Top Story:ట్రంప్‌కు బిగ్ షాక్.. హ్యాండ్ ఇచ్చిన సౌదీ… యుద్ధంలోకి చైనా.. అమెరికా పతనం ఇదే…!

తొలి విడత శాంతి చర్చల ఫెయిల్యూర్ తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన షాకింగ్ ప్రకటన ఇది. హర్మూజ్‌లో అమెరికా సైన్యం మోహరింపుతో పాటు యుద్ధ నౌకలు, విమానాల గురించి కీలక సమాచారాన్ని పంచుకుంది.

Post Published By: dialnews
Updated : 16 April 2026, 11:50 AM IST

తొలి విడత శాంతి చర్చల ఫెయిల్యూర్ తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన షాకింగ్ ప్రకటన ఇది. హర్మూజ్‌లో అమెరికా సైన్యం మోహరింపుతో పాటు యుద్ధ నౌకలు, విమానాల గురించి కీలక సమాచారాన్ని పంచుకుంది. 'అమెరికాకి చెందిన 10 వేల మందికి పైగా నేవల్ సిబ్బంది, మెరైన్స్, ఎయిర్ ఫోర్స్ సైన్యం, 10కిపైగా యుద్ధ నౌకలు, డజన్ల కొద్దీ విమానాలు హర్మూజ్ జలసంధిలో ఇరాన్ పోర్టులలోకి ప్రవేశించే, బయలుదేరే నౌకల్ని దిగ్బంధించే పని సక్రమంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది. మొదటి 24 గంటల్లో ఏ నౌకా అమెరికా దిగ్బంధనాన్ని దాటలేకపోయిందనీ, 6 వాణిజ్య నౌకలు అమెరికా సైన్యం ఆదేశాలను పాటిస్తూ ఒమన్ గల్ఫ్‌లోని ఇరాన్ నౌకాశ్రయాలకు వైపు తిరిగి వెళ్లాయని సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది.

మరోవైపు.. అమెరికా సెంట్రల్ కమాండ్.. 'హర్మూజ్ జలసంధిలో తమ దిగ్బంధనం కొనసాగుతోందని తెలిపింది. ఇరాన్ పోర్టులలోకి ప్రవేశించే లేదా అక్కడి నుంచి బయలుదేరే అన్ని దేశాల నౌకలపై తమ ఆంక్షలు అమలు చేస్తున్నామనీ, ఇందులో అరేబియా సముద్రం, ఒమన్ ఆఫ్ గల్ఫ్‌లోని అన్ని ఇరాన్ పోర్టులు కూడా ఉన్నట్లు తెలిపింది. అమెరికా సైన్యం ఇరాన్ యేతర పోర్టుల నుంచి రాకపోకలు సాగించే నౌకలకు హర్మూజ్ జలసంధిలో రాకపోకలకు సహకరిస్తోందనీ, అలాంటి నౌకలపై తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదంది. అమెరికా సెంట్రల్ కమాండ్‌ ఇంత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నా.. అమెరికాకు అసలు చిక్కు మిత్ర దేశాల నుండే వస్తోంది. తాజా దిగ్బంధనం మిషన్‌ను నాటో కూటమి వ్యతిరేకించింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు అమెరికా చేపట్టిన దిగ్బంధం మిషన్‌లో పాల్గొనడానికి స్పష్టంగా నిరాకరించాయి. హార్ముజ్‌లో ట్రంప్ యాక్షన్‌కు ఇప్పటివరకూ మద్దతిచ్చిన గల్ఫ్ దేశాలు కూడా దారుణంగా హ్యాండ్ ఇచ్చాయి. తాజా ఆపరేషన్‌లో ట్రంప్‌కు తగిలిన అసలు సిసలు షాక్ ఇదే.

ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత అమెరికాకు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచింది గల్ఫ్ దేశాలే. ఒకప్పుడు ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికాను సమర్థించిన సౌదీ, దిగ్బంధాన్ని వ్యతిరేకిస్తోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్‌పై ఒత్తిడి తెస్తోంది. దీని వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. ఒకవేళ ఇరాన్ ఓడరేవులను అమెరికా అడ్డుకుంటే, ఇరాన్ తన మద్దతుదారులైన హౌతీ రెబల్స్ ద్వారా ఎర్ర సముద్రంలోని బాబ్ అల్-మండేబ్ జలసంధిని మూసేస్తారు. దీనివల్ల సౌదీ అరేబియా ఆయిల్ ఎగుమతులు పూర్తిగా ఆగిపోతాయి. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు దాటాయి. గల్ఫ్ దేశాలకు అవసరమైన ఆహార పదార్థాలలో 80శాతం ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తాయి. ఈ దిగ్బంధం వల్ల అక్కడ నిత్యావసరాల ఎమర్జెన్సీ ఏర్పడింది. కథ ఇక్కడితో కూడా అయిపోలేదు. ఎందుకంటే, ట్రంప్ తీరుపై డ్రాగన్ కంట్రీ చైనా సైతం కత్తులు దూస్తోంది.

హార్ముజ్ జలసంధి దిగ్బంధం విషయంలో చైనా చాలా కటువుగా స్పందించింది. అమెరికా చర్యలను ప్రమాదకరమైన, బాధ్యతారాహిత్యమైనవిగా చైనా అభివర్ణించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి.. ఇరాన్-అమెరికాల మధ్య ఇప్పటికే ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉందని గుర్తుచేశారు. ఆ ఒప్పందం ఉండగానే అమెరికా ఇలా "టార్గెటెడ్ బ్లాకేడ్" చేయడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని, ఇది అంతర్జాతీయ నౌకాయానానికి పెద్ద ముప్పు అని హెచ్చరించారు. అంతేకాదు, ఇరాన్‌తో తమ ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దీనర్థం.. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగిస్తే చైనా రంగంలోకి దిగాల్సి వస్తుందని చెప్పడమే.
యూరోపియన్ దేశాలు హ్యాండ్ ఇచ్చాయి.. ఇరాన్‌తో యుద్ధానికి మద్దతుగా నిలిచిన గల్ఫ్ దేశాలు నో చెబుతున్నాయి..

చైనా అయితే యుద్ధానికి కూడా వెనుకాడబోమనే సంకేతాలిస్తోంది. ఇవన్నీ ట్రంప్ సైన్యాన్ని చిక్కుల్లో పడేసే పరిణామాలే. ఎందుకంటే, అమెరికా తన మిత్రుల మద్దతు లేకుండా ఇలాంటి భారీ ఆపరేషన్ నిర్వహించడం కష్టం. పైగా ఈ మిషన్ అంతర్జాతీయంగా అమెరికా పలుకుబడిని తగ్గిస్తుంది. అమెరికా మిత్రదేశాలతో విభేదిస్తున్న తరుణంలో, ఇరాన్‌కు చైనా, రష్యా మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇది మిడిల్‌ఈస్ట్‌లో అమెరికా పట్టును బలహీనపరుస్తుంది. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల అమెరికాలో కూడా ద్రవ్యోల్బణం పెరిగి, ట్రంప్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఇలా హార్ముజ్ అష్టదిగ్బంధనం ఆపరేషన్‌ ట్రంప్ అనుకున్నంత ఈజీగా అయితే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, సీజ్‌ఫైర్ కొనసాగుతున్న వేళ హార్ముజ్‌ యాక్షన్‌ అమెరికానే చిక్కుల్లో పడేస్తుంది.

 

Published : 
  • 16 April 2026, 11:50 AM IST