Top story: RGV సంచలన పోస్ట్ సక్సెస్‌ఫుల్ మెన్ వెనుక భార్య ఉండదు..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ ఏం మాట్లాడినా సంచలనమే, ఎలాంటి పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. సమాజం చూసే కోణానికి భిన్నంగా ఆలోచించే ఆర్జీవీ.

Post Published By: dialnews
Updated : 29 August 2026, 6:55 PM IST

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ ఏం మాట్లాడినా సంచలనమే, ఎలాంటి పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. సమాజం చూసే కోణానికి భిన్నంగా ఆలోచించే ఆర్జీవీ.. తాజాగా పెళ్లి, సక్సెస్, మరియు పురుషుల జీవితాలపై ఒక మైండ్ బ్లోయింగ్ పోస్ట్ పెట్టారు. సాధారణంగా మనం 'ప్రతి సక్సెస్‌ఫుల్ మ్యాన్ వెనుక ఒక మహిళ లేదా భార్య ఉంటుంది' అని వింటూ ఉంటాం. కానీ ఆర్జీవీ మాత్రం దీన్ని పూర్తిగా రివర్స్ చేసేశారు. 'సక్సెస్‌ఫుల్ మెన్ వెనుక వైఫ్ లేడు' అంటూ ఆయన పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు ఆర్జీవీ అంత నమ్మకంగా ఎందుకు చెప్పారు? ఆయన ఇచ్చిన లిస్టులో ఎవరెవరు ఉన్నారు?

నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, సమాజంలోని మూఢనమ్మకాలపై తనదైన శైలిలో సెటైర్లు వేసే ఆర్జీవీ.. తాజాగా ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. లోకంలో ఒంటరిగా ఉంటూనే, చరిత్ర సృష్టించిన కొందరు గొప్ప వ్యక్తుల పేర్లను ఆయన ఉదాహరణగా తీసుకున్నారు. 'PM, CM, టాటా, బాటా, కలాం, సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ, యోగి ఆదిత్యనాథ్.. మరియు చివరికి బాబా రామ్‌దేవ్ కూడా సింగిలే' అంటూ ఒక పెద్ద లిస్టును బయటపెట్టారు. వీరంతా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూనే తమ రంగాల్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారని ఆర్జీవీ గుర్తుచేశారు.

ఈ ఉదాహరణలను చూపిస్తూ.. 'ప్రతి సక్సెస్‌ఫుల్ పురుషుడి వెనుక మహిళ ఉండదు' అని ఆర్జీవీ ఒక స్ట్రాంగ్ క్యాప్షన్ ఇచ్చారు." నిజానికి వివాహ బంధంపై ఆర్జీవీకి ఉన్న అభిప్రాయం అందరికీ తెలిసిందే. పెళ్లి అనేది ఒక జైలు లాంటిదని, స్వేచ్ఛను కోల్పోవడమేనని ఆయన చాలా ఇంటర్వ్యూలలో ఓపెన్‌గా చెప్పారు. ఆయన చూపించిన ఈ లిస్టులో రతన్ టాటా లాంటి పారిశ్రామికవేత్తలు, అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలు మరియు మాజీ రాష్ట్రపతులు, దేశాన్ని నడిపించే ప్రధానులు, ముఖ్యమంత్రులు ఉన్నారు.

వీరంతా సంసార జీవితానికి దూరంగా ఉండి, తమ పూర్తి సమయాన్ని దేశానికి లేదా తాము నమ్మిన రంగానికి కేటాయించడం వల్లే ఇంత పెద్ద సక్సెస్ సాధించారనేది ఆర్జీవీ వాదన. పెళ్లి చేసుకోకపోవడమే వీరి విజయానికి అసలు రహస్యం అన్నట్లుగా ఆర్జీవీ తన పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? కామెంట్ సెక్షన్‌లో మీమ్స్, కౌంటర్లతో రచ్చ లేపుతున్నారు. కొందరు నెటిజన్లు ఫన్నీగా.. 'బాసు, అంతా బాగానే ఉంది కానీ.. ఈ సక్సెస్‌ఫుల్ సింగిల్స్ లిస్టులో మీ పేరెక్కడ?' అని ఆర్జీవీని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.

'మీరు కూడా పెళ్లి చేసుకుని విడిపోయారు కదా.. మరి మీ లెక్క ప్రకారం మీరు సక్సెస్‌ఫుల్ మ్యాన్ కాదా?' అంటూ ఆర్జీవీ పైనే రివర్స్ పంచ్‌లు వేస్తున్నారు. ఇంకొందరు మాత్రం 'బాసు చెప్పింది అక్షరాల నిజం.. పెళ్లి చేసుకోకపోతే ల్యాప్‌టాప్‌లో స్పేస్ మిగిలినట్టు మైండ్‌లో బోలెడంత స్పేస్ మిగులుతుంది, అందుకే వాళ్లు సక్సెస్ అయ్యారు' అంటూ ఆర్జీవీకి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా, సమాజంలో ఉండే నమ్మకాలను బద్దలు కొడుతూ ఆర్జీవీ వేసే ఇటువంటి పోస్టులు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.

Published : 
  • 29 August 2026, 6:55 PM IST