిస్తూ ప్రమోషన్ కూడా పెంచేస్తుందనే మాట వినిపిస్తోంది.

Published : 
  • 13 April 2026, 8:00 PM IST