టాక్సిక్ కు లేని ధైర్యం ఉస్తాద్ కు..? దురంధర్ 2 తో బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ వెనుక రీజన్..?

పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా గా సినీ ఇండస్ట్రీలో వార్ నడుస్తోంది. అప్పట్లో దంగల్ వర్సెస్ బాహుబలి.. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు ఎక్కువగా పోటీ పడిన పరిస్థితి మనం చూసాం.

Post Published By: dialnews
Updated : 6 March 2026, 5:45 PM IST

పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా గా సినీ ఇండస్ట్రీలో వార్ నడుస్తోంది. అప్పట్లో దంగల్ వర్సెస్ బాహుబలి.. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు ఎక్కువగా పోటీ పడిన పరిస్థితి మనం చూసాం. ఇక ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే మళ్ళీ కనపడుతోంది. ఇక లేటెస్ట్ గా రెండు సినిమాల గురించి ఇండియా వైడ్ గా ఇంట్రస్టింగ్ డిస్కషన్ మొదలైన మాట వాస్తవం. ఒకటి కేజిఎఫ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ రెండు.. రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2.

ఈ రెండు సినిమాలు మార్చ్ 19న రిలీజ్ కు రెడీ అవుతున్న సమయంలో.. టాక్సిక్ మేకర్స్ ఓ షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా తమ సినిమాను వాయిదా వేస్తున్నామని, జూన్ 4న సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసారు. దీనితో టాక్సిక్ టీజర్, ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారనే చెప్పాలి. దీనిపై బాలీవుడ్ మీడియా మాత్రం డిఫరెంట్ గా తమ ఒపినియన్ షేర్ చేస్తూ.. టాక్సిక్ ను సీరియస్ గానే ట్రోల్ చేస్తోంది. దురంధర్ కు టాక్సిక్ టీం భయపడిందని కామెంట్స్ వస్తున్నాయి.

అయితే ఇప్పుడు దురంధర్ వర్సెస్ మరో సినిమాతో వార్ స్టార్ట్ అయింది. అదే.. దురంధర్ 2 వర్సెస్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఉస్తాద్ భగత్ సినిమా. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వార్ షురూ చేసాయి. రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 మార్చి 19న రిలీజ్ అవుతోంది. ఇప్పుడు, మార్చి 26న థియేటర్లలోకి రావాల్సిన పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలను ఒక వారం ముందుగానే రిలీజ్ అవుతోంది. టాక్సిక్ లేట్ అవ్వడంతో.. ఉస్తాద్ ముందుగానే రావడానికి డిసైడ్ అయ్యాడు.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గురువారం తమ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. కొత్త పోస్టర్ కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేస్న్ది. మా ఉస్తాద్ సినిమా వారం ముందుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వేడుకల కోసం రెడీ అవుతోందని.. మార్చి 19న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. దీనితో పవన్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. దీని వెనుక రీజన్ కూడా ఉంది. దురంధర్ 1 సక్సెస్ తో.. పార్ట్ 2 పై ఇంట్రస్ట్ పెరిగిన మాట వాస్తవం. తెలుగు ప్రేక్షకులు కూడా పార్ట్ 1 ను ఇష్టపడ్డారు.

పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ కూడా వస్తున్నాయి. దురంధర్ ఫస్ట్ పార్ట్ తెలుగులో రాలేదు. 2 మాత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు పవన్ సినిమా.. దురంధర్ పార్ట్ 2 తో పోటీ పడితే.. సినిమాకు కాస్త నెగటివ్ టాక్ వస్తే పరిస్థితి ఏంటీ అంటూ.. భయం మొదలైంది. ఇక థియేటర్ ల విషయంలో కూడా దురంధర్ డామినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. మరి దీనిని ఉస్తాద్ ఎలా తట్టుకుంటాడో చూడాలి.

Published : 
  • 6 March 2026, 5:45 PM IST