అగ్రరాజ్యం అమెరికా గర్వం ఆకాశంలోనే ముక్కలైందా..? ఇరాన్ వేసిన దెబ్బకు అమెరికా సైనిక ఆధిపత్యం కుప్పకూలిందా..? యుద్ధ చరిత్రలోనే కనివినీ ఎరుగని విధంగా.. అమెరికా గగనతల నిఘా వ్యవస్థ వెన్నెముక అయిన E-3 సెంట్రీ.. AWACS విమానాన్ని ఇరాన్ నేలకూల్చింది. ఇది కేవలం ఒక విమానం కూలిపోవడం కాదు.. ఆకాశంలో అమెరికాకు ఉన్న 'కంటిని' ఇరాన్ పొడిచేసింది. ఈ ఒక్క దెబ్బతో అమెరికా తన రాడార్ శక్తిలో 40 శాతాన్ని కోల్పోయింది. అసలు ఈ విమానం ఎందుకంత కీలకం..? దీన్ని కోల్పోవడం వల్ల అమెరికాకు కలిగిన నష్టం ఏంటి..? ఇరాన్ చేసిన ఈ సాహసం యుద్ధ గమనాన్ని ఎలా మార్చబోతోంది..?
E-3 సెంట్రీ AWACS అంటే ఏదో సాధారణ ఫైటర్ జెట్ కాదు. ఇది ఆకాశంలో తిరిగే ఒక 'ఎయిర్ బోర్న్ కమాండ్ సెంటర్'. దీని పైన ఉండే ఆ పెద్ద రాడార్ డిస్క్.. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువు విమానాలు, క్రూయిజ్ మిస్సైల్స్, చివరకు చిన్నపాటి డ్రోన్లను కూడా సెకన్లలో పసిగట్టగలదు. ఒకేసారి వందల కొద్దీ లక్ష్యాలను ట్రాక్ చేస్తూ.. యుద్ధభూమిలో ఉన్న ఫైటర్ జెట్లు, ట్యాంకర్లు, మరియు రక్షణ వ్యవస్థలకు దిశానిర్దేశం చేసే 'బ్రెయిన్' ఈ విమానం. ఈ విమానం ఆకాశంలో ఉంటేనే అమెరికాకు శత్రువు ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఇప్పుడు ఆ బ్రెయిన్ నే ఇరాన్ తుత్తునియలు చేసింది.
చాలామందికి ఒక అనుమానం రావచ్చు.. ఒక విమానం కూలిపోతే అంత నష్టమా అని? కానీ ఇది మామూలు విమానం కాదు. యుద్ధ విమానాలన్నింటికీ ఇది ఒక 'మెదడు' లాంటిది. ఒక్క AWACS విమానం గాలిలో ఉంటే.. అది తన కింద ఉన్న వందల కొద్దీ ఎఫ్-15, ఎఫ్-16 ఫైటర్ జెట్లకు కళ్లుగా మారుతుంది. ఏ శత్రువు ఎటు నుంచి వస్తున్నాడో, ఏ మిస్సైల్ ఎప్పుడు లాంచ్ అయ్యిందో కమాండ్ సెంటర్కు చెప్పేది ఇదే. ఇప్పుడు ఆ మెదడును ఇరాన్ పని చేయకుండా చేసింది. అంటే ఇప్పుడు అమెరికా ఫైటర్ జెట్లు ఆకాశంలో ఉన్నా.. అవి దారి తెలీని గుడ్డి పక్షుల్లా మారిపోయాయి. దీనినే సైనిక పరిభాషలో 'సిస్టమ్ కొల్లాప్స్' అంటారు.
గల్ఫ్ యుద్ధ క్షేత్రంలో అమెరికా మోహరించిన ఆరు విమానాల్లో ఒకటి పోవడమంటే.. అమెరికా రక్షణ వలయంలో ఒక పెద్ద రంధ్రం పడటమే. ఇప్పుడు ఇరాన్ తన డ్రోన్లను, మిస్సైల్స్ ను ఆ రంధ్రం గుండా పంపిస్తే.. అమెరికా వాటిని పసిగట్టలేదు. 'సెంట్రీ' అంటేనే కాపలాదారు అని అర్థం. ఆ కాపలాదారుడే ఇప్పుడు నేలకొరిగాడు. అమెరికా దగ్గర కొత్త విమానాలు లేవు, పాతవి రిపేర్లలో ఉన్నాయి. మిగిలిన 16 విమానాలను ప్రపంచవ్యాప్తంగా పంచుకోవాలి. అంటే, అమెరికా ఇప్పుడు తన సొంత రక్షణ కోసం ఇతర ప్రాంతాల నుండి విమానాలను ఇక్కడికి తరలించాలి.
దీనివల్ల మిగతా చోట్ల అమెరికా బలహీనపడుతుంది. ఇరాన్ వేసిన ఈ ఒక్క దెబ్బతో.. గ్లోబల్ లెవల్లో అమెరికా డిఫెన్స్ సిస్టమ్ అతలాకుతలం అయిపోయింది. అమెరికా సైన్యానికి ఇది కోలుకోలేని మానసిక దెబ్బ. గల్ఫ్ యుద్ధ ప్రాంతంలో కీలకమైన నిఘా కోసం అమెరికా ఆరు విమానాలను మోహరించింది. అంటే వారి వద్ద ఉన్న మొత్తం బలంలో 40 శాతం ఇక్కడే ఉంది. ఇప్పుడు అందులో ఒకటి ధ్వంసం కావడం వల్ల.. ఆ యుద్ధ క్షేత్రంలో రాడార్ కవరేజీలో సగం భాగం అమెరికా కోల్పోయినట్లయింది. అంటే ఇప్పుడు ఇరాన్ క్షిపణులు ఎటు నుండి వస్తున్నాయో పసిగట్టడం అమెరికాకు దాదాపు అసాధ్యం.
ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు.. అంతకంటే పెద్ద వ్యూహాత్మక నష్టం. ఈ విమానం లేకపోతే అమెరికాకు ఆకాశంలో గుడ్డితనం వచ్చినట్లే. ఇరాన్ ప్రయోగించే డ్రోన్లను, మిస్సైల్స్ ను సకాలంలో గుర్తించి అడ్డుకునే సామర్థ్యం అమెరికాకు తగ్గిపోయింది. 'మేము ఎవరికైనా చుక్కలు చూపిస్తాం' అన్న అమెరికా అహంకారాన్ని.. ఇరాన్ తన క్షిపణులతో గాలిలోనే కలిపేసింది. గగనతలంలో అమెరికా ఆధిపత్యం ఇక ముగిసినట్టేనా..? అని నిపుణులు చర్చించుకుంటున్నారు. ఒక్క విమానం కూలిపోవడం వల్ల అమెరికా యుద్ధ వ్యూహాలన్నీ ఇప్పుడు రీ-ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇరాన్ ను తక్కువ అంచనా వేయవద్దని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా గర్వించే AWACS విమానాన్ని నేలకూల్చి.. ఇరాన్ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఆకాశంలో కళ్ళు లేని అగ్రరాజ్యం.. ఇరాన్ క్షిపణులను ఎలా ఎదుర్కొంటుంది? ఈ నష్టం నుంచి అమెరికా కోలుకోగలదా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.