ఒక దేశాధ్యక్షుడా? లేక వీధి రౌడీనా? ప్రపంచం ఇప్పుడు ఇదే అడుగుతోంది. డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యం అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి, ఇవాళ సోషల్ మీడియాలో వాడుతున్న భాష చూస్తుంటే మతి భ్రమించిందా అనే అనుమానం కలగక మానదు. ఇరాన్ బలం అర్థం కాక, వాళ్లు దారికి రావడం లేదన్న అసహనంతో.. నోటికి ఏది వస్తే అది వాగుతూ, బూతులతో పోస్ట్‌లు పెడుతూ అగ్రరాజ్య ప్రతిష్టను గంగలో కలుపుతున్నారు. ఇరాన్ అంటే ఇరాక్ అనుకుంటున్నాడా ట్రంప్..? ఆ దేశం దగ్గరున్న క్షిపణి వ్యవస్థ ముందు మీ బెదిరింపులు బలాదూర్ అని ఇరాన్ నిరూపిస్తోంది. అసలు ట్రంప్ ఎందుకిలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు..? ఇరాన్ వ్యూహం ముందు ట్రంప్ ఎందుకు విఫలమవుతున్నారుడు? ఈ వీడియోలో చూద్దాం.
ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ట్రంప్ పెడుతున్న పోస్ట్‌లు చూస్తుంటే ఆయనకు ఓటమి భయం పట్టుకుందని స్పష్టమవుతోంది. ఇరాన్ నాయకులను అత్యంత హీనమైన పదజాలంతో దూషిస్తూ, 'ఓపెన్ ది ఎఫ్*** స్ట్రెయిట్, యూ క్రేజీ బాస్టర్డ్స్' అంటూ బూతులు వాడుతున్నాడు. ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ శాంతి చర్చలు జరపాలని కోరుతుంటే, ట్రంప్ మాత్రం గల్లీ లీడర్ లా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకీ పిచ్చి? ఎందుకంటే అతను ఇచ్చిన 48 గంటల డెడ్‌లైన్ ముగిసిపోయింది.. అయినా ఇరాన్ లొంగలేదు. పది రోజుల గడువు ఇచ్చాడు.. ఇరాన్ బెదరలేదు. ఇప్పుడు మళ్ళీ మంగళవారం రాత్రి 8 గంటల వరకు టైమ్ అంటూ డెడ్లైన్లు మారుస్తూ పోతున్నాడు. తన మాట చెల్లడం లేదన్న కోపంతో, ఏం చేయాలో పాలుపోక సోషల్ మీడియాలో తన ప్రస్ట్రేషన్ను వెళ్లగక్కుతున్నాడు.
ట్రంప్ ఒక్క విషయం మర్చిపోతున్నాడు. ఇరాన్ అంటే ఏదో చిన్న దేశం కాదు. దశాబ్దాలుగా ఆంక్షలను ఎదుర్కొని కూడా స్వయం సమృద్ధిని సాధించిన దేశం. అది ఒక సైనిక శక్తి. హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ వంతెనలు, పవర్ ప్లాంట్లు కూలుస్తానని ట్రంప్ బెదిరిస్తున్నాడు. కానీ ఇరాన్ సమాధానం ఏంటో తెలుసా? 'నువ్వు ఒక్క పవర్ ప్లాంట్‌ను తాకితే.. నీకు నరకం చూపిస్తాం' అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ దగ్గర ఉన్న భూగర్భ క్షిపణి నగరాలు అమెరికాకు పీడకలగా మారాయి. అందుకే ఇరాన్ దారిలోకి రావడం లేదు. ట్రంప్ మాటలకు భయపడటం మానేసి, రివర్స్‌లో ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
ట్రంప్ ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని బెదిరిస్తుంటే.. ఇరాన్ మాత్రం చాలా కూల్‌గా స్పందిస్తోంది. ఇరాన్ అధికారులు ట్రంప్‌ను 'పిచ్చివాడు, అస్థిరమైన వ్యక్తి' అని కొట్టిపారేస్తున్నారు. అంతేకాదు, ఇరాన్ రాయబార కార్యాలయాలు సోషల్ మీడియాలో ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నాయి. 'ట్రంప్.. ప్లీజ్ మాట్లాడు, మాకు బోర్ కొడుతోంది' అంటూ ఇరాన్ రాయబార కార్యాలయాలు సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నాయి. ట్రంప్ అహంకారం ముందు ఇరాన్ ఆత్మగౌరవం గెలుస్తోంది.
హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం అంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెడకు ఉరితాడు బిగించడమే. ఇది తెలిసే ట్రంప్ పిచ్చెక్కిపోతున్నాడు. యుద్ధం కంటిన్యూ చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. బారెల్ చమురు ధర ఇప్పటికే 114 డాలర్లు దాటింది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి ట్రంప్ కుర్చీకే ఎసరు వస్తుంది. యుద్ధం కంటిన్యూ చేయలేడు. అలాగని ఇరాన్‌ను లొంగదీసుకోలేడు. ఈ మధ్యలో ఉండిపోయిన ట్రంప్, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్‌లు పెడుతున్నాడు. తన అస్థిరత్వంతో ప్రపంచాన్ని ముంచేలా ఉన్నాడు.
చివరగా.. ఒక దేశాధినేతకు ఉండాల్సిన సంయమనం ట్రంప్‌లో మచ్చుకైనా కనిపించడం లేదు. ఇరాన్ బలాన్ని తక్కువ అంచనా వేసి, నోరు పారేసుకోవడం వల్ల నష్టపోయేది అమెరికానే. బూతులు తిడితే యుద్ధాలు గెలవలేరు ట్రంప్.. వ్యూహం ఉండాలి, దౌత్యం ఉండాలి. ఇరాన్ దారిలోకి రావడం లేదనే కోపంతో మీరు చేస్తున్న ఈ చేష్టలు ప్రపంచానికి చేటు తెస్తున్నాయి.