Top story: ఏపీలో కులరాజకీయం ముగిసింది….. మతరాజకీయం మొదలైంది… 2029 కి కూటమి కొత్త ప్లాన్.!

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన ఏడాదికే కాపు కుల రాజకీయాన్ని వదిలేసి.... సనాతన వాదం అందుకోగానే ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకున్నారు. కులాల్తో కొట్టుకు చచ్చే ఆంధ్రప్రదేశ్లో సనాతన వాదం వర్కౌట్ అవుతుందా అది కామెంట్ చేశారు.

Post Published By: dialnews
Updated : 21 September 2026, 12:21 PM IST

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన ఏడాదికే కాపు కుల రాజకీయాన్ని వదిలేసి.... సనాతన వాదం అందుకోగానే ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకున్నారు. కులాల్తో కొట్టుకు చచ్చే ఆంధ్రప్రదేశ్లో సనాతన వాదం వర్కౌట్ అవుతుందా అది కామెంట్ చేశారు. కానీ బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇప్పుడు చాలామందికి అర్థం అవుతుంది. 2029 ఎన్నికలకి ఏపీలో నడిచేది కుల రాజకీయం కాదు, మత రాజకీయం .హిందువులు వర్సెస్ ఇతర మతాలు. 85% హిందువుల తరపున గొంతు వినిపించడం ద్వారా అధికారంలోకి రాడానికి జనసేన, టిడిపి, బిజెపి వేసిన పక్క మాస్టర్ ప్లాన్. దీనిని మూడేళ్ల ముందే ఎల్లో మీడియా జనంలోకి ఎక్కించడం మొదలుపెట్టింది. అది ఇప్పుడు మరింత స్పీడ్ అందుకుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రొటెస్టెంట్ క్రిస్టియన్. ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ కరుడుగట్టిన క్రైస్తవులు. వాళ్లు హిందూ ఆలయాలు కు కూడా రారు .ప్రసాదాలు తీసుకోరు. ఇక జగన్ చెల్లెలు షర్మిల కూడా క్రిస్టియన్. ఆమె భర్త ఇవాంజెలిస్ట్. అంటే మత ప్రబోధకుడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఏపీలో 30 వేల చర్చిలు నిర్మించినట్లు, అలాగే లక్షలాదిమందిని మతమార్పిడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఏపీలో ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు క్లియర్ కట్ గా జగన్ తోనే ఉంటారు 11 సీట్లు ఇచ్చిన రోజు కూడా వైసీపీకి 40% ఓట్ బ్యాంకు ఉంది .....అంటే కారణం ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్లే . ఆ ఓట్ బ్యాంక్ ని టిడిపి జనసేన ఇంచ్ కూడా కదప లేవు. ఆపైన జగన్ ఎంత సంపాదించుకుంటే అంత వైసీపీకి అదనంగా వస్తాయి. ఇది ఎప్పటికైనా టిడిపి, జనసేనకి ప్రమాదమే. అందుకే 29 నాటి ఎన్నికల్లో కులం మీద ఆధారపడకూడదు ,మతాన్ని అడ్డం పెట్టుకొని ఓటు రాజకీయం చేయాలని టిడిపి ,జనసేన ,బిజెపి నిర్ణయించాయి. వచ్చే ఎన్నికల్లో కాపులు పవన్ కళ్యాణ్ కి దూరమైపోతారు. వాళ్ళు ఇప్పటికే అతనిపై అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్తులో కులం వర్కౌట్ కాకపోవచ్చు. “అందువలన ఏపీలో జనాన్ని రెండు భాగాలుగా అంటే హిందువులు ,హిందుఇతరులు గా విభజిస్తే...85% జనాన్ని కూటమి సొంతం చేసుకుంటుంది.

వాళ్లలో 51 శాతం ఓట్లు వేసినా కూటమి తేలిక గెలవచ్చు. సమాజంలో మైనారిటీలుగా ఉన్న క్రిస్టియన్లు, ముస్లింలను వదిలేసినా కూడా కేవలం హిందువులు నమ్ముకొని, ఆ విభజన రేఖ స్పష్టంగా గీసి హిందువులు ఓట్లతో గెలవచ్చు అన్నది టిడిపి జనసేన వ్యూహం.50 ఏళ్లు చంద్రబాబు, 17 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కులరాజకీయాన్ని వదిలిపెట్టి ఇప్పుడు మత రాజకీయాన్ని అందుకోవడానికి అదే అసలు కారణం. ఈ వ్యూహంలో భాగంగా ఎల్లో మీడియా జగన్ ని స్పష్టంగా క్రిస్టియన్ ప్రతినిధిగా చూపించడానికి కింద.... మీద పడుతుంది. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే మతమార్పిడు లు మొదలయ్యాయని, అది జగన్ హయాంలో తీవ్రమైందని రాయడం మొదలుపెట్టాయి. క్రిస్టియన్ ఓట్లు పెంచుకోవడం కోసమే మతమార్పిడులు జరిగాయని స్వయంకల్పిత విశ్లేషణని సృష్టించింది ఎల్లో మీడియా.మత రాజకీయంలో భాగంగానే లడ్డు కల్తీ రాజకీయం మొదలైంది. తిరుమల లడ్డు నెయ్యిలో లో జంతు కళేబరాల నుంచి తీసిన కొవ్వు కలిపారని చంద్రబాబు ,లోకేష్, పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పి జనాన్ని నమ్మించారు.

ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ లో లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే కానీ, తిరుమల లడ్డులో జంతు కళేబరాల కొవ్వు లాంటి పదార్థాలు లేవని స్పష్టంగా తేలిపోయింది. దీంతో ఒక్కసారిగా డీలాపడిన టిడిపి మీడియా వెంటనే రూట్ మార్చి మతమార్పిడు ఆరోపణలు మొదలు పెట్టాయి.2029 లో కులం కంటే మతమే బాగా వర్క్ అవుట్ అవుద్దని.... జనానికి మత పిచ్చి బాగా ఎక్కిస్తే గెలవడం తేలిక అవుతుందని ఏడాది క్రితమే కూటమి నేతలు గుర్తించారు. దానిలో భాగంగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆకివీడులో నేరుగా వెళ్లి క్రిస్టియన్లతో గొడవ పెట్టుకున్నారు. రామాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా తనను తాను హిందుత్వ వాదిగా బలంగా చెప్పుకున్నారు.

అంతవరకు ఎందుకు పది రోజుల క్రితం కొత్త రాజకీయం మొదలుపెట్టిన వైసిపి పాత కాపు విజయ్ సాయి రెడ్డి కూడా జగన్ని రెడ్డిగా కంటే క్రిస్టియన్ గానే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.2019 నుంచి 24 వరకు ఏపీలో క్రిస్టియన్లు అధికారంలో ఉన్నారని చెప్పి జనాన్ని రెచ్చగొడ్డానికి సాయి రెడ్డి తన వంతు కృషి చేస్తున్నారు. జగన్ రెడ్డే కాదని.... ఆయన క్రిస్టియన్ అన్నది సాయి రెడ్డి వాదన.ఏపీలో నిరుద్యోగం, వ్యవసాయం, నీటిపారుదల కష్టాలు, అప్పులు, ఇవన్నీ గాలికి వదిలేసారు. రాబోయే రెండేళ్లలో జరిగే చర్చంతా మత మార్పిడిలపైనే. వైసిపి వాళ్ళు అంతా క్రిస్టియన్లు టిడిపి వాళ్లంతా హిందువులు అని చెప్పే ప్రయత్నంలో ఏ రేంజ్ కైనా వెళ్ళిపోతారు ఏపీలో పొలిటీషియన్లు. అయితే పదేళ్ల కుర్రాడు కూడా కుల పిచ్చితో ఊగిపోయే ఏపీలో మతం నిజంగా వర్కౌట్ అవుతుందా అన్నది అనుమానమే. ఏపీలో జనం ఎటున్నారు కులమా..? మతమా? వాళ్లు దేనిని ఇప్పుడు బలంగా విశ్వసిస్తున్నారు అన్నది 2029 లో తేలుతుంది.

 

 

Published : 
  • 21 September 2026, 12:21 PM IST