Top story: నూకరాజు కేసులో రంగంలోకి డిప్యూటీ సీఎం.. కలెక్టర్ వద్దకు వెళ్లిన జనసేన ఎంపీ.. నూకరాజు కేసులో షాకింగ్ నిజాలు..!

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ హృదయవిదారక ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు

Post Published By: dialnews
Updated : 27 August 2026, 11:48 AM IST

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ హృదయవిదారక ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో బాధితులకు పూర్తి న్యాయం జరగాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈ దారుణ సంక్షోభం నుండి ప్రాణాలతో బయటపడిన పదేళ్ల చిన్నారితో కలిసి నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ గారు నిందితుడు సాదిక్ ఖాన్ చేసిన కిరాతకాలను, సంచలన విషయాలను బయటపెట్టారు. అసలు ఆ ఆత్మహత్య లేఖలో ఏముంది? సాదిక్ ఖాన్ ఆ కుటుంబాన్ని ఎలా వేధించాడు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఏఈ నూకరాజు కుటుంబం నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం వెనుక సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బాధితుల కుటుంబంలో మిగిలిన ఏకైక బాలుడు రియాంశ్ కార్తికేయ రెడ్డికి అండగా నిలవాలని ఆయన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను పంపినట్లు తెలుస్తోంది. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆ బాలుడిని పిలుచుకుని కాకినాడ కలెక్టర్ వద్దకు వెళ్లారు. నూకరాజు కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు, ఆ చిన్నారి తండ్రి జగదీష్ రెడ్డి మరణానికి ముమ్మాటికీ సాదిక్ ఖానే కారణమని ఎంపీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కేసులో నూకరాజు కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఆ లేఖలో సౌజన్య.. "నాకు ఎలాగైనా న్యాయం చేయండి" అంటూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను ప్రత్యేకంగా కోరింది. సాదిక్ ఖాన్ తనను ఎంత కిరాతకంగా హింసించాడో, ఆ వేధింపులను ఎవరికీ చెప్పుకోలేక తను ఎంత మానసిక క్షోభ అనుభవించి కుంగిపోయిందో ఆ లేఖలో స్పష్టంగా రాసింది. కేవలం సౌజన్యనే కాకుండా, ఆ బాలుడి తండ్రి జగదీష్ రెడ్డి మరణం వెనుక కూడా సాదిక్ ఖాన్ హస్తం ఉందని, సాదిక్ ఖానే కెమికల్స్ ఉపయోగించి ఆయనను చంపేశాడనే సంచలన ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

సాదిక్ ఖాన్ చేసిన అరాచకాలు ఇక్కడితో ఆగలేదు. ఆ కుటుంబంలో ఉన్న హిందూ దేవుళ్ళ ఫోటోలను బలవంతంగా తొలగించి, ఖురాన్ చదవాలంటూ సాదిక్ ఖాన్ వారిని తీవ్రంగా బెదిరించేవాడని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వెల్లడించారు. మతం మారాలని సౌజన్యపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని పోలీసులు కూడా ధృవీకరించారు. అంతేకాదు, ఈ అరాచకాల గురించి ఎవరికైనా చెబితే.. ఆ పదేళ్ల బాలుడిని ఉగ్రవాద సంస్థలకు అమ్ముతానంటూ సాదిక్ ఖాన్ నిస్సిగ్గుగా బెదిరించాడని ఆ చిన్నారి స్వయంగా వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతటి మానసిక హింసను భరించలేకే ఆ కుటుంబం అంతటి దారుణమైన నిర్ణయం తీసుకుంది.

నూకరాజు కుటుంబానికి ఉన్న బ్యాంకు ఖాతాలు, విలువైన ఆస్తులను సాదిక్ ఖాన్ అక్రమంగా లాక్కున్నాడని, వారిని రోడ్డున పడేశాడని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆరోపించారు. అందుకే కలెక్టర్ ను కలిసి.. సాదిక్ ఖాన్ లాక్కున్న ఏఈ నూకరాజు, జగదీష్ రెడ్డిల ఆస్తులన్నింటినీ తిరిగి ఆ బాలుడి పేరుపైనే మార్చాలని, ఆ చిన్నారి భవిష్యత్తుకు పూర్తి భద్రత కల్పించాలని ఎంపీ కోరారు. ఈ కేసులో సాదిక్ ఖాన్ లాంటి దుర్మార్గుడికి కఠినమైన శిక్ష పడే వరకు జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఒక పచ్చని కుటుంబాన్ని బలితీసుకుని, పదేళ్ల బాలుడిని అనాథను చేసిన సాదిక్ ఖాన్ లాంటి నిందితుడికి చట్టప్రకారం ఉరిశిక్ష పడాలనే డిమాండ్స్ బలంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన నాయకులు ఈ బాలుడికి అండగా నిలబడటం నిజంగా అభినందనీయం.

Published : 
  • 27 August 2026, 11:48 AM IST