Top story: దుబాయ్ అతలాకుతలం…. మన వాళ్ళ రియల్ ఎస్టేట్ పెట్టుబడులన్నీ గోవింద….?

అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంలో దుబాయ్ నలిగి పోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒకటైన దుబాయ్ ని కూడా ఇరాన్ టార్గెట్ చేసింది.

Post Published By: dialnews
Updated : 4 March 2026, 12:21 PM IST

అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంలో దుబాయ్ నలిగి పోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒకటైన దుబాయ్ ని కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ దేశాన్ని మిస్సైల్స్ తో అతలాకుతలం చేస్తుంది. అంతేకాదు ప్రపంచంలో విమాన ప్రయాణాలు అన్నిటికీ... ట్రాన్సిట్ సెంటర్ అయిన దుబాయ్ ఎయిర్పోర్ట్ ధ్వంసం అయింది.వేల విమాన ప్రయాణాలు.. రద్దు అయ్యాయి. ప్రతిరోజు బిలియన్ల డాలర్ల నష్టం భరిస్తుంది దుబాయ్. మరో వైపువిమాన ప్రయాణాలు ఎక్కడివి అక్కడే ఆగిపోవడంతో... వేల మంది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ దుబాయిలో చిక్కుకుపోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి రిలాక్స్ అవ్వడానికి దుబాయ్ వెళ్లిన వాళ్ళు అంతా అక్కడే చిక్కుకుపోయారు.దుబాయ్ లో బిట్స్ పిలాని కాలేజీలో తెలుగు రాష్ట్రాల పిల్లలు చాలామంది చదువుతున్నారు.

లక్షల మంది మనవాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. డ్రైవర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, సివిల్ ఇంజనీర్స్, నర్సులు, ఆయాలు వంటవాళ్ళు... ఇలా లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. నిజానికి దుబాయ్ కి చమురు నిల్వల ద్వారా వచ్చే ఆదాయం క్రమంగా తగ్గిపోయింది. అందుకే ప్రత్యామ్నాయ ఆదాయాలపై దుబాయ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధానంగా టూరిజం, రియల్ ఎస్టేట్, మాల్స్ ఇలా రకరకాల ఇతర ఆదాయాన్ని... పెట్టుబడులని దుబాయ్ ప్రమోట్ చేసింది. దానిలో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది దుబాయ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు.

ప్రధానంగా రియల్ ఎస్టేట్ పై ఫోకస్ చేశారు. కొందరు బడా వ్యాపారస్తులు హోటల్స్ లో.... ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడి పెట్టారు. చాలామంది తమ సెకండ్ ఇన్వెస్ట్మెంట్... లేదా థర్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం దుబాయ్ నీ ఎంచుకున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇక్కడ మనవాళ్ళు అందరిని ఫ్రీ దుబాయ్ టూర్లు వేసి అక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటట్లు చేశారు. హైదరాబాదులో రేటుకే దుబాయ్ లో త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ వస్తుంది అని... అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని నమ్మించారు. హైదరాబాద్ మాత్రమే కాదు బెజవాడ, రాజమండ్రి, విశాఖ భీమవరం నుంచి కూడా డబ్బులు ఉన్నవాళ్లంతా వెళ్లి దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు. మరి కొంతమంది అక్కడ వ్యాపారాల్లో వాటాలు తీసుకున్నారు.

ప్రపంచంలో దుబాయ్ కన్నా సేఫ్ ఏరియా లేదని అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం మంచిదని బీకర ప్రచారం జరిగింది. ఆ ప్రమోషన్ కి చాలా మంది పడిపోయారు. కొంత బ్లాకు మరికొంత వైట్.... ఇంకొంత హవాలా మార్గం ద్వారా కి పెట్టుబడుల సొమ్ము తరలించారు. అక్కడ అపార్ట్మెంట్లు కొనడం మాత్రమే కాక వాడిని అద్దెకిచ్చారు. మంచి ఆదాయం కూడా వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పొలిటిషన్ లో చాలామంది దుబాయ్ లోని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు.అక్కడకు డబ్బు పంపించడం చాలా తేలిక. అంతేకాక పెట్టే ప్రతి రూపాయికి భద్రత ఉంటుంది. అక్కడ ట్రాన్స్ఫరెన్సీ కూడా ఉంటుంది. కనుక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు ఉరికారు జనం.

దుబాయ్ లో డబ్బులు పెట్టిన రోజు నుంచే.. రెంట్ ఇస్తామని బిల్డర్లు హామీలు ఇవ్వడంతో కూడా, జనం ఆశతో పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్లు , క్రికెటర్లు దుబాయ్ లో విల్లాలు ఇతర ఆస్తులు కొన్నారు. పాం జుబేరా లాంటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఆస్తులు కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్లు అందరూ దుబాయ్ ని సెకండ్ లివింగ్ ఏరియా గా భావిస్తూ అక్కడ ఖచ్చితంగా ఒక గెస్ట్ హౌస్, ఇల్లు కొనుక్కొని ఇతర ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పెట్టారు. వీటిలో రహస్య పెట్టుబడులు కూడా ఉన్నాయి.

అలాగే బడా బాబుల రహస్య కార్యకలాపాలు అన్నిటికీ దుబాయ్ అడ్డ. ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తల రహస్య వ్యవహారాలన్నీ దుబాయ్ గెస్ట్ హౌస్ లోనే జరుగుతాయనేది బహిరంగ రహస్యం.
ఇప్పటివరకు దుబాయ్ లో బాగానే నడిచింది. కానీ ఊహించని విధంగా ఇరాన్ దుబాయ్ పై విరుచుకుపడింది. మిస్సైల్స్ తో దాడులు చేసింది. ఏకంగా బుర్జ్ ఖలీఫా నీ టార్గెట్ చేసి కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ని చిందరవందర చేసేసింది. పౌరులు ఎవరు చనిపోక పోయినప్పటికీని... ఆర్థికంగా మాత్రం దుబాయ్ అతలాకుతలం అయిపోయింది. ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఆదాయం భారీగా పడిపోయింది.

దుబాయ్ మళ్లీ కోలుకోవాలంటే కనీసం నాలుగు ఐదు ఏళ్ళు పడుతుంది. అమెరికా ఎంత సహాయం చేసినప్పటికీ తనకంటూ ఆర్థికంగా ఉనికిని కాపాడుకోవడానికి... ప్రపంచ దేశాలు అన్నిటికీ ఒక నమ్మకం కలిగించడానికి దుబాయ్ కి చాలా సమయం పడుతుంది. అప్పట్లో ఎవరు దుబాయ్ వెళ్లడానికి సాహసించరు. దీంతో టూరిజం బాగా పడిపోతుంది. అక్కడ ఆస్తులకు విలువలు పడిపోతాయి.ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళందరూ గుండెలు గుబ్బేలుమన్నాయ్.

ప్రధానంగా అక్కడ అపార్ట్మెంట్లో కొన్న వాళ్లు, హోటల్స్, ట్రావెల్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నారు. కేవలం దుబాయ్ లో మాత్రమే కాదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని, కువైట్, సౌదీ, అబుదాబి, షార్జా, రస్ అల్ కైమా లో కూడా మన పారిశ్రామికవేత్తలు చాలామంది రహస్య పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఏమవుతాయో.. తిరిగి వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. ఊహించని విధంగా దుబాయ్ ముంచేసిందని లోలోపల ఏడుస్తున్నారు చాలామంది. మరో పది రోజులు అయితే గాని ఎవరికి ఎంత నష్టమో తెలియదు. కానీ వీటన్నిటి నుంచి కోలుకోవాలంటే మాత్రం దుబాయ్ కి.... దుబాయ్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కనీసం నాలుగు ఐదు ఏళ్ళు పడుతుంది.

 

Published : 
  • 4 March 2026, 12:21 PM IST