యాంటీ ఫ్యాన్స్ కొత్త పదం ” PR”పబ్లిసిటి.. డ్రాగన్ మీద ఎటాక్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా వస్తోందంటే చాలు, ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నెగెటీవ్ టాక్ స్ప్రెడ్ చేసేవాల్లు.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి, రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇదే సమస్య ఎదురౌతూ వచ్చింది.

Post Published By: dialnews
Updated : 14 March 2026, 4:55 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా వస్తోందంటే చాలు, ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నెగెటీవ్ టాక్ స్ప్రెడ్ చేసేవాల్లు.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి, రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇదే సమస్య ఎదురౌతూ వచ్చింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైనా, తెలుగురాష్ట్రాల్లో యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ తగ్గలేదు.. నార్త్ లో బాలీవుడ్ లో కొన్న వర్గాలు వదిలేస్తే, కామన్ ఆడియన్స్ మాత్రం యాంటీగా మారలేదెప్పుడు.. కాకపోతే ఇప్పుడు ఇదే యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ పేరు మారిందా? పీఆర్ టీం అంటూ సినిమాను ప్రమోట్ చేయాల్సిన టీం, మరో హీరో మూవీ మీద బురద చల్లుతోందా.. అక్కడ కూడా చాలా మంది టార్గెట్ ఎన్టీఆరేనా..? కానీ ఈ సారి ఎన్టీఆర్ యాంటీ పీర్ ఆర్ మిసైల్ ని పేలుస్తున్నాడన్న మాట వినిపిస్తోంది.. అదే రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కి తెగ నచ్చాయా? ఇంతకి ఏంటా యాంటీ పీఆర్ మిసైల్..?

టాలీవుడ్ లో ఒకప్పుడు ఎన్టీఆర్ మూవీ వస్తోందంటే, ఫ్యాన్స్ కంటే యాంటీ ఫ్యాన్స్ కే ఎక్కువ పండగ... అంత ఘోరంగా తన సినిమా మీద నెగెటీవ్ పబ్లిసిటీకోసం వాళ్లంతా ఆకలితో వేయిట్ చేసేవాళ్లు.. అంతాగ యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ తో సఫర్ అవుతూనే ఎదిగిన స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్. తనతో పాటు ఇలాంటి యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ ని ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నచాలా మంది స్టార్స్ లో టాప్ ప్లేస్ రెబల్ స్టార్ ప్రభాస్ దే.. ఆతర్వాతసూపర్ స్టార్ మహేశ్ దే ఆ స్థానం..మొదట్నుంచి ఈ ముగ్గురు మొనగాళ్లు ఏం చేసినా, ఆఖరికి ఏం చేయకున్నా ఏదో ఒక నెగెటీవ్ పబ్లిసిటీ కామన్ గా కనిపించేది. ఇప్పుడు లెక్క మారింది. ఎన్టీఆర్ నే కాదు, ప్రభాస్ నుంచి, మహేశ్ వరకు ఎవరినీ యాంటీ ఫ్యాన్స్ టచ్ చేయట్లేదు.. చేసినా ఒకప్పటిలా అతి వీర భయంకరంగా ఎటాక్ కనిపించట్లేదు.. ఎందుకు? అంటే అంతా వీళ్లని లైట్ తీసుకున్నారా?

కాని కాదు.. తొండ ముందిరి ఊసరవెళ్లి అయినట్టు, ఈ యాంటీ ఫ్యాన్సే ఇప్పుడు పీఆర్ టీమ్స్ గామారిపోయాయా? ఒకవేల మారకున్నా మార్చేస్తున్నారా? ఔను బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఈ దిక్కుమాలిన ట్రెండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరిగేలా ఉంది. మీడియా మీట్ల నుంచి సోషల్ మీడియలో ట్రోలింగ్స్, మీమ్స్ ఆఖరికి హీరోల వీడియోల కింది ఫ్యాన్స్ రూపంలో, లేదంటే కామన్ ఆడియన్స్ రూపంలో కొందరు ఎటాక్స్ చేస్తున్నారు.ఇది చాలా సిస్టమాటిగ్ గా జరుగుతోంది కాబట్టే దీన్ని పీఆర్ టీం ఎటాక్స్ అంటున్నారు. మామూలుగా పీ ఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ కోసం పనిచేసే టీం. వాళ్లు హీరోల సినిమాలను ప్రచారం చేస్తారు. ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు అరేంజ్ చేస్తారు. ఓరకంగా ఈవెంట్ మేనేజింగ్ లా పనిచేస్తారు. కాని దానర్ధం ఇప్పుడు మారిపోయింది. మన హీరోని పొగడటం తగ్గినా పర్లేదు.. పొరుగుహీరో మీద బురద మాత్రం చల్లటం లో ఆలస్యం చేయకూడదు..

ఆహీరో సినిమా పోయిందనో, టీజర్ తుస్పమందనో, ఇంట్లో గొడవలు, సెట్లో అరుపులు ఇలా ఎప్పుడూ ఏదో ఒక నెగెటీవ్ గాసిప్ క్రియేట్ చేయటమే ఈ పీఆర్ టీంల పని... అందుకే ఎన్టీఆర్ డ్రాగన్ కథ రిపేర్లని, ప్రశాంత్ నీల్ ని తిట్టి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ అని, ఇలా అంతూ పొంతూ లేకుండా ఏది పడితే అది గాసిప్స్ రూపంలో బయటికి వదులుతున్నారు. ఇలాంటి దాడే మహేశ్, ప్రభాస్ మూవీ అప్ డేట్ మీద కూడా జరుగుతోంది. అందుకే ఎన్టీఆర్ కూడా తనకంటూ ఒక కౌంటర్ ఎటాక్ పీఆర్ టీంని పెట్టాడు.. ప్రభాస్, మహేశ్ కంటేముందే తను పెట్టిన ఈ టీం కౌంటర్ కి ఎన్ కౌంటర్ స్టార్ట్ చేసింది... ఎన్టీఆర్ మీద ఒక్క నెగెటీవ్ పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేసినా ఆ కామెంట్ ని, ఆమీమ్ ని ఎవరు చేసిన పనంటూ ప్రశ్నిస్తూనే, తోలుతీస్తా అన్న సంకేతాలు వెళ్లేలా, అవెక్కడి నుంచి వస్తున్నాయో తెలుసన్నట్టు సిగ్నల్స్ కూడా పంపిస్తున్నారు.. ఇదే ఇప్పుడు బాలీవుడ్ కూడా భలే ఉందని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న స్ట్రాటజీ... కేవలం పొలిటీషియన్స్ మాత్రమే కాదు, పబ్లిక్ లైఫ్ లో ఉన్న హీరోలకి కూడా తమని, తమ ఇమేజ్ ని కాపాడుకునేందుకు ఇలా సోషల్ మీడియా వారియర్స్ తో పని పడుతోంది.

Published : 
  • 14 March 2026, 4:55 PM IST