మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏ అడుగేసినా పెద్దగానే ఉండాలి.. కలిసొచ్చే కాలాన్ని, పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ మీద గ్రిప్ ని సొంతం చేసుకోవాలంటే, పెద్ద పెద్ద అడుగులే వేయాలి. అందుకే తనలోని యానిమల్ ని ముందే నిద్రలేపుతున్నాడు. అందుకోసం అనిల్ కపూర్ ఆల్రెడీ రంగంలోకి దిగాడు. డ్రాగన్ తర్వాత దేవర, ఆవేంటనే త్రివిక్రమ్ సినిమా అన్నారు. ఆతర్వాతే మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సందీప్ రెడ్డి వంగ మూవీ ఉండొచ్చాన్నారు. అదేది జరక్క ముందే, ఎన్టీఆర్ ని యానిమల్ గా మార్చేస్తున్నాడు కేజీఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. గతంలో ఎన్నడూ జరగంది, ఎవరూ ఊహించంది డ్రాగన్ లో జరగబోతోందా? అనిల్ కపూర్ మాటలకు అర్ధమేంటి?
డ్రాగన్ టీం చాలా పెద్ద అడుగులే వేస్తున్నట్టుంది. డ్రాగన్ టీజర్ ని ఇంతవరకు రిలీజ్ చేయలేదు. కనీసం గ్లింప్స్ రాలేదు. కాని అప్ డేట్లు ఫోటోల రూపంలో, స్టార్ కాస్ట్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రయోగాల ఇన్ ఫర్ మేషన్ రూపంలో మాత్రం వస్తోంది. యానిమల్ లో హీరో తండ్రిగా కనిపించిన అనిల్ కపూర్ డ్రాగన్ లో చాలా పెద్ద పాత్రే వేస్తున్నాడని తేలింది.ముంబైలో అనిల్ కపూర్ తో ప్రశాంత్ నీల్ కనిపించిన పీక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. డ్రాగన్ లో ఎన్టీఆర్ తండ్రంటూ మొదట్లో ప్రచారం జరిగినా, తర్వాత తను వేసేది విలన్ రోల్ అని కన్ఫామ్ అయ్యింది. ఇక డ్రాగన్ లో మొత్తం 18 మంది విలన్స్ ఉంటారని తెలుస్తోంది. అయితే ఆ 18 మందిలో ఒక్క అనిల్ కపూర్ మాత్రమే ఇండియన్ యాక్టర్.
మరి మిగతా నటులు ఎవరు? ఇదే చాల పెద్ద ప్రశ్న... బేసిగ్గా పాన్ ఇండియా మూవీ అంటే, ఒక్కో భాష నుంచి ఒక్కో నటుడిని తీసుకోవాలని బాహుబలి ఫార్ములాతో తేలింది. కట్టప్పని కోలీవుడ్ నుంచి సుదీప్ ని శాండిల్ వుడ్ నుంచి ఇలా ఒక్కో మార్కెట్ కోసం ఒక్కొక్కరినీ తీసుకున్నారు. తర్వాత వచ్చిన పాన్ ఇండియా మూవీలన్నీ ఇదే ఫార్ములాని పాటించాయి.ఇప్పుడు డ్రాగన్ ని పాన్ ఆసియా మూవీగా మార్చేందుకు, తర్వాత పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రీచ్ పెంచేందుకు విలన్ల రూపంలో బాహుబలి ఫార్ములా వాడేస్తున్నట్టున్నారు. అందుకే బాలీవుడ్ మార్కెట్ కోసం అనిల్ కపూర్ ని, శాండిల్ వుడ్ నుంచి కోలీవుడ్ వరకు నాన్ తెలుగు మార్కెట్ కోసం హీరోయిన్ రుక్మినీ వసంత్ ని తీసుకున్నారు..ఇంతవరకు బానే ఉంది. కాని విలన్లలో అనిల్ కపూర్ ఒక్కడే ఇండియన్ అయితే, 18 మంది విలన్స్ లో మిగతా 17 మంది ఎవరనే ప్రశ్నే తలెత్తుతోంది.
ఇందులో 11 మంది వియత్నం, ఇండోనేషియా, మలేషియా ,సింగాపూర్, థాయ్ లాండ్ నటులు ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా 6 గురిలో ఇద్దరు ఆఫ్రికన్లు, నలుగురు యూరోపియన్లు కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, ఇది పాన్ ఆసియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లెవల్లోనే రిలీజ్ కాబోతున్న మూవీగా కన్పామ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ప్రయారిటీ మాత్రం పాన్ ఆసియా మార్కెట్ కోసమే అన్నట్టు అక్కడి మార్కెట్ తాలూకు నటులకే ఎక్కువ మందిని తీసుకున్నారు.ఒక విలన్ ఉంటేనే హీరో విలనైపోతాడు.. అలాంటిది ఇద్దరు ముగ్గురు విలన్లు ఉంటే అదే హీరో యానిమలైపోతాడు.. సో ఇక్కడ 18 మంది విలన్లంటే, డ్రాగన్ మూవీలో ఎంత యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఇంకెంత హై వోల్టేజ్ రివేంజ్ డ్రామా ఉంటుంది. మొత్తంగా అందరి అంచనాలను మించేలా పెద్ద అడుగే వేస్తోంది డ్రాగన్ టీం.