పంచ భూతాలు కలిసొచ్చాయి.. 6వ భూతం స్పిరిట్…!

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఐదంటే ఐదు గొప్ప మలుపులు తనని పాన్ ఇండియా కింగ్ గా మార్చాయి..ముందు యంగ్ రెబల్ స్టార్ గా వచ్చాడు. తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారాడు. వెంటనే పాన్ ఇండియా రెబల్ స్టార్ అయ్యాడు.

Post Published By: dialnews
Updated : 14 March 2026, 5:20 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ఫేట్ ని మార్చిన మూవీలంటే ఐదంటే ఐదే.. తన కెరీర్ లో ఎన్నో హిట్లున్నాయి.. చేసిన సినిమాల్లో 80శాతం హిట్లు సొంతం చేసుకున్న స్టార్ ప్రభాస్.. అంతేకాదు పాన్ ఇండియా లెవల్లో ఐదు హిట్లున్నాయి.. రెండు సార్లు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టని మొదటి హీరోగా తను, రెండో హీరోగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి రికార్డులు కూడా దక్కాయి. ఐతే హిట్లు కాకుండా ప్రభాస్ తలరాతనే మార్చిన మూవీల లిస్ట్ లో చూస్తే, ఒక ఐదు సినిమాలు తనకి పంచభూతాల్లా మారాయి.. తన రేంజ్ ని ఇమేజ్ ని మార్చేస్తూ వచ్చాయి.. అందులో తొలి బ్లాక్ బస్టర్ వర్షం, తర్వాత ఛత్రపతి, డార్లింగ్ తన దారిని మార్చాయి.. మిర్చీ మాస్ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తే, బాహుబలి పాన్ ఇండియా మైలేజ్ ని పెంచేసింది. ఇప్పుడ ఆరో భూతం వంతొచ్చిందా...? అంటే మళ్లీ ప్రభాస్ తలరాత మార్చే మూవీ...ఇంతకి ఏంటది..?

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఐదంటే ఐదు గొప్ప మలుపులు తనని పాన్ ఇండియా కింగ్ గా మార్చాయి..ముందు యంగ్ రెబల్ స్టార్ గా వచ్చాడు. తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారాడు. వెంటనే పాన్ ఇండియా రెబల్ స్టార్ అయ్యాడు. వరుసగా 5 పాన్ ఇండియా హిట్లతో ఆ ఆ కేటగిరీలో కింగ్ మారిపోయాడు.. ఐతే ఈ విషయంలో తనని ఐదంటే ఐదు మలుపులు కేవలం గెలుపులతో కాకుండా, తన తలరాతనే మార్చేశాయి..అందులో ఫస్ట్ వర్షం మూవీ... అప్పటి వరకు తనో యాంగ్రీ లవర్ బోయ్.. తర్వాతే వర్షం తో స్టారయ్యాడు. తన హైట్ కి తగ్గ వేయిట్ ఉన్నరోల్ లో పాతుకుపోయాడు. కట్ చేస్తే మల్లీ రాజమౌళి మేకింగ్ లో చత్రపతి వచ్చాకే తన ఫేట్ మారింది. స్టార్ కాస్త మాస్ స్టార్ గా మారిపోయాడు. వెంటనే పూరీ మేకింగ్ లో బుజ్జిగాడొచ్చింది. తన యాక్టింగ్ కెపాసిటీనే మార్చేసింది.

బిల్లాతో హిట్ పడింది.. ఏక్ నిరంజ్ కూడా కలిసొచ్చింది. కాని తనలోని కొత్త నటుడిని మాత్రం పరిచయం చేసింది మాత్రం డార్లింగ్ మూవీనే. దాంతోనే తనలోని కామెడీ టైమింగ్ బయటికొచ్చింది. కొత్త ప్రభాస్ ని మార్కెట్ కి పరిచం చేసింది. కట్ చేస్తే మిర్చీ మూవీ.. ఎక్కడో విన్న కథే.. ఎన్నడో చూసిన కథే.. ఇలా పరమ రొటీన్ గా అనిపించే కథని, నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లింది ప్రభాస్..తన కెరీర్ లోనే పూర్తిగా 100కు 99 శాతం, తన పెర్ఫామెన్స్, తన ఓరా, తన యాక్షన్ సీక్వెన్స్ తో నెక్ట్స్ లెవల్ కి వెళ్లింది మిర్చీ మూవీ. రెబల్ మూవీ లో అంతకంటే మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నా, ఈ స్థాయిలో హిట్టవ్వలేదా మూవీ. ఐతే ఇలాంటి సినిమాలతో కేవలం తెలుగులో రెబల్ స్టార్ ప్రబాస్, ఓ మాస్ స్టార్ గా మాత్రమే ఎదిగాడు.

తన స్థాయిని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఆ తర్వాత హాలీవుడ్ వెళ్తాడేమో అనేంతగా మార్చిన మూవీ బాహుబలి. ఒక ఇండియన్ సినిమా గురించి రష్యా, జపాన్, జర్మనీ మీడియాలో వార్తలు వచ్చేలా చేసింది ఈ సినిమా. అసలు ప్రభాస్ ఎవరు అని అహంకారంతో మాట్లాడినా బాలీవుడ్ స్టార్స్ అందరిని పక్కకునెట్టి, తానొక్కడే పాన్ ఇండియా కింగ్ అనిపించుకునేలా చేసింది బాహుబలి.అంతే ఖాన్లు, కపూర్లు కూడా సైలెంట్ గా పక్కకి వెళ్లిపోవాల్సిన పరిస్తితి వచ్చింది. ఆస్తాయికి బాహుబలి తనని తీసుకెళ్లింది. ఆతర్వాత సాహో వచ్చింది. సలార్ హిట్టైంది. కల్కీ కి 1200 కోట్ల వసూళ్ళ వరదొచ్చింది.

ఇవన్నీ తనకి బ్లాక్ బస్టర్లుగా మారాయి.. కాని నటుడిగా, స్టార్ గా తన నెక్ట్స్ లెవల్ ఏంటో అక్కడికి మాత్రం తీసుకెళ్ళలేకపోయాయి.సో వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిర్చీ, బాహుబలి.. ఇలా తనకెరీర్ లో పంచ భూతాల్లాంటీ ఈ సినిమాల తర్వాత ఆరవ భూతంగా స్పిరిట్ రాబోతోందా? నిజంగా ఇది రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మరో సరికొత్త మలుపుగా మారబోతోందా? అలాంటి అంచనాలే ఆకాశాన్నంటుతున్నాయి.. కొన్ని సార్లు గొప్ప మలుపులు చాలా గొప్ప కలెక్సన్స్ రాబట్టాలని లేదు. కాని ఇక్కడ కలెక్షన్స్ కూడా సునామీ క్రియేట్ చేస్తాయేమో అనిపించేంత సెన్సేషనల్ కాంబినేషన్ వీళ్లది... మరి అంచనాలే నిజమైతే, ఈ స్పిరిట్ సునామీని ఎ వరూ తట్టుకోలేరు.. అదే ఎంతవరకు నిజమౌతుందనేది వచ్చే ఏడాది బిగినింగ్ లోనే తేలటం కన్పామ్ అంటున్నారు.

Published : 
  • 14 March 2026, 5:20 PM IST