మొట్టమొదటి ప్రీమియర్ షో…!

పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే వార్తతో మీ ముందుకు వచ్చేశాం. హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబో అంటేనే ఒక సెన్సేషన్. 'గబ్బర్ సింగ్' తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది.

Post Published By: dialnews
Updated : 9 March 2026, 12:50 PM IST

హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబో అంటేనే ఒక సెన్సేషన్. 'గబ్బర్ సింగ్' తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. సినిమా రిలీజ్ డేట్ మారడమే కాదు, ప్రీమియర్ షోల టైమింగ్స్ కూడా రివీల్ అయ్యాయి. నిజానికి ఈ సినిమా మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. కానీ యష్ 'టాక్సిక్' సినిమా వాయిదా పడటంతో, మన ఉస్తాద్ ఒక వారం ముందే బాక్సాఫీస్ వద్దకు వచ్చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19, 2026 ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

ఈ ఉగాదికి ఉస్తాద్ మోత" అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక, ఓవర్సీస్ ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పాలి. ఇక, అమెరికాలో మార్చి 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మార్చి 18వ తేదీ రాత్రి 9 గంటలకు లేదా 10 గంటల కి స్పెషల్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి మేజర్ సెంటర్లలో అర్థరాత్రి నుండే ఫ్యాన్స్ షోలు షురూ కానున్నాయి. భారీ బడ్జెట్ సినిమా కావడంతో, తెలంగాణ ప్రభుత్వం నుండి స్పెషల్ పర్మిషన్స్‌తో టికెట్ రేట్ల పెంపు మరియు అర్ధరాత్రి షోలకు అనుమతి వచ్చే అవకాశం ఉంది.

రీసెంట్‌గా విడుదలైన 'ట్రైలర్ టీజ్' సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు!" అనే డైలాగ్ ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తోంది. ఈ సినిమాకి మరో స్పెషల్ ఏంటంటే.. దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందిస్తుంటే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం మ్యూజిక్ సెన్సేషన్ థమన్ రంగంలోకి దిగారు. ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తుండటంతో థియేటర్లలో సౌండ్ అదిరిపోవడం ఖాయం. మార్చి 18 రాత్రి నుండే ఉస్తాద్ జాతర మొదలవబోతోంది. పవన్ కళ్యాణ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, శ్రీలీల మరియు రాశీ ఖన్నా హీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమా రికార్డులన్నీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Published : 
  • 9 March 2026, 12:50 PM IST