ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా చెప్పిన దగ్గరే ఆయిల్ కొనాలి, భారత రైతులు, ప్రజల ప్రయోజనాలు అమెరికాకు అమ్మేసారు అంటూ రాహుల్ గాంధీ చేసిన విమర్శలు సంచలనం అయ్యాయి. ఎప్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించి.. ప్రధాని నరేంద్ర మోడీలో ఒత్తిడి కనపడుతోందని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఆయన ముఖంలో భయం ఉందని.. అందుకే అమెరికాకు దేశాన్ని అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి.. రాహుల్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ నోటీసు దాఖలు చేసారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. బడ్జెట్ పై చర్చలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, రాహుల్ గాంధీని జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని నోటీసులో బీజేపీ డిమాండ్ చేసింది.