Prabhas : యంగ్ డైరెక్టర్ కి ప్రభాస్ ఫోన్.. కథ రెడీ చేసుకో…?

అగ్ర హీరోలతో సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులకు ఒక కల అనే మాట వాస్తవం. అగ్ర హీరోల కోసం కథలు సిద్దం చేసుకుని యువ దర్శకులు సిద్దంగా ఉంటారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 August 2024, 12:42 PM IST

 

 

అగ్ర హీరోలతో సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులకు ఒక కల అనే మాట వాస్తవం. అగ్ర హీరోల కోసం కథలు సిద్దం చేసుకుని యువ దర్శకులు సిద్దంగా ఉంటారు. ఒక్క సినిమా హిట్ అయింది అంటే చాలు ఇంకా వాళ్ళ లైఫ్ లో వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. చాలా మంది స్టార్ హీరోలు ఇప్పుడు యువ దర్శకులకు, భిన్నమైన కథలకు ఓకే చెప్పడం మనం చూస్తున్నాం. కథలు సరిగా దొరకక టాలీవుడ్ లో ఇబ్బందికర వాతావరణం ఉంది. దీనితో యువ దర్శకులు వాటి మీద దృష్టి పెడుతున్నారు.

అలాంటిది ఒక యువ దర్శకుడికి (Young Director) స్టార్ హీరో (Star Heroes) ఫోన్ చేసి కథ రెడీ చేసుకోమని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది టాలీవుడ్ లో. అసలు ఎవరు ఆ దర్శకుడు ఏంటి ఆ కథ అనేది చూద్దాం. టాలీవుడ్ (Tollywood) యంగ్ డైరెక్టర్స్ లో సుజిత్ (Sujith) ఒకరు. చిన్న వయసులోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసాడు. అయితే ఆ సినిమా అనుకున్న విధంగా హిట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఓజీ (OG) అనే సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే ఈ సినిమా ఇప్పుడు ముందుకు వెళ్ళడం లేదు. ఎప్పుడు పూర్తి అవుతుందో స్పష్టత లేదు.

ఇప్పుడు ఖాళీగా ఉంటున్న సుజిత్ కి ఊహించని ఆఫర్ వచ్చింది. సాహో (Saaho) సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి... ఇప్పుడు మరో కథ రెడీ చేసుకోవాలని... సినిమా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడట. ప్రస్తుతం ప్రభాస్ కల్కీ (Kalki) సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో వచ్చిన భారీ గ్యాప్ ని ఇప్పుడు కవర్ చేయడానికి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. మారుతీ సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా వచ్చింది. ఇలాంటి టైం లో సుజిత్ కి ఫోన్ చేసి ఆఫర్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. సుజిత్ దర్శకత్వ పని తీరు ప్రభాస్ కి బాగా నచ్చిందని అందుకే ఇప్పుడు మరోసారి చేయడానికి రెడీగా ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Published : 
  • 1 August 2024, 12:42 PM IST