Nagababu : మెగా ఫ్యామిలీలో కల్లోలం.. బన్నీపై నాగబాబు ఘాటు ట్వీట్

మొదటినుంచి అల్లు ఫ్యామిలీకి (Allu family) మెగా ఫ్యామిలీకి మద్య బేధాలు ఉన్నాయి అని సోషల్ మీడియాలో చర్చలు సాగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో నాగబాబు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 May 2024, 4:55 PM IST

మొదటినుంచి అల్లు ఫ్యామిలీకి (Allu family) మెగా ఫ్యామిలీకి మద్య బేధాలు ఉన్నాయి అని సోషల్ మీడియాలో చర్చలు సాగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో నాగబాబు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చారు. మెగా ఫ్యామిలీలో (Mega Family) ఎవరిని ఏమన్నా ముందుగా రియాక్ట్ అయ్యేది నాగబాబు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగబాబు అల్లు అర్జున్ (Allu Arjun) మీద కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్నటితో ముగిసింది. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరపున పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోటీచేశారు. పవన్‌కి మద్దతుగా రామ్ చరణ్ ప్రచారానికి వెళ్లారు. చంద్రబాబు (Chandrababu) ఓ వీడియో చేసి షేర్ చేశారు. అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేసి సరిపెట్టారు. కానీ తన స్నేహితుడైన అభ్యర్థి కోసం అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లారు. తన స్నేహితుడిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనసైనికులతో మరికొందరు అల్లుఅర్జున్‌పై విమర్శలు చేశారు. కానీ అల్లుఅర్జున్ మాత్రం స్నేహితుడికి మాట ఇచ్చాను. అందుకే సపోర్ట్‌కి వెళ్లానని చెప్పాడు.

ఇదిలా ఉండగా ఎన్నికలు పూర్తికాగానే నాగబాబు ఓ ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయిన పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైన మావాడే అని నాగబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అల్లుఅర్జున్ పేరు పెట్టకుండా తనని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి నాగబాబు ఈ ట్విట్ ఎవర్ని ఉద్దేశించి చేశారో స్పందిస్తేనే తెలుస్తుంది.గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది అన్న విషయం సినీ వర్గాలలో చర్చనీయాంశమైన విషయమే. ఇక ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు మరోమారు రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ను స్పష్టంగా చెబుతున్నాయి.

Published : 
  • 14 May 2024, 4:55 PM IST