పాన్ ఇండియా మొనగాల్లంటే, ముందు పాన్ ఇండియా కింగ్ ప్రభాసే గుర్తుకొస్తాడు.. వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గుర్తుకురావాల్సిందే...బాహుబలి, పుష్పరాజ్ వల్లే వీళ్లకా రేంజ్, ఇమేజ్ దక్కింది. త్రిబుల్ ఆర్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫేటే మారిపోయింది. కాకపోతే దేవర హిట్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవ్లో గట్టెక్కినా, చరణ్ మాత్రం ఇంకా తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలోనే బిజీ అయ్యాడు. ఎలా చూసినా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తమని తాము ప్రూవ్ చేసుకుందంటే, రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ముగ్గురు మొనగాళ్ల తర్వాత ప్లేస్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉంటాడా? లేదంటే పాన్ వరల్డ్ లెవల్లో తానే నెం.1 అంటాడా? ఒకవేల వారణాసి హిట్టైతే ఏంటి పరిస్థి? రాజమౌళిమూవీ హిట్టవ్వాల్సిందే కాబట్టి, హిట్టైతుంది... మరి అప్పుడు సూపర్ స్టార్ పరిస్తితేంటి? తను ఏ కేటగిరీకి పరిమితమౌతాడు? ఎవువైపు అడుగులేస్తాడు?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా వచ్చిన గుర్తింపుని, దేవర హిట్ తో సుస్తిరం చేసుకున్నాడు. నార్త్ లో తన మార్కెట్ పెరిగిందని తెలిశాక, ప్రతీ అడుగు ఆచితూచి వేస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ తర్వాత ప్లేస్ లో ఉన్నాడు. తనకి పుష్ప రెండు భాగాలో భారీ బ్లాక్ బస్టర్లు రావొచ్చు. కాని రెండు వేరు వేరు సినిమాకాకపోవటంతో, తను కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ ఫేస్ చేసిన సిచ్చు వేషన్ నే ఫేస్ చేస్తున్నాడు..ఇక రెబల్ స్టార్ ప్రభాస్ వరకొస్తే, బాహుబలి తర్వాత కాస్త ఇబ్బంది పడ్డా, సలార్, కల్కీ, సాహో హిట్లో పాన్ ఇండియా లెవల్లో ఐదు బ్లాక్ బస్టర్లున్న ఒకే ఒక్క స్టార్ గా పాన్ ఇండియా కింగ్ అయిపోయాడు. ఎలాచూసినా, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఓరకంగా కనీసం రెండు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న ముగ్గురు మొనగాళ్లు.. ఆతర్వాత ప్లేస్ ఎవరిది...
ఇక్కడే సూపర్ స్టార్ పేరు డైలామాలో పడుతోంది. ఎందుకంటే ఇంతవరకు తను పాన్ ఇండియా మూవీ చేయలేదు. ఇప్పుడు తను చేస్తున్న వారణాసి కూడా పాన్ ఇండియా మూవీ కాదు.. అది పాన్ వరల్డ్ సినిమా... సో వరల్డ్ ప్లాట్ ఫాంలో వారణాసి హిట్టైతే, ఇండియా తరపున తనే ఫస్ట్ పాన్ వరల్డ్ స్టార్ గా నిలుస్తాడు. నిజంగానే గ్లోబల్ ప్లాట్ ఫంలో తానే నెంబర్ వన్ అని, ఇండియా తరపున ప్రూవ్ చేసుకుంటాడు..కాని అక్కడే పాన్ ఇండియాలో తన స్థానం ఏంటనేదే తేలటం కష్టంగా మారుతోంది. రాజమౌళి మూవీ కాబట్టి వారనాసి డెఫినెట్ గా వరల్డ్ వైడ్ గా వండర్ చేస్తుంది... మహేశ్ పేరు గ్లోబల్ గా మారుమోగుతుంది. అందులో డౌట్ లేదు. కాని ఆతర్వాతేంటి? సందీప్ రెడ్డి వంగ , సుకుమార్ తో తను చేయబోయేవి పాన్ ఇండియా సినిమాలా? గ్లోబల్ మూవీలా?
వాటిలో ఏవి పట్టాలెక్కుతాయి? ఏవి పాన్ ఇండియా, లేదంటే గ్లోబల్ మార్కెట్ నిలో ఏ మార్కెట్ ని రీచ్ అవుతాయనే దాన్ని బట్టే తన ఫ్యూచర్ మార్కెట్ ఏంటో తేలుతుంది. అందుకే పాన్ ఇండియా ముగ్గురు మొనగాళ్లని మహేశ్ మించుతాడా? వాళ్లతో కలిసి నాలుగో మొనగాడిగా మారతాడా అన్నది వచ్చే ఏడాది ఏప్రిల్ లో తేలబోతుంది. త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా గుర్తింపు వచ్చాక తడబడ్డ రామ్ చరణ్ పరిస్థితి రాకూడదంటే, వారనాసి తర్వాత వరుసగా సాలిడ్ ప్రాజెక్టులే ప్లాన్ చేయాలి.. కాకపోతే, అంతా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేసేందుకే సరైన స్క్రిప్ట్, సరైన దర్శకులు దొరకట్లేదు.. మరి వారణాసి తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు పరిస్తఇతేంటనే ప్రశ్నకి ఈ ఆగస్ట్ లో జవాబు దొరకొచ్చు... వారణాసి టీజర్ తో పాటు వచ్చే మహేశ్ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే కొంత క్లారిటీ రావొచ్చు.