“దేవుడు మరణించాడు… సైతాను పుట్టింది!” — ఈ ఒక్క డైలాగ్‌తోనే లూగర్ సంభవం ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమైపోయింది. అదిరిపోయే నటనతో, పిచ్చెక్కించే అభినయంతో ఎన్టీఆర్ కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్. ఆ నరాలు బయటికి చొచ్చుకొస్తున్నట్లుగా చూపించిన ప్రెజెన్స్ చూస్తే “మాస్ అంటే మళ్లీ ఎన్టీఆర్‌నే” అని నీల్ మరోసారి ప్రూవ్ చేశాడు.మొదటిగా… దర్శకుడు ప్రశాంత్ నీల్ గారి గట్సీ డైరెక్షన్ టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! గత సినిమాలు KGF, Salaarల్లో హీరో ఎస్టాబ్లిష్‌మెంట్ ఎక్కువగా కనిపించేది. కానీ ఈ గ్లింప్స్‌లో మాత్రం కథనే హైలైట్ చేశాడు. స్వాతంత్ర్యానికి ముందున్న టైమ్‌లైన్‌లో “లూగర్” అనే వ్యక్తి ఎవరు? అతను ప్రజల కోసం ఏమి చేశాడు?
దేవుడు చనిపోతే డెవిల్‌గా వచ్చినది నిజంగా ఎన్టీఆర్ నేనా? లేక డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడా? అనే ఎన్నో అనుమానాలకు ఈ గ్లింప్స్ తెరలేపింది.“నేను చంపబోయే శత్రువులే నా కలల్లోకి వస్తారు… చంపేసిన వాళ్లు కాదు. దయచేసి నా కలల్లోకి రావద్దు…” అంటూ గంభీరంగా కనిపించిన అతని రూపం, మాటలు వింటుంటేనే భయపెట్టే ఆ వాక్‌చాతుర్యం ఈ గ్లింప్స్‌కు అతిపెద్ద హైలైట్‌గా నిలిచింది.ఏ విషయాన్నీ ఎక్కడా పూర్తిగా రివీల్ చేయకుండా, తాను ఊహించిన ప్రపంచాన్ని ఎలా చూపించాలనుకున్నాడో అచ్చంగా అలాగే డెలివర్ చేశాడు నీల్.
ఇలాంటి కంటెంట్‌తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లడమే కాదు… రూల్ చేస్తోంది అనిపించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆ చివరి షాట్‌లో “డ్రాగన్” టైటిల్ పడిన తర్వాత మొత్తం డార్క్‌నెస్‌లో ఫ్రేమ్ సెట్ చేసి… ఆ క్షణంలో ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్, ఆయన తీసుకున్న ఆ ఒక్క బ్రీత్ — అక్కడే 100 మార్కులు కొట్టేశారు అని చెప్పొచ్చు. ప్రతి చిన్న డీటైలింగ్‌లోనూ నీల్ గారి కాన్సన్‌ట్రేషన్, తీసుకున్న జాగ్రత్తలు స్పష్టంగా కనిపించాయి. ఇవే ఈ సినిమాకు రాబోయే ప్రతి అప్డేట్ నుంచి సినిమా రిలీజ్ వరకు అన్నింటినీ బ్లాక్‌బస్టర్ చేసే అవకాశాలుగా మారుస్తున్నాయి.4 నిమిషాలు 25 సెకన్లు… మాటల్లో వర్ణించలేని విధ్వంసం ఇది.2027 జూన్ 6న ప్రేక్షకులు చూడబోయేది ఒక పెద్ద పండగ.