పీపుల్స్ స్టార్ గెలిచిన అవార్డు…!

తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'గద్దర్ అవార్డ్స్ - 2025' విజేతల జాబితాను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Post Published By: dialnews
Updated : 7 March 2026, 7:51 PM IST

తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'గద్దర్ అవార్డ్స్ - 2025' విజేతల జాబితాను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనిలో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి, ఆయన సినీ ప్రస్థానానికి గౌరవంగా అందుకోనున్నాడు.పైడి జయరాజ్ అవార్డును లోకనాయకుడు కమల్ హాసన్ అందుకోనుండగా,
సినారె అవార్డును ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ స్వీకరించబోతున్నాడు.

అక్కినేని నాగేశ్వరరావు అవార్డును సహజ నటి జయసుధ అందుకోనున్నారు. ఇతర ప్రముఖ పురస్కారాలకు సంబంధించి, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తీసుకోనండగా, రఘుపతి వెంకయ్య అవార్డును ప్రసాద్ లాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ గెలుచుకున్నారు. ఇక, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి, కాంతారావు అవార్డును కైవసం చేసుకున్నాడు. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు బి.ఎన్. రెడ్డి అవార్డు వరించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది సందర్భంగా ఘనంగా జరగనుంది.

Published : 
  • 7 March 2026, 7:51 PM IST