ఇదే ఫైనల్.. మాంత్రికుడికి వాతలు.. ఫైనల్ నెరేషన్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పగపడితే ఎలా ఉంటడి.. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. తనని మోసం చేసి, తనకోసం రాసి కథని ఎత్తుకెళ్లినా..? నమ్మించి మోసం చేసినా ఎన్టీఆర్ వదలడు...

Post Published By: dialnews
Updated : 5 February 2026, 6:02 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పగపడితే ఎలా ఉంటడి.. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. తనని మోసం చేసి, తనకోసం రాసి కథని ఎత్తుకెళ్లినా..? నమ్మించి మోసం చేసినా ఎన్టీఆర్ వదలడు... ఈ మెసేజే ఇచ్చేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇష్టపడుతున్నాడా? ఎందుకంటే ఇప్పటికే త్రివిక్రమ్ తో మూడు సార్లు పంచాయితీ అయిపోయిందన్నారు. మాటల మాంత్రికుడు చాలా సార్లు ఎన్టీఆర్ కి డైరెక్ట్ గా క్షమాపన కోరాడని కూడా ప్రచారం జరుగుతోంది. సో సమస్యలన్నీ తీరిపోయాయి.. అంతా కూల్ అనుకుంటుంటే, ఎన్టీఆర్ మాత్రం రగిలిపోతూనే ఉన్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఎదుగుతూ, వరల్డ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్న టైంలో, ఒక్క వెన్నపోటు కూడా తనని ఎక్కడో పడిపోయేలా చేసే ఛాన్స్ఉంది. ఇంత అనుభవం, ఇంత ఇమేజ్ ఉన్నా తనని ఒకరు ఈ స్థాయిలో మోసం చేయటం అంటే, అదే తీసుకోలేకపోతున్నాడా? అందుకే తనని మరెవరు మోసం చేయకుండా ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడా? గాడ్ ఆఫ్ వార్ మూవీ కథ విషయంలో మొదలైన వార్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడు?

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య ఎప్పటినుంచో గాడ్ ఆఫ్ వార్ పంచాయితీ నడుస్తోంది. తనతో అనుకున్న కథని, మంచి షేప్ వచ్చాక బన్నీకి షిఫ్ట్ అవటం ఎన్టీఆర్ తట్టుకోలేకపోయాడన్నారు. తన టీంతో పాటు, తన ఇన్ పుట్స్ తీసుకుని కథలో ఎన్నో మార్పులు చేశాక, ఇలా బన్నీతో ప్రాజెక్ట్ ప్లాన్ చేయటంతో, ఇదోరకంగా కబ్జా అంటూ ప్రచారం జరిగింది. కాకపోతే కథ మీద కాపీ రైట్స్ ఎన్టీఆర్ కే దక్కేలా కాంట్రాక్ట్ ఉన్నా, అది మరిచిపోయాడో, మరో కథతో సినిమాతీస్తున్నా మని ప్లేట్ మార్చాలనుకున్నాడో మొత్తానికి త్రివిక్రమ్ ధైర్యం చేసి, బన్నీ కాంపౌండ్ కి పార్టీ మార్చాడని కూడా ప్రచారం జరిగింది.

కట్ చేస్తే, కాపీరైట్స్ గట్టిగా ఉండటంతో, గాడ్ ఆఫ్ వార కథని బన్నీ కాంపౌండ్ కి తీసుకెళ్లటం కష్టమని తెలుసుకుని, త్రివిక్రమ్ కాల్లబేరానికి వచ్చినట్టు కూడా వార్తలొచ్చాయి. మిగతా నిర్మాతల మీడియేషన్ తో, కొద్ది వరకు ఎన్టీఆర్ కూల్ అయినా, తనకి జరిగిన నమ్మకద్రోహం విషయంలో మాత్రం మరిచిపోయేలా లేడు. ఇంకోసారి, మరో దర్శకుడు ఇలా తనకి చేయకుండా ఉండేందుకు, ఎగ్జాంపుల్ సెట్ చేసే పనిలో ఉన్నట్టున్నాడు.ఆల్రెడీ సంక్రాంతి తర్వాత జరిగిన పంచాయితీతో అంతా సద్దు మణిగిందనుకున్నారు. ఒకసారి కాదు, ఇప్పటికి మూడుసార్లు ఈ పంచాయితీ జరిగిందట. పర్సనల్ గా ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ సారి కూడా చెప్పాడన్నారు. మధ్యలో త్రివిక్రమ్ ని తీసేసి, అదే కథని మరో దర్శకుడితో తీయాలనే నిర్ణయానికి కూడా ఎన్టీఆర్ వచ్చినట్టు ఇంండస్ట్రీలో టాక్ పెరిగింది.

అదే జరిగితే, జీవితాంతం త్రివిక్రమ్ మీద దొంగగా, నమ్మక ద్రోహిగా ముద్రపడే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అందుకే ఒకటికి రెండు సార్లు ఎన్టీఆర్ కి కలిసి, క్షమించమని వేడుకున్నాడని కూడా వార్తలొచ్చాయి... సో ఇదంతా జరిగాక, ఇంకేముంది వెంకీ మూవీ ఆదర్శ కుటుంబం తర్వాత గాడ్ ఆఫ్ వార్ మొదలైతుందనే అన్నారు. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ అని కూడా ప్రచారం జరిగింది.కాని ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ ని నమ్మే ప్రసక్తే కనిపించట్లేదు.. సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు, సెట్లో తప్ప ఇంకెక్కడ త్రివిక్రమ్ కి పవర్స్ ఉండవు.. సెట్లో కూడా ఎన్టీఆర్ టీం మానిటరింగ్ చేస్తుందట. ఏ అప్ డేట్ వచ్చినా అది ఎన్టీఆర్ టీం నుంచే వస్తుంది కాని, దర్శకుడిగా త్రివిక్రమ్ ఈ సినిమా ఐపోయినంతవరకే కాదు, రిలీజయ్యే వరకు నోరు విప్పే స్వేచ్చ ఉండదని, ఇలా చాలా కండీషన్స్ తో తనకి ఛాన్స్ ఇస్తున్నట్టు ఇప్పుడు కొత్తగా మరో ప్రచారం విచారం వ్యక్త చేసేలా ఉంది. నిజంగా ఇది షాకింగ్ నిర్ణయమే...

Published : 
  • 5 February 2026, 6:02 PM IST