మామూలుగా అయితే మన లాంటి సామాన్య మనుషులు ఇంటికి వెళ్లాక మందు కొడతారు. కానీ అమెరికా అధికారిక భవనం.. వైట్ హౌస్‌లో ఒక మహానుభావుడు ఉన్నాడు.. ఆయన ఇంటికి వెళ్లాక కాదు, ఆఫీస్‌లో పని మొదలుపెట్టే ముందే 'కిక్కు' ఎక్కిస్తాడట.. ఇంతకు ఎవరు ఆయన..? ఇంకెవరు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్. ప్రపంచం మొత్తం యుద్ధం గురించి టెన్షన్ పడుతుంటే, ఈయన మాత్రం 'గ్లాసులో ఏముంది..?' అని నెటిజన్లకు టెన్షన్ పెడుతున్నాడు. ఆయన తాగకుండా మీడియా సమావేశం పెట్టడనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అసలేం జరుగుతోంది వైట్ హౌస్‌లో..? ఈ వీడియోలో.. ఆ 'మందు' కథా కమీమామిషు మొత్తం విప్పేద్దాం.
రీసెంట్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇరాన్ మీద దాడులు, హార్ముజ్ జలసంధి క్లోజ్.. ఇలా సీరియస్ విషయాలు మాట్లాడుతున్నారు. సడన్ గా మన పీట్ గారు పోడియం మీద ఉన్న ఒక చిన్న గ్లాసు తీసి ఒక్క సిప్ వేశారు. అంతే.. నెటిజన్లు ఊరుకుంటారా..? 'అది మంచినీళ్లు కాదు, పక్కాగా విస్కీ లేదా స్కాచ్..' అని ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొందరైతే 'ఆయన కళ్లు చూడు.. కిక్కు మీద ఉన్నాడు' అని కామెంట్స్. వైట్ హౌస్ ఏమో అది 'జస్ట్ వాటర్' అంటోంది. కానీ లోకం మాత్రం 'పీట్ తాగంది స్పీచ్ ఇవ్వలేడు' అని ఫిక్స్ అయిపోయింది. రక్షణ శాఖ మంత్రి అంటే శత్రువులకి చెమటలు పట్టించాలి, కానీ ఈయనకి మాత్రం తాగకుండా గొంతు పెగలడం లేదట.
ఇదేదో ఇవాళ మొదలైంది కాదు బాబాయ్.. ఈయన గతంలో ఫాక్స్ న్యూస్ లో ఉన్నప్పుడే.. 'పీట్ గారు షూటింగ్ కి వచ్చేటప్పుడు ఆల్కహాల్ స్మెల్ వస్తున్నారు' అని ఆయన కొలీగ్సే కంప్లైంట్ చేశారట. సరిగ్గా నిద్రపోకుండా, హ్యాంగోవర్‌తో స్టూడియోకి వచ్చేవాడట. 'నేను అధికారంలోకి వచ్చాక అసలు తాగను' అని ట్రంప్‌కు ప్రామిస్ చేసి మరి పదవి తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే.. ఆ ప్రామిస్ గంగలో కలిసినట్టు కనిపిస్తోంది. పీట్ గారి మాజీ భార్య కూడా FBI కి 'ఆయన తాగకుండా ఉండలేడు' అని స్టేట్మెంట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి ఆయన రేంజ్ ఏంటో.
ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు మద్యం ముట్టుకోరు. కానీ ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ ఏమన్నారంటే.. 'ట్రంప్‌కు ఆల్కహాలిక్ పర్సనాలిటీ ఉంది' అని. అంటే తాగకపోయినా తాగిన వాడిలాగే ప్రవర్తిస్తారట. ఇప్పుడు తాగని బాస్ కి, తాగే మంత్రి దొరికాడు. ఇద్దరూ కలిసి వైట్ హౌస్‌ని ఒక 'బార్ అండ్ రెస్టారెంట్' లా మార్చేశారని జనాలు కుళ్లుజోకులు వేసుకుంటున్నారు. పీట్ గారు గ్లాసు ఎత్తగానే మీడియా ప్రతినిధులు కూడా 'సార్.. మాక్కూడా ఒక పెగ్గు వేస్తారా?' అని అడిగేలా ఉన్నారు.
ప్రస్తుతం గల్ఫ్‌లో యుద్ధం నడుస్తోంది. ఇరాన్ మార్గాలను మూసేసింది. ఇలాంటి టైంలో రక్షణ శాఖ మంత్రి ఫుల్ ఏకాగ్రతతో ఉండాలి. కానీ మన పీట్ గారు మాత్రం 'యుద్ధ విమానాలు ఎన్ని వెళ్లాయి..?' అని అడిగితే 'విస్కీ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి?' అని లెక్కపెట్టేలా ఉన్నాడని విమర్శలు వస్తున్నాయి. 'నేను కేవలం ప్రార్థనలు చేసి నిర్ణయాలు తీసుకుంటాను' అని ఆయన చెబుతుంటే, నెటిజన్లు మాత్రం 'గ్లాసు పట్టుకుని చేసేది ప్రార్థన కాదు బాబాయ్.. అది వేరే ఏదో' అని సెటైర్లు వేస్తున్నారు.