Top story:ట్రంప్ ను ఫుట్ బాల్ ఆడుతున్న అమెరికన్ మీడియా… ఇన్ డైరెక్ట్ గా ఇరాన్ కు స్ట్రాంగ్ సపోర్ట్… నీ బ్లాకేడ్ తీసి మడిచి పెట్టుకో… ట్రంప్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఉతికి ఆరేస్తున్న జర్నలిస్ట్ లు…!

యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగేది కాదు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అసలైన యుద్ధం తన దేశ మీడియా నుండే ఎదురవుతోంది. ఇరాన్‌ను 'మ్యాప్' నుండి తుడిచేస్తానన్న ట్రంప్ గర్జనలు..

Post Published By: dialnews
Updated : 24 April 2026, 12:10 PM IST

యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగేది కాదు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అసలైన యుద్ధం తన దేశ మీడియా నుండే ఎదురవుతోంది. ఇరాన్‌ను 'మ్యాప్' నుండి తుడిచేస్తానన్న ట్రంప్ గర్జనలు.. నేడు సొంత మీడియా ముందు వెలవెలబోతున్నాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి నేటి 'బ్లాకేడ్' వరకు, అమెరికన్ మీడియా ఇరాన్‌కు ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ట్రంప్‌కు చుక్కలు చూపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటికే నష్టపోయిన అమెరికాను మరో గందరగోళంలోకి నెట్టొద్దంటూ మీడియా చేస్తున్న దాడి.. ట్రంప్‌ను ఒక విఫల నాయకుడిగా ముద్ర వేస్తోంది. అసలు మీడియా ఎందుకు ట్రంప్‌ను టార్గెట్ చేసింది..? బ్లాకేడ్ ఎందుకు కొలాప్స్ అయింది..? లెట్స్ స్టార్ట్ ది అనాలిసిస్.

యుద్ధం మొదలైన మొదటి రోజే CNN మరియు MSNBC లాంటి ఛానళ్లు ట్రంప్‌ను 'వార్ మాంగర్' అంటే యుద్ధ పిపాసి అని పిలిచాయి. CNN రిపోర్ట్ లో 'ట్రంప్ తన వ్యక్తిగత పంతాల కోసం అమెరికన్ల ప్రాణాలను పణంగా పెడుతున్నారు' అని నివేదించింది. న్యూయార్క్ టైమ్స్ లో.. ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేయడం ట్రంప్ చేస్తున్న చారిత్రక తప్పిదం అని, ఉక్రెయిన్ తరహాలో ఇక్కడ విజయం సులువు కాదని హెచ్చరించింది. అంటే, యుద్ధం గెలవకముందే మీడియా ట్రంప్ ఓటమిని రాసి పెట్టేసింది. ఇది ఇరాన్‌కు మానసికంగా పెద్ద బలాన్ని ఇచ్చింది. ట్రంప్ ఎంతో ఆశగా ప్రకటించిన 'నౌకాదళ దిగ్బంధనం' మీద మీడియా చేసిన దాడి మామూలుగా లేదు.

ది వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. 'ట్రంప్ బ్లాకేడ్ ఇరాన్ ను ఆకలితో ఉంచదు, కానీ ప్రపంచ మార్కెట్లను కుప్పకూలుస్తుంది' అని రాసింది. ఇక మీడియా రిపోర్టర్లు నేరుగా పెంటగాన్ అధికారులను నిలదీశారు. 'మీ దగ్గర ఉన్న క్షిపణులు ఇరాన్ డ్రోన్లను ఆపగలవా..?' అని అడగడం ద్వారా అమెరికా బలహీనతలను ప్రపంచానికి చాటి చెప్పారు. అమెరికా నౌకలు ఇరాన్ నౌకలను ఆపలేకపోయిన సందర్భాలను హైలైట్ చేస్తూ, "అగ్రరాజ్యం తన పట్టు కోల్పోయింది" అని మీడియా పదే పదే ప్రసారం చేస్తోంది.

ఇది అంతర్జాతీయ స్థాయిలో అమెరికా భయాన్ని పెంచుతోంది. దీనివల్ల మిత్రదేశాలు కూడా ట్రంప్ బ్లాకేడ్ కి మద్దతు ఇవ్వడానికి భయపడ్డాయి. ఫలితంగా.. నేడు ఆ బ్లాకేడ్ కేవలం కాగితాలకే పరిమితమైంది. పెంటగాన్ మరియు వైట్ హౌస్ లోపల జరుగుతున్న రహస్య చర్చలను అమెరికన్ మీడియా.. ఉదాహరణకు ది ఇంటర్సెప్ట్, వాషింగ్టన్ పోస్ట్ బయటపెడుతోంది. ట్రంప్ దగ్గర సరైన యుద్ధ ప్రణాళిక లేదని, కేవలం ఆయన అహంకారం కోసమే దాడులు చేస్తున్నారని సొంత అధికారులే మీడియాకు లీకులు ఇస్తున్నారు.

ఇది ఇరాన్‌కు అమెరికా బలహీనతలను స్పష్టంగా చూపిస్తోంది. "బ్లాకేడ్" వల్ల ఇరాన్ కంటే అమెరికా మరియు యూరప్ దేశాలే ఎక్కువ నష్టపోతాయని బ్లూంబర్గ్ లాంటి ఆర్థిక పత్రికలు గణాంకాలతో సహా నిరూపిస్తున్నాయి. చమురు ధరలు పెరిగితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, సామాన్యుడు రోడ్డు మీదకు వస్తాడని, ఇది ట్రంప్ చేసుకుంటున్న 'ఆర్థిక ఆత్మహత్య' అని మీడియా హెచ్చరిస్తోంది. ఇరాన్ యొక్క డ్రోన్ మరియు మిసైల్ టెక్నాలజీ ఎంత శక్తివంతమైనదో అమెరికన్ డిఫెన్స్ జర్నలిస్టులు వివరిస్తున్నారు.

"మనం బిలియన్లు ఖర్చు చేసినా వారి చౌకైన డ్రోన్లను ఆపలేకపోతున్నాం" అని మీడియాలో వస్తున్న కథనాలు అమెరికా సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంటే, ఇరాన్ సైన్యానికి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. గతంలో ఒబామా హయాంలో "యుద్ధం వస్తే ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది" అని ట్రంప్ చేసిన పాత ట్వీట్లను మీడియా ఇప్పుడు తిరగదోడుతోంది. "నాడు అలా చెప్పిన వ్యక్తి, నేడు ఎందుకు యుద్ధం వైపు వెళ్తున్నారు..?" అని మీడియా వేస్తున్న ప్రశ్నలకు ట్రంప్ దగ్గర సమాధానం లేకుండా పోయింది.

అమెరికా వీధుల్లో యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు మీడియా విపరీతమైన కవరేజ్ ఇస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఒక 'అగ్రెసర్' గా అంటే దురాక్రమణదారుగా కనిపిస్తుంటే, ఇరాన్ తనను తాను కాపాడుకుంటున్న దేశంగా చిత్రీకరించుకోవడానికి మీడియానే అవకాశం ఇస్తోంది. విచిత్రం ఏంటంటే, అమెరికా మీడియా ఇప్పుడు ఇరాన్ ప్రకటనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అల్ జజీరా, అమెరికాలోని లిబరల్ మీడియా కలిసి ఇరాన్ ఒక 'బాధితురాలు' అని, అమెరికా ఒక 'దురాక్రమణదారు' అని చిత్రీకరించాయి.

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన 10 నిమిషాల్లోనే ఇరాన్ దాన్ని తిరస్కరించినప్పుడు.. మీడియా దాన్ని 'ట్రంప్ కు చెంపదెబ్బ' అని హెడ్ లైన్స్ పెట్టింది. ఒక దేశ అధ్యక్షుడు అవమానానికి గురైతే బాధపడాల్సింది పోయి, మీడియా దాన్ని సెలబ్రేట్ చేసుకుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. మొత్తానికి, అమెరికా మీడియా ఇప్పుడు ఇరాన్ అన్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ లా మారిపోయింది. ట్రంప్ దూకుడును అడ్డుకోవడానికి, ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి మీడియా చేస్తున్న ప్రయత్నం ఇరాన్ కు ఆయుధంగా మారింది. యుద్ధం క్షేత్రంలో ఇరాన్ గెలుస్తుందో లేదో తెలియదు కానీ, అమెరికా లోపల జరుగుతున్న ఈ 'ఇన్ఫర్మేషన్ వార్' లో మాత్రం ట్రంప్ ఓడిపోయారు. ఇది అమెరికా పతనమా..? లేక మీడియా గెలుపా..? అనేది చూడాలి.

Published : 
  • 24 April 2026, 12:10 PM IST