సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌లో మెగాస్టార్.. ప్రభాస్ తండ్రిగా చిరంజీవి.. అసలు నిజమెంత..?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ సినిమాపై రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2026 | 09:29 AMLast Updated on: Jan 27, 2026 | 9:29 AM

Megastar In Sandeep Reddy Vangas Style Chiranjeevi As Prabhass Father How Much Of This Is Actually True

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ సినిమాపై రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఓ రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని..! అది కూడా సెకండాఫ్‌లో ప్రభాస్ తండ్రి పాత్రలో చిరు ఎంట్రీ ఇస్తాడని.. కథను మలుపు తిప్పే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన కనిపిస్తాడని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం చిరంజీవి, ప్రభాస్ కాంబినేషన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు సాగే సన్నివేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు భారీ మాస్ హీరోలు కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. అదీకాక సందీప్ వంగా లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు వీళ్లిద్దరినీ ఎలా చూపిస్తాడో అని ఊహించుకుంటూనే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

అయితే ఈ వార్త వినడానికి బాగున్నా.. ఆచరణలో ఎంతవరకు సాధ్యం అనేదే అసలు ప్రశ్న. వాస్తవానికి గతంలోనే సందీప్ రెడ్డి వంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. స్పిరిట్ సినిమాలో చిరంజీవి ఉన్నారా అని అడిగినప్పుడు.. అలాంటిదేం లేదు, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని ఆయన తేల్చి చెప్పాడు. అయినా సరే ఈ రూమర్స్ మళ్లీ మళ్లీ తెరపైకి రావడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని లేదంటే ఇంతగా ఎందుకు ట్రెండ్ అవుతుందనేది అభిమానుల ప్రశ్న. దర్శకుడు స్వయంగా ఖండించిన తర్వాత కూడా ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టడం ఆశ్చర్యంగానే ఉంది. మరోవైపు చిరంజీవి ట్రాక్ రికార్డ్ చూస్తే.. ఆయన ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వాల్తేరు వీరయ్య లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన క్రేజ్ వేరే లెవల్‌లో ఉంది. మన శంకరవరప్రసాద్ గారు మాస్ జాతర చూశాక, ఆయన వేరే హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకుంటాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

సోలో హీరోగా వందల కోట్లు కొల్లగొడుతున్న మెగాస్టార్.. కేవలం 15 నిమిషాల పాత్ర కోసం, అది కూడా తండ్రి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనుకోవడం అత్యాశే అవుతుంది. చివరగా ఒకవేళ నిజంగానే సందీప్ మ్యాజిక్ చేసి చిరుని ఒప్పించినా.. మెగా అభిమానులు దీనికి ఒప్పుకుంటారా అనేది సందేహమే. తమ హీరోని ఫుల్ లెంగ్త్ రోల్‌లో చూడాలనుకుంటారు తప్ప, ఇలా అతిథి పాత్రల్లో చూడటానికి ఇష్టపడరు. చిరంజీవి కూడా ఇదే చెప్తున్నాడు. తను మరో సినిమాలో అతిథి పాత్ర చేస్తే ఒప్పుకునే పరిస్థితుల్లో అభిమానులు లేరనేది చిరుకు బాగా తెలుసు. అందుకే రిటైర్ అయినా.. హీరోగానే కానీ గెస్ట్ రోల్స్‌లో కాదు అని నమ్ముతున్నారు మెగా ఫ్యాన్స్. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తను కేవలం ఇంటర్నెట్ రూమర్‌గానే చూడాలి. ఏదేమైనా స్పిరిట్ సినిమా అప్‌డేట్స్ కోసం మాత్రం అటు రెబల్ ఫ్యాన్స్, ఇటు మూవీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.