Top story:పెంటగాన్ లో పెంట పెట్టిన ఇరాన్… తిట్టుకున్న రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్…!

అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్'లో ఇరాన్ యుద్ధం విషయంలో గొడవలు జరుగుతున్నాయా..? ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు మధ్య గొడవలు ముదిరాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత రాత్రి పెంటగాన్ లో కీలక పరిణామం చోటు

Post Published By: dialnews
Updated : 4 April 2026, 6:30 PM IST

అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్'లో ఇరాన్ యుద్ధం విషయంలో గొడవలు జరుగుతున్నాయా..? ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు మధ్య గొడవలు ముదిరాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత రాత్రి పెంటగాన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌తో యుద్ధం అత్యంత భయంకరమైన దశకు చేరుకున్న వేళ.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశపు అత్యున్నత సైనిక అధికారి, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించడం ఇప్పుడు సంచలనం అయింది.యుద్ధం జరుగుతుండగా కమాండర్‌ను మార్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అసలు హెగ్సెత్ ఎందుకు ఇంత సాహసం చేశారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ముందుగా జనరల్ రాండీ జార్జ్ గురించి తెలుసుకోవాలి. ఈయన 40 ఏళ్ల సుదీర్ఘ సైనిక అనుభవం ఉన్న యోధుడు. 2023లో బైడెన్ హయాంలో ఈ బాధ్యతలు చేపట్టారు. అయితే, ట్రంప్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి హెగ్సెత్, జార్జ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. హెగ్సెత్ దృష్టిలో రాండీ జార్జ్ ఒక 'బ్యూరోక్రాట్' మాత్రమే.

కానీ 'వారియర్' కాదు. ముఖ్యంగా ఇరాన్ విషయంలో హెగ్సెత్ కోరుకున్నంత దూకుడును జార్జ్ ప్రదర్శించలేదని సమాచారం. దీనితోనే.. రక్షణ మంత్రికి, తన సైన్యాధ్యక్షుడిపై 'నమ్మకం పోయింది' అని పెంటగాన్ అధికారికంగా ప్రకటించడం అంటే.. వారి మధ్య సంబంధాలు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో అర్థం చేసుకోవచ్చు. పీట్ హెగ్సెత్ రక్షణ మంత్రి కాగానే ఒకటే నినాదం ఇచ్చారు.. 'మేక్ అవర్ మిలిటరీ గ్రేట్ ఎగైన్'. ఆయన రాకతో పెంటగాన్‌లో ఒక 'క్లీన్ స్వీప్' మొదలైంది. కేవలం రాండీ జార్జ్ మాత్రమే కాదు, గత కొన్ని రోజుల్లోనే సుమారు 14 మందికి పైగా ఉన్నత స్థాయి జనరల్స్ మరియు అడ్మిరల్స్‌ను ఆయన ఇంటికి పంపారు.ఇందులో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ సి.క్యూ బ్రౌన్ కూడా ఉన్నారు. హెగ్సెత్ ఉద్దేశం ఒక్కటే.. సైన్యంలో ఉన్న 'లిబరల్' ఆలోచనలను, రాజకీయాలను తుడిచిపెట్టి, కేవలం యుద్ధం అంటే తెలిసిన వారినే ఉంచడం. అందుకే దీనిని అమెరికా మీడియా అతిపెద్ద ప్రక్షాళన అంటుంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం ఐదవ వారంలోకి ప్రవేశించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత కూడా ఇరాన్ బలంగా పోరాటం చేస్తోంది. ఈ సమయంలో అమెరికా తన వ్యూహాన్ని మార్చింది. ఇప్పటివరకు కేవలం గాలిలో దాడులు చేసిన అమెరికా.. ఇప్పుడు 'గ్రౌండ్ ఆపరేషన్' లేదా మరింత విధ్వంసకర దాడులకు సిద్ధమవుతోంది.

ఈ కొత్త యుద్ధ తంత్రాన్ని అమలు చేయడానికి పాత తరం జనరల్స్ అడ్డుపడుతున్నారని హెగ్సెత్ భావిస్తున్నారు. అందుకే, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా తన ఆదేశాలను పాటించే కొత్త టీమ్‌ను ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. రాండీ జార్జ్ స్థానంలో ఇప్పుడు జనరల్ క్రిస్టోఫర్ లానెవ్ ను తాత్కాలికంగా నియమించారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ లానెవ్ గతంలో పీట్ హెగ్సెత్ కి వ్యక్తిగత సైనిక సహాయకుడిగా పనిచేశారు. అంటే, హెగ్సెత్ మనస్తత్వం ఏంటో, ఆయన ఏం కోరుకుంటున్నారో లానెవ్ కి బాగా తెలుసు.ఒక రకంగా చెప్పాలంటే.. పెంటగాన్ లో ఇప్పుడు 'యస్ బాస్' అనే సంస్కృతి మొదలైంది. రక్షణ మంత్రికి మరియు సైన్యానికి మధ్య ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా, యుద్ధంపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికే ఈ మార్పు జరిగిందని స్పష్టమవుతోంది. అయితే ఈ నిర్ణయంపై భారీ ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలా టాప్ లీడర్‌షిప్‌ను మార్చడం వల్ల సాధారణ సైనికుల్లో ధైర్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాజకీయ విధేయత కోసమే అనుభవం ఉన్న జనరల్స్‌ను తొలగించడం వల్ల అమెరికా రక్షణ వ్యవస్థ బలహీనపడుతుందా? శత్రువులకు ఇది అవకాశం ఇస్తుందా? ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశం ఎదురుదాడికి దిగితే, కొత్త కమాండర్లు ఎంతవరకు తట్టుకోగలరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ట్రంప్ సర్కార్ మాత్రం 'మేము యుద్ధం గెలవడానికే వచ్చాం, రాజీ పడటానికి కాదు' అని తెగేసి చెబుతోంది. రాండీ జార్జ్ నిష్క్రమణతో పెంటగాన్ లో ఒక శకం ముగిసింది. హెగ్సెత్ నేతృత్వంలో అమెరికా ఆర్మీ ఇప్పుడు ఒక కొత్త రూపం దాల్చబోతోంది. ఇది ఇరాన్‌ను పూర్తిగా సామంతుడిగా మారుస్తుందో లేక కొత్త అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి.

Published : 
  • 4 April 2026, 6:30 PM IST