రాజమౌళి సినిమా అంటేనే అంచనాలకు అందదు. ఊహలకు దొరకదు.. ఎప్పుడూ విజువల్స్ పరంగా
లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్ని, అంతకు మించిన గ్రాండియర్ తో తీస్తాడు. ఇప్పుడు వారణాసిని అంతకు మించేలా తీస్తున్నాడు. జస్ట్ ఒకే ఒక్క ఫ్రేమ్ కి 50 లక్షలు ఖర్చు చేస్తున్నారంటే నమ్ముతారా... సెకనికి 24 ఫ్రేములు లెక్కేసినా... 12 కోట్లు ఖర్చు చేసినట్టు.. కేవలం కల్లు మూసి తెరిచే లోపు 12 కోట్లు ఆవిరైనట్టే... అలా 25 నిమిషాల ఫుటేజ్ కి 250 కోట్లు ఖర్చు చేయటం ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఎంత పాన్ వరల్డ్ మార్కెట్ ని కుదిపేయాలనుకున్నా, ఇలా డబ్బుని నీల్లలా ఖర్చు చేస్తే, మిగతా సినిమాల ప్రొడ్యూసర్స్ కి కంగారు పెరుగుతోంది. అంతా రాజమౌళిని చూసి, ఆరేంజ్ లో తీస్తాం, సినిమాకు ఖర్చుచేయమంటున్నారట. ఇంతకి పొరుగింటి ప్రొడ్యూసర్లనే భయపెట్టేలా ఫ్రేమ్ కే 50 లక్షలు ఎందుకు ఖర్చు చేసినట్టు.. రెప్పపాటు సీన్ కి 12 కోట్లు పెట్టి ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు.
వారణాసి మూవీ టోటల్ బడ్జెట్ 1400 కోట్లు... హిందీ రామాయణం మొదటి భాగం బడ్జెట్ 2 వేల కోట్లు.. రాజమౌలి మూవీ బడ్జెట్ అఫీషియల్. కాని, రామాయణం బడ్జెట్ ఒక భాగానికా రెండు భాగాల మొత్తం బడ్జెట్ అదా అన్నది తేలాల్సి ఉంది. బాహుబలి 2 తో 1850 కోట్లు, దంగల్ మూవీకి 2000 కోట్లొచ్చాయి కాబట్టి, అదే రేంజ్ లో ఇప్పుడు బడ్జెట్ నెంబర్స్ చూస్తుంటే ఆశ్చర్యపోయేవాళ్ల సంఖ్య తగ్గుతోంది.ఐతే అలాంటి వాళ్లని కూడా షాక్ కి గురి చేస్తున్నాడు రాజమౌళి. సెకనికి 12 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. 25 నిమిషాలతో ఒక ఎపిసోడ్ చేస్తే 250 కోట్లు ఆల్రెడీ ఖర్చయ్యాయి. అలాంటి మరో ఎపిసోడ్ కి అచ్చంగా అంతే ఎమౌంట్ 250 కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. అది కాకుండా మరో సీక్వెన్స్ కి కేవలం సెకనుకే 12 కోట్లు ఖర్చు పెడుతున్నారట.
ఇక్కడ సెకనంటే 24 ఫ్రేములు.. ఒక్కో ఫ్రేమ్ కి 50 లక్షలు..అంటే ఒక్కో ఫ్రేమ్ ఒక్కో పేయింట్ లాంటిదనుకోవాలా? లేదంటే కేవలం ఒక ఫ్రేం గ్రాఫిక్స్ కమ్ డిఐ కి అంత ఖర్చా... అంటే వరల్డ్ మార్కెట్ లో ఎంటరవ్వాలంటే గట్టిగానే ఖర్చు చేయాలి. ఆ స్టాండర్ట్స్ ని రీచ్ అవ్వాలంటే, ఆమాత్రం ఖర్చు చేయాలి. అందుకే ఇప్పుడు సెకనుకి 24 ఫ్రేములు, ఫ్రేముకి 50 లక్షలు, అలా కల్లు మూసి తెరిచేలోగా 12 కోట్లు హాం ఫట్..ఆల్రెడీ ఐమ్యాక్స్ కెమెరాతో షూట్ చేయటం వల్ల, షూటింగ్ రీల్ కే కోట్లు ఖర్చవుతోందట. 90 కోట్లు కేవటం షూటింగ్ రీల్ కోసమే లెక్కేసినట్టు తెలుస్తోంది. ఇక రామ, రావణ యుద్దం సీన్ 25 నిమిషాలకు 250 కోట్ల నుంచి 300 కోట్లు ఖర్చు చేసిన టీం, మరో యాక్షన్ సీక్వెన్స్ కోసం 250 కోట్లు ఖర్చు చేస్తోంది. అది కూడా పాతిక నిమిషాల నిడివితో రాబోతోంది.
సో ప్రపంచ వింతలు, భారీ సాహసాలు, డైనోసార్ సీన్లు, టైం ట్రావెల్ లాంటి భారీ విజువల్స్ కోసం, నెక్ట్స్ లెవల్లో వర్క్ చేయాల్సిందే.. అందుకే మరింత గ్రాండ్ గా విజువల్స్ ఉండేలా, గ్రాఫిక్స్ విషయంలో, డీఐ విషయంలో భారీగానే పని జరుగుతోంది. ఒక్కో ఫ్రేమ్ ని కళా ఖండంలా తీర్చి దిద్దటం కోసం, కనీసం 18 మంది పనిచేస్తున్నారని తెలుస్తోంది.ఒక్కో ఫ్రేమ్ కి 18 మంది, అలానే ఒక యూనిట్ కంప్యూటర్ సెటప్, రోజుకి 12 గంటల చొప్పున కష్టపడటంతో, సెకనుకి 12 కోట్ల ఖర్చొచ్చిందని తెలుస్తోంది. అంతా చేస్తే 15 నిమిషాల ఫుటేజే రెడీ అయ్యిందట. ఇంకా 18 నిమిషాల ఫుటేజ్ బ్యాలెన్స్ అనితెలుస్తోంది. ఈ లెక్కన ఈమూవీ బడ్జెట్ 1400 కోట్ల నుంచి 2 వేల కోట్లకు రీచ్ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు.